E-Paper
Advertisement

New 2026 Kia Seltos: ఫ్యామిలీ ట్రావెల్స్‌కి పర్‌ఫెక్ట్.. మైండ్-బ్లోయింగ్ రివల్యూషన్‌తో కియా సెల్టోస్ కార్

New 2026 Kia Seltos: ఫ్యామిలీ ట్రావెల్స్‌కి పర్‌ఫెక్ట్.. మైండ్-బ్లోయింగ్ రివల్యూషన్‌తో కియా సెల్టోస్ కార్
Advertisement

New 2026 Kia Seltos: భారత మార్కెట్‌లో కియా బ్రాండ్ అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. స్టైలిష్ డిజైన్, రిచ్ ఫీచర్లు, ఎక్సలెంట్ డ్రైవింగ్ అనుభవం ఇచ్చే కార్లతో కియా చాలా వేగంగా యువత నుంచి ఫ్యామిలీల వరకు అందరి నమ్మకాన్ని గెలుచుకుంది. ఆ జాబితాలో సెల్టోస్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఫస్ట్ జెనరేషన్ సెల్టోస్ హిట్ అయిన తరువాత, ఇప్పుడు రెండో జెనరేషన్‌గా వచ్చిన 2026 కియా సెల్టోస్ మరింత ప్రీమియంగా, మరింత ఫీచర్లతో మార్కెట్‌ను కదిలించడానికి రెడీ అయింది. ఈ కొత్త సెల్టోస్‌ (Kia Seltos)కు బుకింగ్స్ నేటి నుంచి (డిసెంబరు 11) నుంచి ప్రారంభం అయ్యాయి. కానీ, ధరను మాత్రం కియా జనవరి 2, 2026న ప్రకటించనుంది. ముందస్తు బుకింగ్ మొత్తం 25000 రూపాయలు, అంటే కస్టమర్ ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని కియా మొదటిసారి బుకింగ్ చేసేవారికి కూడా మంచి ఛాన్స్ ఇస్తోంది.

2026 సెల్టోస్‌లో వచ్చిన కొత్త డిజైన్ మార్పులు

Advertisement

ఈసారి కియా సెల్టోస్‌ (Kia Seltos)లో స్పష్టంగా కనిపించే మార్పు దాని కార్ బాడీ సైజ్. మొత్తం పొడవు ఇప్పుడు 4.46 మీటర్లు, పాత మోడల్‌తో పోలిస్తే 95 మిల్లీమీటర్లు ఎక్కువ. కార్ చక్రాల మధ్యదూరం (Wheelbase) కూడా 80 మిల్లీమీటర్లు పెరగడంతో వెనుక సీటింగ్ స్పేస్ బాగా అప్‌గ్రేడ్ అయింది. స్టోరేజ్ స్పేస్ కూడా 447 లీటర్లకు పెరగడం వల్ల ఫ్యామిలీ ట్రావెల్స్‌కి ఇది మరింత ప్రాక్టికల్ ఎస్‌యూవిగా మారింది. కారు పెద్ద సైజ్ వలన డ్రైవింగ్ సమయంలో రోడ్డుమీద మరింత పవర్‌ఫుల్‌గా అనుభూతి కలుగుతుంది

కొత్త సెల్టోస్ ఎక్స్‌టీరియర్ ఎలా మారింది?

Advertisement

డిజైన్ విషయానికి వస్తే, కియా ఈసారి పూర్తిగా కొత్త దారిని ఎంచుకుంది. యూరోప్ స్టైల్ సింపుల్ డిజైన్‌ని వదిలి మరింత కొత్తదనంతో స్పష్టంగా ఆధునికమైన స్టైల్‌ని తీసుకువచ్చింది. గ్రిల్‌తో కలిసిపోయినట్లుగా కనిపించే హెడ్‌లైట్స్ ఎస్‌యూవికి హై ఎండ్ లుక్ ఇస్తాయి. వెల్కమ్ అండ్ గుడ్‌బై లైట్ యానిమేషన్ కూడా కార్‌ని ప్రత్యేకంగా నిలుపుతుంది. సెల్టోస్‌లో డోర్ హ్యాండిల్స్ ఆటోమేటిక్‌గా లోనికి బయటికి పనిచేసే విధంగా ఉండటం ప్రీమియం అనుభూతి ఇస్తుంది. రియర్ డిజైన్ కూడా పూర్తిగా మారింది, నంబర్ ప్లేట్ బంపర్‌లోకి మారడంతో వెనుక డోర్ మరింత క్లీనర్‌గా కనిపిస్తుంది.

Also Read: YouTube Golden Play Button: గోల్డెన్ ప్లే బటన్ వచ్చిన తర్వాత.. యూట్యూబర్ ఆదాయం అంత పెరుగుతోందా?

కొత్త సెల్టోస్ క్యాబిన్‌లో లగ్జరీ అనుభూతి

ఇంటీరియర్ మాత్రం రివల్యూషన్ కంటే ఈవాల్యూషన్. కియా ఈవి6 నుంచి తీసుకున్న స్టీరింగ్, సైరోస్‌ తరహా ట్రై-డిజిటల్ స్క్రీన్ లేఅవుట్, 12.3 ఇంచ్ స్మార్ట్ డిస్‌ప్లే సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ క్లస్టర్, 64-కలర్ అంబియెంట్ లైటింగ్ అన్నీ కలిసి క్యాబిన్‌ని ఒక లగ్జరీ ఎస్‌యూవీ అనుభూతికి తీసుకెళ్తాయి. సీటింగ్ సౌలభ్యం, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, డ్యూయల్ పేన్ సన్‌రూఫ్, బోస్ 8 స్పీకర్ సిస్టమ్ మొత్తంగా ఇవన్నీ కలిసి ప్రయాణానికి ఒక ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. ఇంజిన్ ఆప్షన్స్‌గా 1.5 లీటర్ నేచురల్ పెట్రోల్, 1.5 టర్బో పెట్రోల్, 1.5 డీజిల్ కొనసాగుతున్నాయి. మాన్యువల్ నుంచి సివిటి, డిసిటి నుంచి ఏటి వరకు అన్ని రకాల ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ మీ అవసరానికి తగ్గట్లే ఉన్నాయి.

ధర ఎంతంటే?

ధర విషయానికి వస్తే 2026 కియా సెల్టోస్ సుమారు రూ 11.2 లక్షల వద్ద ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు టాప్ ఎక్స్-లైన్ వేరియంట్ దాదాపు రూ 20 లక్షల వరకు చేరుతుందని అంచనా. బేస్ మోడల్‌కి వచ్చే ఫీచర్లు, కొత్త సైజు, అప్‌డేటెడ్ ఇంటీరియర్ అన్నీ చూసుకుంటే ప్రారంభ ధర తగినట్టుగానే అనిపిస్తుంది. టాప్ వేరియంట్‌లో ఉండే ప్రీమియం, పెద్ద స్క్రీన్లు, ఏడిఏఎస్ సేఫ్టీ, లగ్జరీ ఫీలింగ్ కారణంగా దాని ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా, కొత్త టెక్నాలజీ, ఆధునాతన డిజైన్, ఎక్కువ స్థలం అన్నీ కలిపి ఈ ధరను కరెక్ట్‌గా సరిపోయే విధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలని అనుకునే వారు వెంటనే కియా సెల్టోస్ కారును బుక్ చేసుకోండి.

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×