E-Paper
Advertisement

Lexus LX recalled: భారత్ లో లెక్సస్ LX రీకాల్, కారణం ఏంటో తెలుసా?

Lexus LX recalled: భారత్ లో లెక్సస్ LX రీకాల్, కారణం ఏంటో తెలుసా?
Advertisement

జపనీస్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ దేశీ మార్కెట్ లోకి విడుదల చేసిన 117 LX SUVలను రీకాల్ చేసింది. 10-స్పీడ్ గేర్ బాక్స్ సాఫ్ట్ వేర్ లో సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లెక్సస్ ఇండియా ప్రకటించింది. ఈ కార్లలో ట్రాన్స్‌ మిషన్ నష్టాన్ని నివారించడానికి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు ఉచిత ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ అప్ డేట్స్ అందిస్తారని వెల్లడించింది. లెక్సస్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌ షిప్ SUV LXకు రీకాల్ జారీ చేసింది. దేశంలో సుమారు 117 లెక్సస్ LXలను రీకాల్ చేసినట్లు తెలిపింది. మార్చి 6, 2025 నుంచి సెప్టెంబర్ 29, 2025 వరకు తయారు చేసిన కార్లకు ఈ రీకాల్ వర్తిస్తుందని ప్రకటించింది.

లెక్సస్ LX రీకాల్ చేయడానికి కారణం ఏంటంటే?

Advertisement

జపనీస్ లగ్జరీ ఆటోమేకర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ కారు 10 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో వస్తుంది. గేర్ షిఫ్ట్‌ ల కోసం లెక్సస్ LX లీనియర్ సోలనోయిడ్లపై ఆధారపడుతుంది. సోలనోయిడ్‌ లలో ఒకదాని ఫెయిల్యూర్ గేర్‌ను మార్చడానికి ముందు ఇంజిన్ ఉద్దేశించిన పరిమితి కంటే చాలా ఎక్కువగా రివింగ్‌కు దారితీస్తుందని తెలిపింది. ఈ సమస్య వల్ల విద్యుత్ సరఫరా తగ్గడం లేదంటే ట్రాన్స్‌ మిషన్ లోపల నష్టం కూడా సంభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో లెక్సస్ LXలో ట్రాన్స్‌ మిషన్ ఫ్లూయిడ్ లీకేజీకి కారణం అవుతుంది.

లెక్సస్ LX రీకాల్.. సమస్య పరిష్కారం

Advertisement

ఈ లగ్జరీ కారులో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి ఆథరైజ్డ్ డీలర్‌ షిప్‌లు ఇంజిన్, ట్రాన్స్‌ మిషన్ రెండింటినీ నిర్వహించే ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్(ECM)ను అప్‌ డేట్ చేస్తాయి. అంతేకాకుండా, ఈ రీకాల్‌ లో భాగంగా ఈ ఫ్లాగ్‌ షిప్ SUVలో అవసరమైన సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్ చేస్తారు.  ఈ రీకాల్ కు సంబంధించి  ప్రభావిత లెక్సస్ LX మోడళ్ల యజమానులను డీలర్లు సంప్రదిస్తారని కంపెనీ ప్రకటించింది. వారి మోడల్ ఈ రీకాల్ లో ఉందా? లేదా? అనేది వివరాస్తారు. ఒకవేళ వినియోగదారులు తెలుసుకోవాలనుకుంటే కస్టమర్లు దగ్గర లోని సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని సూచించింది.

Read Also:  టాటా సియెర్రా EV To మహీంద్రా XUV.e8.. మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ ఈవీలు!

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కూడా రీకాల్!

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300, లెక్సస్ LX ఒకే ప్లాట్‌ ఫామ్‌ పై నిర్మించబడినందున, ఫ్లాగ్‌ షిప్ టయోటా SUV ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది. ల్యాండ్ క్రూయిజర్ 300కు సంబంధించి 969 యూనిట్లకు కంపెనీ రీకాల్ జారీ చేసింది.  సెప్టెంబర్ 4, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 మధ్య తయారు చేయబడిన ల్యాండ్ క్రూయిజర్ 300, ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ లో సమస్య కారణంగా రీకాల్ చేయబడింది. ఈ కారు కూడా లెక్సస్ LX లాగానే ఉంటుంది.

Read Also: బెంజ్ కార్లలో ఇంత పెద్ద తప్పా? ఏకంగా 3 మోడల్స్ రీకాల్!

Related News

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×