E-Paper
Advertisement

మహీంద్రా XUV 3XO CNG బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీలు ఎప్పటి నుంచి అంటే..

మహీంద్రా XUV 3XO CNG బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీలు ఎప్పటి నుంచి అంటే..
Advertisement

Mahindra XUV 3XO CNG Bookings: మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ కాంపాక్ట్ SUV XUV 3XOలో CNG వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ల కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. కొనుగోలుదారులు రూ.21,000 టోకెన్ మొత్తంతో కంపెనీ వెబ్‌సైట్ లేదంటే సమీప డీలర్‌ షిప్ ద్వారా ఈ SUVని బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవాలనుకునే వారికి ఈ CNG వేరియంట్లు మరో ఆప్షన్ కానుంది.

మహీంద్రా XUV 3XO CNG ధరల గురించి..

మహీంద్రా XUV 3XO CNGని నాలుగు వేరియంట్లలో అందిస్తోంది. ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.12.27 లక్షలుగా నిర్ణయించారు.

పెట్రోల్‌ తో సమానమైన పవర్.. 6 స్పీడ్ గేర్‌ బాక్స్..

Advertisement

XUV 3XO CNGలో 1.2-లీటర్, మూడు సిలిండర్ల MPFi టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ ను ఉపయోగించారు. సాధారణంగా CNG వాహనాల్లో ఇంధనం మారినప్పుడు పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, మహీంద్రా ఈ SUVలో టర్బో క్యాలిబ్రేషన్, ECU మ్యాపింగ్, 10-బార్ CNG ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఆ సమస్యను అధిగమించినట్లు వెల్లడించింది. ఈ ఇంజిన్ పెట్రోల్, CNG రెండు మోడ్‌లలోనూ 111hp పవర్, 200Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌ లో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 11.8 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే, కిలోగ్రాము CNGకి 24.7 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని  వెల్లడించింది. అయితే, ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్ లేదు.

డిజైన్, ఫీచర్లలో ప్రత్యేకతలు

బయటి డిజైన్ పరంగా పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవు. వెనుకవైపు ఉండే ‘ZNG’ బ్యాడ్జ్ ఈ CNG మోడల్‌ను ప్రత్యేకంగా గుర్తించేలా చేస్తుంది. క్యాబిన్‌లో CNG స్విచ్‌ను అందించారు. రెండు CNG సిలిండర్లను అమర్చడం వల్ల బూట్ స్పేస్ 270 లీటర్లకు పరిమితమైంది. టాప్ RevX A వేరియంట్‌లో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, లెదరెట్ సీట్లు, ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, LED లైట్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లాంటి  ఫీచర్లు ఉన్నాయి.

మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్‌కు పోటీ

Advertisement

మహీంద్రా XUV 3XO CNG మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా CNG, టాటా నెక్సాన్ CNG వంటి SUVలకు పోటీ ఇవ్వనుంది. మంచి పవర్, టర్బో ఇంజిన్, ఆధునిక ఫీచర్లు కోరుకునే వినియోగదారులను ఈ మోడల్ ఆకర్షించే అవకాశం ఉంది. అయితే, కొనుగోలు చేసే ముందు వేరియంట్‌ను బట్టి ధర, అందుబాటులో ఉన్న ఫీచర్లు, స్థానిక డీలర్ దగ్గర అవైలబులిటీ గురించి నిర్ధారించుకోవడం మంచిది.

Read Also: పండుగ సీజన్ తర్వాత కార్ల ధరలు పెరుగుతాయా? కొనుగోలుదారులకు కీలక అలర్ట్..

Tags

Related News

ఇక క్లచ్ పట్టాల్సిన అవసరం లేదు.. కవాసకీ కొత్త అడ్వెంచర్ బైక్‌ భలే ఉందిగా..

భారత్‌లోనే CB500 తయారీ.. విదేశాలకు ఎగుమతి చేసేందుకు హోండా ప్లాన్!

షోరూమ్‌ కు చేరిన TVS Ntorq 150 న్యూ మోడల్.. కొత్త కలర్ భలే ఉందే!

గూగుల్ మ్యాప్స్, క్విక్‌షిఫ్టర్‌.. అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ N250SS వచ్చేసింది!

పెట్రోల్ బైక్ మంచిదా? ఎలక్ట్రిక్ బైక్ మంచిదా? ఐదేళ్ల ఖర్చు లెక్క ఇదే!

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? బ్యాటరీ గురించి ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

పండుగ సీజన్ తర్వాత కార్ల ధరలు పెరుగుతాయా? కొనుగోలుదారులకు కీలక అలర్ట్..

Big Stories

Advertisement
×