E-Paper
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతర్.. సచివాలయానికే పరిమితమైన కొత్త పాలసీ ఫైళ్లు!

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతర్.. సచివాలయానికే పరిమితమైన కొత్త పాలసీ ఫైళ్లు!
Advertisement

Advertisement Policy: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలో అక్రమ అడ్వర్ టైజ్ మెంట్లు, హోర్డింగ్ లకు చెక్ పెట్టేందుకు సర్కారు ఎంతో హడావుడిగా తీసుకువచ్చిన అడ్వర్ టైజ్ మెంట్ కొత్త పాలసీ ఏమైనట్టు? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్వర్ టైజ్ మెంట్లు, హోర్డింగ్‌ల ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, చారితక్ర హైదరాబాద్ నగర శోభ దెబ్బతినకుండా కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ప్రకటనలను ఏర్పదాటు చేసే దిశగా తెచ్చిన కొత్త పాలసీ ఇంకా అమలు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది.

కొత్త పాలసీ అటకెక్కిందా..?

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు, ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు సర్కారు కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీని ప్రకటించిందే తప్పా, కనీసం అడ్వర్ టైజ్ మెంట్ రెగ్యులేటరీ కమిటీని కూడా నియమించకపోవటంతో కొత్త పాలసీ అటకెక్కిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పాలసీలో విధి విధానాలు, కేటగిరీలవారీగా ఫీజులు, రెగ్యులరేటరీ కమిటీ, ఎన్ ఫోర్స్ మెంట్, పెనాల్టీల విధింపు వంటివాటిని రూపొందిస్తూ ప్రభుత్వం జీఓ నెం.84ని జారీ చేసిన సంగతి తెల్సిందే. సర్కారు ఈ ఆదేశాలు జారీ చేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా, కొత్త పాలసీ ఎక్కడా అమలుకు నోచుకోకపోవటంతో అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి..

Advertisement

పాలసీ రాకముందు కంటే వచ్చిన తర్వాతనే అక్రమ హోర్డింగ్‌ల దందా పెరిగిపోవటం కొత్త పాలసీని అటకెక్కిస్తున్నారనేందుకు బలాన్ని చేకూర్చుతుంది. ఏకంగా బడా ఎజెన్సీల ప్రతినిధులు రేటుకట్టి దందా చేస్తున్నా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడడటంతో పాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా అడ్వర్ టైజ్ మెంట్లు, హోర్డింగ్ లు వెలుస్తున్నా, కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Also Read: janasena : జనసేనలో డేంజర్ బెల్స్.. కారణం ఎవరు?

ఆరేళ్ల క్రితం నిషేధం

Advertisement

గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో హోర్డింగ్ లు, యునిపోల్స్ పై జీహెచ్ఎంసీ వ్యాపార ప్రకటనలు కొనసాగేవి. ఆరేళ్ల క్రితం వర్షాకాలం బలమైన ఈదురు గాలులు వీయటం, హోర్డింగ్, యునిపోల్స్ వంటి వాటి స్ట్రక్చరల్ స్టెబిలిటీ కొల్పోయినందున పలు చోట్ల యూనిపోల్స్, హోర్డింగ్ లు కూలి, పలువురు పౌరులు ప్రాణాలను కొల్పోయిన ఘటనలు చాలా జరిగాయి. ఒక వైపు స్ట్రక్చరల్ స్టెబిలిటీ మెరుగుపరిచే అవకాశం లేకపోవటం, మరో వైపు వరుసగా ప్రమాదాలు జరిగి జనాలు ప్రాణాలు కొల్పోతున్నందున హోర్డింగ్ లు, యునిపోల్స్ పై జీహెచ్ఎంసీ 2020లో నిషేధం విధించింది.

ప్రభుత్వం కొత్త పాలసీ..

నిషేధంతో తాము నష్టపోతున్నామని, హోర్డింగ్ లపై కోట్లాది రూపాయలు పెట్టామని కొందరు యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు కోర్డుని ఆశ్రయించారు. ఆ తరువాత కొత్త పాలసీపై ప్రయత్నాలు జరిగాయి. కానీ బీఆర్ఎస్​ ప్రభుత్వం హాయాంలో ప్రతిపాదనలు సిద్దమైనా, పాలసీ మాత్రం తీసుకురాలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పాలసీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించి, కేవలం జీవో జారీకే పరిమితమైంది. కొత్త పాలసీ వచ్చిన తర్వాత అక్రమ హోర్డింగ్ లపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా, కొత్త పాలసీ, దాన్ని నియమ నిబంధనల రూపకల్పన అనేవి కేవలం సచివాలయం స్థాయి సమావేశాలకే పరిమితమైందే తప్పా, క్షేత్ర స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపటం లేదు.

అంతా అక్రమంగానే..

సర్కారు కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీని తీసుకువచ్చినా, దాని అమలు లేకపోవటంతో ప్రస్తుతం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అడ్వర్ టైజ్ మెంట్, హోర్డింగ్ ల దందా అక్రమంగా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఏకంగా ఒక్కోదానికి ఒక్కో రేటు నిర్ణయించడంతోపాటు చోటామోటా ఎజెన్సీల నుంచి బడా ఎజెన్సీలకు సంబంధించిన వ్యక్తులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమ అడ్వర్ టైజ్ మెంట్ల దందాలు చేస్తున్న కొందరు ప్రత్యేకంగా యూనియన్లు పెట్టుకుని మరీ కొత్త పాలసీని వ్యతిరేకిస్తున్నారు.

Also Read: తెలంగాణ హక్కులపై గళమెత్తిన ఎంపీ చామల.. ప్రధాని మోదీకి సూటి ప్రశ్నలు

జోరుగా ప్రచారం..

తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్(టోమో) కోర్ కమిటీ పేరుతో ఏకంగా రేట్లు నిర్ణయించి హాయిగా వసూళ్లు కూడా చేస్తుంది. హోర్డింగ్ రూ.10వేలు, యూనిఫోల్ రూ.50వేలు, ఆర్చ్,క్యాంటీ లేవర్ రూ.15వేలు, బస్ షెల్టర్ రూ.5వేలు, లాలిపప్ రూ.1500 చెల్లించి వ్యాపారాలను కొనసాగించుకోవాలని సూచించినట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీనిపై చిన్న ఎజెన్సీల ప్రతినిధులు వ్యతిరేకంగా ఉన్నా, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అక్రమంగా అడ్యర్ టైజ్ మెంట్ల దందాలు చేస్తున్న పెద్ద ఎజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు.

రెగ్యులేటరీ కమిటీ ఎక్కడ?

కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ప్రభుత్వం అడ్వర్ టైజ్ మెంట్ రెగ్యులేటరీ కమిటీ(ఏఆర్సీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు జీఓ నెం,84లో పేర్కొన్నది. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లతోపాటు హెచ్ఎండీఏ కమిషనర్, పోలీసు కమిషనర్(ట్రాఫిక్), హెచ్ఎంఆర్ఎల్, టీజీఆర్టీసీ, టూరిజం శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. అయితే పాలసీ వచ్చి నెలరోజులు గడిచినా కమిటీ పనిచేయడంలేదనే విమర్శలున్నాయి. అయితే ఒక సీఎంసీ పరిధిలోనే అనుమతిలేని అడ్వర్ టైజ్ మెంట్ బోర్డులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.

అడ్వర్ టైజ్ మెంట్లతో..

జీహెచ్ఎంసీ, ఎంఎంసీ పరిధిలో ఏలాంటి చర్యలు తీసుకోవడంలేదనే చర్చ జరుగుతున్నది. ఎన్ ఫోర్స్ మెంట్ కూడా లేకపోవడంతో అనుమతిలేని అడ్వర్ టైజ్ మెంట్ దందా సాగుతున్నదని పలువురు విమర్శిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని అడ్వర్ టైజ్ మెంట్లతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం దారి మళ్లకుండా చర్యలు తీసుకోవాలని చిన్న ఎజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. పక్షం రోజుల ముందు ఈ కొత్త పాలసీపై సచివాలయంలో ఓ సమావేశాన్ని కూడా నిర్వహించినట్లు తెలిసింది.

Also Read: బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని మహిళా నేతలు డిమాండ్.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×