E-Paper
Advertisement

మడతపెట్టే ఈవీ స్కూటర్ వచ్చేసింది.. బరువు జస్ట్ 20 కేజీలే!

మడతపెట్టే ఈవీ స్కూటర్ వచ్చేసింది.. బరువు జస్ట్ 20 కేజీలే!
Advertisement

Honda MotoCompacto: ఆటో దిగ్గజం హోండా తాజాగా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది.  మోటో కాంపాక్టో పేరుతో మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. సిటీలో తక్కువ దూర ప్రయాణాల కోసం దీనిని రూపొందించింది. ఇది సాధారణ స్కూటర్‌ లా కాకుండా, మడత పెట్టగలిగే కాంపాక్ట్ డిజైన్‌ తో ఉండటం దీని ప్రత్యేకత. చూడటానికి సూట్‌ కేస్‌ లా కనిపించే ఈ ఈవీ, అవసరం లేని సమయంలో సులభంగా మడిచి చేతిలో పట్టుకుని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

లాస్ట్ మైల్ ప్రయాణాల కోసం..

ఈ స్కూటర్‌ ను  లాస్ట్ మైల్ ప్రయాణాల కోసం డిజైన్ చేశారు. అంటే, మెట్రో స్టేషన్ నుంచి ఆఫీస్‌ కి, క్యాంపస్‌ లో ఒక చోటు నుంచి మరో చోటుకు, లేదంటే పర్యాటక ప్రాంతాల్లో చిన్న దూరాలకు  చాలా ఉపయోగపడుతుంది. పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఆప్షన్‌ గా పనిచేస్తుంది.

మోటో కాంపాక్టో డిజైన్ గురించి..

Advertisement

మోటో కాంపాక్టో  పూర్తిగా ఫోల్డబుల్. హ్యాండిల్‌ బార్, సీటు సహా అన్ని పార్ట్ లు ఫోల్డ్ చేసేలా ఉంటాయి. దీన్ని మడిచిపెడితే,  ఇది చిన్న లగేజ్‌ బ్రీఫ్ కేసులా కనిపిస్తుంది. తీసుకెళ్లడానికి క్యారీ హ్యాండిల్ కూడా ఉంది. అలాగే, సైడ్ స్టాండ్, ఫుట్‌ రెస్ట్‌ లు వాడని సమయంలో బయట కనిపించవు. చిన్న LED హెడ్‌ లైట్, టెయిల్ లైట్ కూడా ఇవ్వడం వల్ల రాత్రి కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

బ్యాటరీ రేంజ్ గురించి..

మోటో కాంపాక్టో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో 490W ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 16 Nm టార్క్ ఇస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు సుమారు 24 కి.మీ. ఇది హై స్పీడ్ కోసం కాదు. సేఫ్, స్లో సిటీ రైడింగ్ కోసం తయారు చేశారు. 0 నుంచి 24 కి.మీ వేగాన్ని చేరుకోవడానికి సుమారు 7 సెకన్లు పడుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే,   6.8Ah సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 19 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. తక్కువ  దూరాలకు ఇది సరిపోతుంది. రోజూ 5 నుంచి 8 కి.మీ ప్రయాణించే వారికి ఇది మంచి ఎంపిక. ముఖ్యంగా, ఛార్జింగ్ పోర్ట్‌ లు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో ఉపయోగిస్తే మరింత సౌకర్యంగా ఉంటుంది. ఛార్జింగ్ చేయడం కూడా చాలా సులభం. సాధారణ 15 ఆంప్ ప్లగ్‌తోనే దీనిని ఛార్జ్ చేయవచ్చు. పూర్తి ఛార్జ్ అవ్వడానికి సుమారు 3.5 గంటలు పడుతుంది.

20 కిలోల బరువుతో 120 కేజీల బరువు క్యారీ

Advertisement

ఈ స్కూటర్ బరువు తక్కువగా ఉన్నప్పటికీ, సుమారు 120 కిలోల వరకు లోడ్‌ను మోస్తుంది. అంటే, పెద్దవాళ్లు కూడా సౌకర్యంగా దీని మీద ప్రయాణించే అవకాశం ఉంటుంది. చిన్న డిజిటల్ డిస్ ప్లేలో బ్యాటరీ లెవెల్, స్పీడ్ లాంటి వివరాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ స్కూటర్ ధర అమెరికాలో $995 (సుమారు రూ. 80,000 పైగా)గా ఉంది.

Read Also: టాటా పంచ్ EVకి పోటీగా BYD అట్టో 1.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×