E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మళ్లీ మార్కెట్ లోకి స్ప్లెండర్ ప్రో క్లాసిక్.. హీరో ప్లాన్ మామూలుగా లేదుగా!

మళ్లీ మార్కెట్ లోకి స్ప్లెండర్ ప్రో క్లాసిక్.. హీరో ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

Hero Splendor Pro Classic Patent Filed: భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో హీరో స్ప్లెండర్ ఒకటి. ఇప్పుడు ఈ బైక్‌కు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. హీరో మోటోకార్ప్ తాజాగా స్ప్లెండర్ ప్రో క్లాసిక్ పేరుతో కొత్త పేటెంట్‌ను దాఖలు చేసింది. దీంతో ఈ రెట్రో స్టైల్ బైక్ మరోసారి భారత మార్కెట్లోకి రానుందనే చర్చ మొదలైంది.

2014లో స్ప్లెండర్ ప్రో క్లాసిక్‌ ఎంట్రీ

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్‌ను మొదటిసారి 2014లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. పాతకాలపు డిజైన్, ప్రత్యేకమైన లుక్‌తో ఈ బైక్ అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, కాలుష్య నిబంధనల కారణంగా 2018లో ఈ మోడల్‌ను కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు కొత్త పేటెంట్ దాఖలుతో ఈ బైక్ మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త మోడల్‌ లో పాత డిజైన్‌ను కొనసాగిస్తూనే కొన్ని ఆధునిక ఫీచర్లను కూడా జోడించే అవకాశం ఉంది.

ఆకట్టుకుంటున్న డిజైన్

Advertisement

తాజాగా పేటెంట్ డిజైన్ ప్రకారం, ఈ బైక్‌లో గుండ్రని LED హెడ్‌ ల్యాంప్, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌ లెస్ టైర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేకమైన సింగిల్ సీట్, తక్కువ ఎత్తులో ఉండే హ్యాండిల్‌ బార్, రెట్రో కేఫ్ రేసర్ స్టైల్‌ ను కూడా కంపెనీ కొనసాగించవచ్చని తెలుస్తోంది. ముందు భాగంలో కొత్త డ్యూయల్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ను అందించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న స్ప్లెండర్ మోడళ్ల తో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా ఉండనుంది.

ఇంజిన్ గురించి..

ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 97.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ ను కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 8.2 bhp పవర్, 8 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4 స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, మరింత పవర్ కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ 125 సీసీ వెర్షన్‌ ను కూడా తీసుకురావచ్చని  తెలుస్తోంది. అదనంగా భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై కూడా హీరో పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

భారత మార్కెట్లో ప్రస్తుతం రెట్రో స్టైల్ బైక్‌ లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే సరసమైన ధరలో క్లాసిక్ డిజైన్‌తో స్ప్లెండర్ ప్రో క్లాసిక్‌ ను తీసుకువస్తే మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ఈ బైక్‌ను స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ఎక్స్‌ టెక్ మోడళ్ల మధ్య ధర శ్రేణిలో ఉంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే 1990ల నాటి అసలు స్ప్లెండర్ బైక్‌లను గుర్తు చేసే ప్రత్యేక రంగులతో కూడా దీనిని విడుదల చేసే అవకాశం ఉంది.  ఒకవేళ హీరో ఈ మోడల్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తే, తక్కువ ధరలో రెట్రో లుక్ బైక్ కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అంతేకాదు, స్ప్లెండర్ బ్రాండ్‌ కు ఉన్న ప్రత్యేక గుర్తింపును ఈ మోడల్ కు మరింత క్రేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.

Read Also: జూలైలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ.. EV ప్రియులకు పండగే!

Related News

రెనాల్ట్ కైగర్‌కు 4 కొత్త వేరియంట్లు.. తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్స్!

జూలైలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ.. EV ప్రియులకు పండగే!

జూలై 2026లో భారత మార్కెట్‌లోకి రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. EV ప్రియులకు పండుగే!

ఇండియన్స్ మనసు గెలిచిన టాప్ 5 హోండా కార్లు.. ఇవి వాహనాలు కాదు, ఓ భావోద్వేగం!

ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్మార్ట్ ఫీచర్స్.. జెన్ Z కోసం టాప్ 5 స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

IRCTC అదిరిపోయే ఊటీ టూర్ ప్యాకేజీ.. ప్రకృతి ప్రేమికులకు 4 రోజులు పండుగే పండుగ!

హైవేపై కారు చెడిపోయిందా? ఇక మెకానిక్ కోసం వెతకాల్సిన పనిలేదు!

Big Stories

×