E-Paper
Advertisement

Hero Electric Bike: హీరో నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే భయ్యా!

Hero Electric Bike: హీరో నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే భయ్యా!
Advertisement

ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్ లో హీరోకు ఉన్న గుర్తింపు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండే మోటార్ సైళ్లు, స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల నుంచి ఈ కంపెనీ వాహనాలకు మంచి ప్రజాదరణ ఉంది కూడా. ఈ నేపథ్యంలోనే కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురాబోతోంది. గత ఐదు సంవత్సరాలుగా, దేశంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టూవీలర్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై మొగ్గు చూపుతున్నాయి. ఈ దిశలో హీరో మోటోకార్ప్ కీలక ముందడుగు వేసింది. కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ బైక్‌ కోసం భారత్ లో డిజైన్ పేటెంట్ కు అప్లై చేసింది. ఈ బైక్ లాంచ్ ఈ ఏడాదిలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హీరో ఎలక్ట్రిక్ బైక్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

హీరో ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ పేటెంట్ గురించి..

Advertisement

హీరో కంపెనీ అధికారికంగా టైమ్‌ లైన్‌ ను కన్ఫార్మ్ చేయనప్పటికీ, వారి భవిష్యత్ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్స్ తీసుకురాగలవో పేటెంట్ రైట్స్ ఫైలింగ్స్ స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. హీరో మోటోకార్ప్ దాని EV బ్రాండ్ విడా కింద ఎలక్ట్రిక్ పోర్ట్‌ ఫోలియోను మరింత విస్తరించడానికి రెడీ అవుతోంది. కంపెనీ విడా VXZ బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. భారత్ లో ఇప్పటికే డిజైన్ పేటెంట్‌ను అప్లై చేసింది. ఈ బైక్ ను మిలన్‌ లో జరిగిన EICMA 2025లో తొలుత ప్రదర్శించింది. ఈ మోటార్ సైకిల్ ను జీరో మోటార్ సైకిల్స్ తో కలిసి డెవలప్ చేసింది.

హీరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఉండబోతుందంటే?

పేటెంట్ పొందిన డిజైన్ విడా VXZ ను స్పోర్టి, స్ట్రీట్ ఫైటర్ మాదిరిగా ఉంటుంది. మాస్ ఫార్వర్డ్ లుక్ తో ఆకట్టుకుటుంది. మోటార్ సైకిల్ హంచ్డ్ రైడింగ్ స్టైల్, షార్ప్ ట్యాంక్ ఎక్స్‌ టెన్షన్స్, స్ప్లిట్ సీట్ సెటప్‌తో కాంపాక్ట్, అప్‌ స్వెప్ట్ టెయిల్ సెక్షన్ కలిగి ఉంది.  ట్యాంక్ లాంటి నిర్మాణం ఛార్జింగ్ హార్డ్‌ వేర్, స్టోరేజ్ లాంటి భాగాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.  VXZ పార్శియల్ గా   ట్యూబులర్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. సస్పెన్షన్ డ్యూటీస్ ను అప్ సైడ్ డౌన్ చేసే ముందు ఫోర్కులు, సెంట్రల్‌గా మౌంటెడ్ బ్యాక్ మోనోషాక్ ద్వారా నిర్వహిస్తారు. బ్రేకింగ్ హార్డ్‌ వేర్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. సెంట్రల్‌గా మౌంటెడ్ బ్యాటరీ ప్యాక్ ఫ్రేమ్ లోపల ఉంటుంది.  అయితే, హీరో మోటోకార్ప్ బ్యాటరీ సామర్థ్యం, ​​మోటార్ అవుట్‌ పుట్,  రేంజ్ గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఇతర విషయాలను పరిశీలిస్తే.. ఫార్ప్ న LED హెడ్‌ ల్యాంప్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, చిన్న సెమీ ఫెయిరింగ్ ఉన్నాయి. త్వరలోనే హీరో ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Read Also: భారత్ లో రెనాల్ట్ లోగో కంటే డస్టర్ లెటర్స్ పెద్దగా ఉంటాయి, ఎందుకో తెలుసా?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×