E-Paper
Advertisement

Mahindra New EV King: టాటాను వెనక్కి నెట్టిన మహీంద్రా, ఎలక్ట్రిక్ కార్లలో ఇప్పుడు టాప్ మోడల్ ఇదే!

Mahindra New EV King: టాటాను వెనక్కి నెట్టిన మహీంద్రా, ఎలక్ట్రిక్ కార్లలో ఇప్పుడు టాప్ మోడల్ ఇదే!
Advertisement

భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అన్ని టాప్ బ్రాండ్లకు చెందిన మోడల్స్ బాగా అమ్ముడవుతున్నాయి. అయితే, ఫిబ్రవరిలో ఈవీ రంగంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల విడుదలైన మహీంద్రా XEV 9S అమ్మకాలలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. చాలా కాలంగా ఈవీ మార్కెట్ లో సత్తా చాటుతున్న, రెండు మాస్ మార్కెట్ మోడళ్లైన టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ విండ్సర్‌ లను వెనక్కి నెట్టింది. మార్కెట్ లో కొత్త ఎలక్ట్రిక్ రారాజుగా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ రెండు బ్రాండ్లను దాటేసిన మహీంద్రా

ఫిబ్రవరి నెల ఈవీ అమ్మకాల డేటా ప్రకారం.. 3,539 యూనిట్ల మహీంద్రా XEV 9S అమ్ముడయ్యాయి. అదే సమయంలో  విండ్సర్ అమ్మకాలు 2,599 యూనిట్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్ 2,410 యూనిట్ల నెక్సాన్.ఈవీ అమ్మకాలను నమోదు చేసింది.

మహీంద్రా ఈవీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి?

Advertisement

మహీంద్రా ఎలక్ట్రిక్ SUV అయిన XEV 9S గత ఏడాది నవంబర్‌ లో విడుదల అయ్యింది. ఈ సంవత్సరం జనవరి చివరిలో డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఆ నెలలో ఈ ఎలక్ట్రిక్ SUVకి చెందిన 612 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి నాటికి, ఈ సంఖ్య 3539 యూనిట్లకు పెరిగింది. అంటే 2927 యూనిట్ల పెరుగుదల కనిపించింది. XEV 9S  అగ్రెసివ్ మార్కెట్ పొజిషనింగ్ ను పెంచడంలో సాయపడింది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 19.95 లక్షలు. పోటీ కార్లతో పోల్చితే మంచి ఫీచర్లు, లుక్ ఉండటంతో కొనుగోలుదారులు మహీంద్రా XEV 9S వైపు అడుగులు వేశారు. XEV 9Sకి ఇప్పటికే చాలా పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. మహీంద్రా ఈ బ్యాక్‌ లాగ్‌ను క్లియర్ చేయడానికి ట్రై చేస్తోంది. ఇది కూడా డెలివరీల సంఖ్య పెరగడానికి కారణమై ఉండవచ్చు.

అంతేకాదు, XEV 9S స్మార్ట్ ప్యాకేజింగ్, ప్రాక్టికల్ డిజైన్ కొనుగోలుదారుల అభిరుచులకు అనుకూలంగా ఉంటుంది. అందుకే, ప్రజాదరణ మరింత పెరిగింది. నెక్సాన్ EV, విండ్సర్ రెండూ వాటి ధర, విలువ ప్రతిపాదన కారణంగా అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. జనవరి గణాంకాలు చూస్తే, 2567 విండ్సర్‌ యూనిట్లు అమ్ముడవగా, 3098 యూనిట్ల నెక్సాన్.EVలు అమ్మకాలను నమోదు చేసింది.  ఫిబ్రవరిలో, విండ్సర్ అమ్మకాలు స్థిరంగా కొనసాగాయి. 2599 యూనిట్లు అమ్ముడయ్యాయి.  నెక్సాన్.EV అమ్మకాలు క్షీణించి 2410 యూనిట్లకు పడిపోయాయి. టాటా కంపెనీ 22% క్షీణతను నమోదు చేసింది.

ఫిబ్రవరి 2026లో టాప్ 10 ఈవీలు

Advertisement

మహీంద్రా XEV 9S, MG విండ్సర్, టాటా నెక్సాన్ EV వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. నాల్గవ స్థానంలో మహీంద్రా XEV 9e ఉంది. టాటా హారియర్ ఈవీ ఐదవ స్థానంలో నిలిచింది. కర్వ్.ఈవీకి ఆరవ స్థానంలో నిలిచింది. ఏడవ స్థానంలో టాటా టియాగో.ఈవీ ఉంది. మహీంద్రా బీఈ6 ఈ లిస్టులో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. తొమ్మిదవ స్థానంలో టాటా పంచ్.ఈవీ ఉంది. 10వ స్థానంలో మారుతి ఇవిటారా నిలిచింది.

Read Also:  కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×