E-Paper
Advertisement

స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్‌.. భారత మార్కెట్ లోకి హోండా ZR-V వచ్చేస్తోంది!

స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్‌.. భారత మార్కెట్ లోకి హోండా ZR-V వచ్చేస్తోంది!
Advertisement

Honda ZR-V India Debut Soon: ప్రముఖ ఆటో మోబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా మరో క్రేజీ కారును భారతీయ మార్కెట్ కు పరిచయం చేయబోతోంది. Honda ZR-V పేరుతో రిలీజ్ చేయబోతోంది. మే 22న హోండా రెండు కొత్త మోడళ్లను తీసుకురానుండగా, అందులో హోండా సిటీ ఫేస్‌ లిఫ్ట్‌ తో పాటు ఈ కొత్త ప్రీమియం SUV కూడా ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.  ZR-Vను కంపెనీ పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే CBU మోడల్‌గా తీసుకురానుంది. దీంతో ఇది సాధారణ SUVల కంటే కొంచెం ప్రీమియం స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.

కళ్లు చెదిరే డిజైన్

డిజైన్ పరంగా హోండా ZR-V స్టైలిష్ క్రాస్‌ ఓవర్ డిజైన్‌ ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్‌తో పాటు స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి. సైడ్ నుంచి చూస్తే ఇది తక్కువ ఎత్తులో, పొడవుగా కనిపిస్తుంది. వాలుగా ఉండే రూఫ్‌ లైన్, పొడవైన వీల్‌ బేస్ కారణంగా  స్పోర్టీ ఫీల్ ఇస్తుంది. వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్, సింపుల్ టెయిల్‌ గేట్ డిజైన్ ఉంటాయి. ఈ SUV అర్బన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు అనిపిస్తుంది.

ప్రీమియం లుక్ ఇంటీరియర్

Advertisement

ఇంటీరియర్‌ లో కూడా హోండా ప్రీమియం లుక్ ఇవ్వడానికి ప్రయత్నించింది. డాష్‌ బోర్డ్‌ పై పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండగా, కింద భాగంలో ఫిజికల్ బటన్లు, రోటరీ కంట్రోల్స్‌ను అందించారు. క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను సులభంగా ఉపయోగించుకునేలా అమర్చారు. క్యాబిన్‌ లో మంచి ఫినిషింగ్‌ తో పాటు మెటాలిక్ టచ్‌లు కూడా కనిపిస్తాయి.

అత్యాధునిక ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్, ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌ రూఫ్, పవర్డ్ టెయిల్‌ గేట్, వైర్‌ లెస్ ఛార్జర్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. భద్రత కోసం మల్టిపుల్ ఎయిర్‌ బ్యాగ్స్, ABS వంటి సిస్టమ్స్ కూడా అందించనున్నారు.

 ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజిన్ విషయానికి వస్తే, భారత మార్కెట్ కోసం హోండా ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు.  గ్లోబల్ మోడల్‌ లో ఉన్న 2.0 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ సెటప్ సుమారు 180 hp పవర్, 240 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

ధర ఎంత ఉంటుందంటే?

ధర విషయానికి వస్తే, ఇది పూర్తిగా దిగుమతి చేసుకునే మోడల్ కావడంతో  ఎక్స్‌ షోరూమ్ ధర సుమారు రూ. 50 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఈ కారు విడుదలైన తర్వాత వోక్స్‌ వ్యాగన్ టిగువాన్, స్కోడా కొడియాక్, నిస్సాన్ ఎక్స్ ట్రైల్ లాంటి ప్రీమియం SUVలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Read Also: మారుతి ఈకో స్టార్ ఎడిషన్ వచ్చేసింది.. కొత్త లుక్‌ అదిరింది భయ్యా!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×