E-Paper
Advertisement

టెస్లా మోడల్ Yని ఇప్పుడు ఈఎంఐలోనూ కొనవచ్చు, నెలకు ఎంత కట్టాలంటే?

టెస్లా మోడల్ Yని ఇప్పుడు ఈఎంఐలోనూ కొనవచ్చు, నెలకు ఎంత కట్టాలంటే?
Advertisement

Tesla Model Y Loan Calculator: భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇచ్చినా అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతోంది. అమెరికన్ ఈవీ దిగ్గజం తీసుకొచ్చిన టెస్లా మోడల్ Y ప్రస్తుతం ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌ లో పోటీ పడుతోంది. లేటెస్ట్  డిజైన్, హైటెక్ ఫీచర్లు, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ తో ఈ కారు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత్ లో  ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమై రూ. 67.89 లక్షల వరకు ఉంటుంది.

ఈఎంఐలో టెస్లా కారు కొనే అవకాశం!

టెస్లా మోడల్ Y కొనుగోలు చేయాలని భావిస్తున్నవారిలో చాలామంది లోన్ ఆప్షన్ ను చూస్తున్నారు. ఢిల్లీలో ఈ వేరియంట్ ఆన్ రోడ్ ధర సుమారు రూ. 71.36 లక్షలు. ఇందులో సుమారు 20 శాతం డౌన్ పేమెంట్‌ గా రూ. 14.2 లక్షలు చెల్లిస్తే, మిగతా రూ. 57.16 లక్షలు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంటుంది.

ఎన్ని సంవత్సరాలకు ఎంత ఈఎంఐ చెల్లించాలంటే?

Advertisement

మూడు సంవత్సరాల లోన్ ఎంచుకుంటే ప్రతి నెల సుమారు రూ. 1.86 లక్షల EMI చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం EMI చెల్లింపులు కలిపి దాదాపు రూ. 65.92 లక్షలకు చేరుకుంటాయి. ఇందులో వడ్డీగా సుమారు రూ. 8.76 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే డౌన్ పేమెంట్ కలుపుకుని మూడు సంవత్సరాల చివరికి మొత్తం ఖర్చు రూ. 80 లక్షలకు పైగానే ఉంటుంది. నాలుగు సంవత్సరాల లోన్ తీసుకుంటే నెలవారీ EMI సుమారు రూ. 1.44 లక్షల వరకు తగ్గుతుంది. అయితే, రుణ కాలం పెరగడంతో మొత్తం వడ్డీ కూడా పెరుగుతుంది. ఈ ప్లాన్‌ లో మొత్తం వడ్డీ సుమారు రూ. 11.77 లక్షలు అవుతుంది. మొత్తం ఖర్చు రూ. 83 లక్షలకు చేరుతుంది.

అటు ఐదు సంవత్సరాల లోన్‌లో ప్రతి నెల EMI దాదాపు రూ. 1.2 లక్షలు ఉంటుంది. మొత్తం EMI చెల్లింపులు రూ. 72 లక్షలకు పైగా ఉండగా, వడ్డీ రూపంలో సుమారు రూ. 14.87 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. మొత్తం ఖర్చు రూ. 86 లక్షల దాకా చేరుతుంది. ఏడు సంవత్సరాల దీర్ఘకాల రుణాన్ని ఎంచుకుంటే నెలకు EMI రూ. 93 వేల వరకు తగ్గుతుంది. అయితే దీర్ఘకాలం కారణంగా వడ్డీ భారం భారీగా పెరుగుతుంది. మొత్తం వడ్డీ రూ. 21 లక్షలకు మించి ఉండగా, చివరకు కారు కోసం మొత్తం ఖర్చు రూ. 92 లక్షలకుపైగా అవుతుంది.

టెస్లా మోడల్ Y గురించి..

Advertisement

టెస్లా మోడల్ Yలో 16 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే లాంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. భద్రత పరంగా మల్టిపుల్ ఎయిర్‌ బ్యాగ్‌ లు, 360 డిగ్రీ కెమెరా, ADAS, పార్కింగ్ సెన్సర్లు లాంటి ఫీచర్లు అందిస్తున్నారు. పవర్‌ ట్రెయిన్ పరంగా చూస్తే, బేస్ రియర్ వీల్ డ్రైవ్ మోడల్ 500 కి.మీ రేంజ్ ఇస్తుండగా, లాంగ్ రేంజ్ వెర్షన్ 622 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. టాప్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 681 కి.మీ వరకు వెళ్తుందని టెస్లా తెలిపింది.

Read Also: మారుతి ఇ-విటారా కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×