E-Paper
Advertisement

హోమ్ ఛార్జింగ్ vs ఫాస్ట్ ఛార్జింగ్.. టాటా పంచ్ EVకి ఏది బెస్ట్?

హోమ్ ఛార్జింగ్ vs ఫాస్ట్ ఛార్జింగ్.. టాటా పంచ్ EVకి ఏది బెస్ట్?
Advertisement

Tata Punch EV Charging Cost: టాటా పంచ్ EV వినియోగదారులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఛార్జింగ్ కాస్ట్. ఒక ఫుల్ ఛార్జ్ కు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో ఇంట్లో ఛార్జింగ్ చేస్తే తక్కువ ధర అవుతుందా? పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ లో ఛార్జ్ చేయించుకుంటే తక్కువ ధర అవుతుందా? అనేది తెలియదు. ఈ నేపథ్యంలో టాటా పంచ్ ఈవీకి సంబంధించి  ఛార్జింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

హోమ్ ఛార్జర్ గురించి..

పంచ్ ఈవీకి సంబంధించి హోమ్ ఛార్జింగ్ చేస్తే, సాధారణంగా యూనిట్‌కు రూ.7 నుంచి రూ. 9 వరకు కరెంట్ రేటు ఉంటుంది.  ఈ రేట్ల ప్రకారం, టాటా పంచ్ EV పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు రూ.240 నుంచి రూ.350 వరకు ఖర్చవుతుంది. ఇది మీ దగ్గర ఉన్న బ్యాటరీ సైజ్‌పై ఆధారపడి ఉంటుంది. చిన్న బ్యాటరీ  సుమారు 30 kWh  ఉంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. పెద్ద బ్యాటరీ  సుమారు 40 kWh ఉంటే కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ ఛార్జ్‌ తో సుమారు 300 కి.మీ,  అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అంటే, కిలోమీటరుకు సుమారు రూ. 0.70 నుంచి రూ.0.80 ఖర్చవుతుంది.  పెట్రోల్ కార్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే చాలా మంది రోజువారీ ఉపయోగం కోసం EVలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

పబ్లిక్ ఛార్జింగ్ గురించి..

Advertisement

ఇక పబ్లిక్ ఛార్జింగ్ గురించి చూస్తే, ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో యూనిట్‌ కు రూ. 14 నుంచి రూ. 24 వరకు వసూలు చేస్తారు. ఈ రేట్ల ప్రకారం, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి రూ.600 నుంచి రూ.900 వరకు అవుతుంది. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ఖర్చవచ్చు. అయితే, ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. ఎందుకంటే ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే, కారు బ్యాటరీని 20% నుంచి 80% వరకు కేవలం 30 నుంచి 50 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. హోమ్ ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది నెమ్మదిగా జరుగుతుంది. 3.3 Kw, 7.2 kW ఛార్జర్‌ తో పూర్తి ఛార్జ్ అవ్వడానికి సుమారు 6 నుంచి 10 గంటలు పడుతుంది. రాత్రి సమయంలో సులభంగా చేయవచ్చు. ఎక్కువ మందికి ఇది సమస్యగా అనిపించదు.

పంచ్ EVలో రెండు బ్యాటరీ ఆప్షన్లు

ఇక  పంచ్ EVలో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. చిన్న బ్యాటరీ సుమారు 260–275 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ అయితే సుమారు 330–350 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. అయితే, ఛార్జింగ్ సమయంలో కొంత ఎనర్జీ లాస్ ఉంటుంది. సాధారణంగా ఇది 5% నుంచి 15% వరకు ఈ వేస్టేజ్ ఉంటుంది. చెల్లించే విద్యుత్ ఖర్చు బ్యాటరీ సామర్థ్యంతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Read Also: లో కాస్ట్.. హై రేంజ్.. ఈ టాటా ఈవీ ముందు మిగతా కార్లన్నీ దిగదుడుపేనోయ్!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×