E-Paper
Advertisement

Hyundai Creta: హ్యూండాయ్ క్రెటా కార్ కొనాలంటే మీ నెల జీతం ఎంతుండాలి? నెలకు ఎంత ఈఎమ్ఐ కట్టాలి?

Hyundai Creta: హ్యూండాయ్ క్రెటా కార్ కొనాలంటే మీ నెల జీతం ఎంతుండాలి? నెలకు ఎంత ఈఎమ్ఐ కట్టాలి?
Advertisement

భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన SUV కార్లలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్లు, కంఫర్ట్ అన్నీ కలిపి ఇది మధ్యతరగతి ప్రజలకు డ్రీమ్ కార్‌గా మారింది. అయితే ఈ కారును కొనాలంటే ఎంత జీతం ఉండాలి? EMI ఎంత కట్టాలి? వంటి సందేహాలు ఎక్కువ మందికి ఉంటాయి. సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే ఈ కారును కొనడం అంత కష్టమైన పని కాదు. కానీ ముందుగా మీ ఆదాయం, ఖర్చులు అన్నీ లెక్కలో పెట్టుకోవడం చాలా అవసరం.

ఎంత లోన్ పెట్టవచ్చు?
హ్యుందాయ్ క్రెటా ధర వేరియంట్‌ను బట్టి మారుతుంది. సాధారణంగా ఈ కార్ ఎక్స్ షోరూమ్ ధర సుమారు 11 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అయితే ఆన్-రోడ్ ధర మాత్రం ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి కారణాల వల్ల ఇంకా పెరుగుతుంది. సాధారణంగా ఈ కారును కొనాలంటే కనీసం 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్‌గా తీసుకుంటారు. ఉదాహరణకు మీరు 15 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకుంటే ప్రతి నెలా ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

ఇక EMI లెక్కలు చూస్తే మీరు 15 లక్షల రూపాయల లోన్‌ తీసుకుని 5 సంవత్సరాల కాలానికి తీరుస్తామని పెట్టుకుంటే.. వడ్డీ రేటు సుమారు 9 శాతం నుంచి 10 శాతం మధ్య ఉంటుంది. అప్పుడు నెలకు రూ.23,000 నుంచి రూ.25,000 వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది. లోన్ కాలం పెంచితే EMI కొంచెం తగ్గుతుంది. కానీ మొత్తం వడ్డీ మాత్రం ఎక్కువ అవుతుంది. అందుకే EMI తక్కువగా ఉండాలని చూసి ఎక్కువ కాలానికి లోన్ తీసుకోవడం కంటే, మీ సామర్థ్యానికి సరిపోయే విధంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

Also read:Funerals: మహిళలు శ్మశానంలోని అంత్యక్రియల్లో ఎందుకు పాల్గొనకూడదు? ఈ నియమం ఎవరు పెట్టారు?

Advertisement

ఎంత జీతం ఉండాలి?
ఈ కారును కొనాలంటే ఎంత జీతం ఉండాలి? ఫైనాన్స్ నిపుణులు చెప్పే సాధారణ నియమం ప్రకారం మీ నెల జీతంలో 20 శాతం నుంచి 25 శాతం వరకు మాత్రమే EMIగా చెల్లించాలి. అంటే మీరు నెలకు రూ.25,000 EMI చెల్లించాలనుకుంటే మీ జీతం కనీసం లక్ష రూపాయలు ఉండాలి. ఇలా చేస్తే మీ ఇతర ఖర్చులు, సేవింగ్స్ మీద ఎక్కువ ప్రభావం ఉండదు. కనీసం ₹80,000 నుంచి ₹1 లక్ష మధ్య జీతం ఉంటే హ్యుందాయ్ క్రెటా కొనడం సేఫ్‌గా భావించవచ్చు.

కారు కొనడం అంటే EMI మాత్రమే కాదు, మరెన్నో ఖర్చులు కూడా ఉంటాయి. ఇన్సూరెన్స్, ఫ్యూయల్ ఖర్చు, మెయింటెనెన్స్, సర్వీసింగ్ ఇవి ప్రతి నెలా లేదా సంవత్సరం కొద్దీ ఖర్చు అవుతాయి. ఇవి కూడా మీ బడ్జెట్‌లో భాగంగా ఉండాలి. చాలామంది EMI చూసి కారును కొనేస్తారు.. కానీ తర్వాత ఈ అదనపు ఖర్చులతో ఇబ్బంది పడుతుంటారు. హ్యుందాయ్ క్రెటా ఒక మంచి SUV అయినప్పటికీ దాన్ని కొనడానికి సరైన ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం.

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×