E-Paper
Advertisement

YouTube Golden Play Button: గోల్డెన్ ప్లే బటన్ వచ్చిన తర్వాత.. యూట్యూబర్ ఆదాయం అంత పెరుగుతోందా?

YouTube Golden Play Button: గోల్డెన్ ప్లే బటన్ వచ్చిన తర్వాత.. యూట్యూబర్ ఆదాయం అంత పెరుగుతోందా?
Advertisement

YouTube Golden Play Button: యూట్యూబ్ అన్నది ఇప్పుడు కేవలం వీడియోలు చూసే ప్లాట్‌ఫాంగా కాదు, లక్షలాది మందికి జీవితాన్ని మార్చే వృత్తిగా మారిపోయింది. ప్రతిరోజూ కోట్లలో వీడియోలు అప్‌లోడ్ అవుతున్న ఈ ప్లాట్‌ఫాంలో, కొందరు తమ కంటెంట్‌తో మిలియన్ల వ్యూస్ దక్కించుకుని మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ఒక ఛానల్ ఎదిగినపుడు యూట్యూబ్ క్రియేటర్ అవార్డ్స్‌ను కూడా ఇస్తుంది. అందులో ముఖ్యమైనది, వన్ మిలియన్ సబ్‌స్క్రైబర్స్ పూర్తయినప్పుడు ఇచ్చే గోల్డెన్ ప్లే బటన్. కానీ చాలా మందికి అసలు సందేహం, ఈ గోల్డెన్ బటన్ వచ్చాక ఎంత సంపాదన వస్తుంది అన్నది. ఇదే విషయాన్ని ఇప్పుడు సింపుల్‌గా వివరంగా చూద్దాం.

గోల్డెన్ ప్లే బటన్ ఛానల్‌కి వచ్చే అసలు ఆదాయం ఎంత?

Advertisement

ఒక ఛానల్‌కు వన్ మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నాయంటే అది ప్రతిష్టాత్మక ఘట్టం, కానీ ఆదాయం మాత్రం సబ్‌స్క్రైబర్స్ వల్ల కాదు, వ్యూస్ వల్ల వస్తుంది. సాధారణంగా ప్రకటనదారులు వెయ్యి వ్యూస్‌కి సుమారు 2 డాలర్లు చెల్లిస్తారు. ఒక క్రియేటర్ క్రమంగా వీడియోలు పెడుతూ కంటెంట్ ఇస్తే, ఏడాది మొత్తానికి వ్యూస్‌పై ఆధారపడి 4 మిలియన్ డాలర్ల వరకు సంపాదించడం సాధ్యమే. దీన్ని ఇండియన్ కరెన్సీలోకి మార్చితే సుమారు రూ 35.9 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కేవలం అడ్స్ (Ads) ద్వారా వచ్చే సంపాదన మాత్రమే. దీనికితోడు బ్రాండ్లు నేరుగా సంప్రదించి ప్రమోటెడ్ వీడియోలు, ప్రమోషన్లు అడిగే సందర్భాలు కూడా పెరుగుతాయి. దాంతో అదనపు ఆదాయం మరింత పెరుగుతుంది. అందుకే, గోల్డెన్ ప్లే బటన్ అనేది కేవలం ఒక అవార్డు కాదు, క్రియేటర్ అసలు స్థాయికి చేరుకున్నాడని చూపించే గుర్తు.

క్రియేటర్లకు వర్తించే ట్యాక్స్ రూల్స్.. పూర్తి వివరణ

Advertisement

ఇక యూట్యూబ్ ఆదాయం మీద భారత్‌లో పన్నులు ఎలా పడతాయి అన్నది కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ సాధారణంగా బిజినెస్ లేదా ప్రొఫెషనల్ ఇన్‌కమ్ కింద అంచనా వేయబడుతుంది. ఫుల్‌టైమ్‌గా కంటెంట్ క్రియేట్ చేస్తే ఈ ఇన్‌కమ్ ప్రొఫెషనల్ ఇన్‌కమ్‌గానే పన్ను లెక్కలో చేరుతుంది. యూ ట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఉద్యోగ ఆదాయం కంటే ఎక్కువ ఉన్నా కూడా అదే విధంగా పన్ను పడుతుంది. క్రియేటర్లు ఐటిఆర్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఫైల్ చేయాలి. టర్నోవర్ రూ 3 కోట్ల లోపే ఉంటే సెక్షన్ 44AD కింద అంచనా పన్ను విధానం (Presumptive taxation) ఎంచుకోవచ్చు. ఈ విధానంలో మొత్తం టర్నోవర్‌లో 6 శాతం ఆదాయంగా చూపితే సరిపోతుంది. అదనపు ఖర్చుల తగ్గింపు చూపాల్సిన అవసరం లేదు.

సంపాదన పెరిగే కొద్దీ నియమాలు పాటించాలి

అదే సమయంలో బ్రాండ్లు ఇచ్చే ఉచిత గిఫ్ట్స్, ప్రయోజనాలు రూ 20,000 దాటితే సెక్షన్ 194R కింద టిడిఎస్ వర్తిస్తుంది. అందువల్ల, యూట్యూబర్‌లు సంపాదన పెరుగుతున్న కొద్దీ పన్ను లెక్కలు, నియమాలు కచ్చితంగా పాటించాలి. గోల్డెన్ ప్లే బటన్ వచ్చిన తర్వాత అసలు ఆదాయం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది, అది సరైన పద్ధతిలో పని చేస్తే లక్షల నుండి కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×