E-Paper
Advertisement

Mercedes-Benz: నిన్న BMW, నేడు బెంజ్.. మరింత ప్రియం కానున్న లగ్జరీ కార్లు!

Mercedes-Benz: నిన్న BMW, నేడు బెంజ్.. మరింత ప్రియం కానున్న లగ్జరీ కార్లు!
Advertisement

Mercedes-Benz Cars Price: మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు ఇండియాలో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. లగ్జరీ కార్ల బ్రాంబ్ ధరలు సుమారు 2 శాతం పెరగనున్నాయి. తన బ్రాండ్ లోని మొత్తం ప్యాసింజర్ వెహికిల్స్ కు సంబంధించి మెర్సిడెస్ బెంజ్ ఇండియా ధరల పెంపును ప్రకటించింది. ఈ పెంపు నిర్ణయం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. యూరోతో పోలిస్తే రూపాయి మరింత బలహీనం కావడంతో లగ్జరీ కార్ మేజర్ BMW రీసెంట్ గా ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే  జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంజ్ కూడా ధరల పెంపును ప్రకటించింది. ప్రస్తుత ఫారెక్స్ స్థాయికి దగ్గరగా చేరుకునేందుకు కంపెనీ ధరలను పెంచే ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ధరల పెంపు ఆలోచనను పరిశీలిస్తున్నందున, మళ్లీ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

రూపీ వ్యాల్యూ తగ్గడంతో ధరల పెంపు

యూరో- ఇండియన్ రూపీ మారకం రేటు 2025లో స్థిరంగా రూ.100 మార్కు కంటే ఎక్కువగా ఉండటంతో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని మెర్సిడెస్ బెంజ్ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇది చారిత్రక సగటుల కంటే చాలా ఎక్కువగా ఉందని వెల్లడించింది. ప్రస్తుత ఫారెక్స్ స్థాయిలకు దగ్గరగా చేరుకోవడానికి త్రైమాసిక ధరల సర్దుబాట్లను పరిశీలిస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. ఇన్‌ పుట్ ఖర్చులు పెరగడం, వస్తువుల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో కలిపి పెరిగిన లాజిస్టికల్ ఖర్చులు లాంటి ఇతర కారణాల వల్ల ధరల పెంపు అవసరమైందని ఆటోమేకర్ తెలిపింది.

BMW బాటలో బెంజ్

Advertisement

అటు యూరోతో పోలిస్తే బలహీనమైన రూపాయి దేశంలో లగ్జరీ కార్ల కొనుగోలుదారులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రోజుల క్రితం, జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW, యూరోతో పోలిస్తే బలహీనమైన రూపాయి ప్రభావాన్ని భర్తీ చేయడానికి వచ్చే నెల నుంచి బ్రాండ్ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. BMW ఇండియా ప్రెసిడెంట్, CEO హర్దీప్ సింగ్ బ్రార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫారెక్స్ హెచ్చుతగ్గులు పెద్ద నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని, ధర, లాభాలపై చాలా ఒత్తిడిని సృష్టిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు, మెర్సిడెస్ బెంజ్ కూడా ధరల పెంపు చర్య వెనుక కూడా ఇదే కారణాన్ని వెల్లడించింది. అయితే, తన కార్లకు సంబంధించి సవరించిన ధరల జాబితాను ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు.

త్వరతో అధికారికంగా ధరల ప్రకటన

మెర్సిడెస్ బెంజ్ దేశంలో వివిధ బాడీ స్టైల్స్‌ లో విస్తృత శ్రేణి లగ్జరీ కార్లను అమ్ముతుంది. వీటిలో రెండు రకాల కార్లు ఉన్నాయి. స్థానికంగా తయారు చేయబడిన, స్థానికంగా అసెంబుల్ చేయబడిన, పూర్తిగా నిర్మించిన యూనిట్ (CBU) మోడల్స్ ఉన్నాయి. ఫారెక్స్ మారకం రేటు స్థానిక అసెంబ్లీకి సంబంధించిన భాగాలను, అలాగే CBU మోడళ్ల దిగుమతిని ప్రభావితం చేస్తోంది. త్వరలోనే పెరిగిన ధరలకు సంబంధించి పూర్తి వివరాలను బెంజ్ ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Read Also: ఆ కార్లు బార్డర్ దాటొద్దు, డ్రాగన్ కంట్రీ కీలక నిర్ణయం!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×