E-Paper
Advertisement

డ్రైవింగ్ లో కారు విండ్‌ షీల్డ్‌ పగిలిందా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

డ్రైవింగ్ లో కారు విండ్‌ షీల్డ్‌ పగిలిందా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
Advertisement

Car Windshield Crack: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీది నుంచి చిన్న రాళ్లు ఎగిరి వచ్చి కారు అద్దాలను డ్యామేజ్ చేయడం తరచుగా జరుగుతుంది. టక్ అనే శబ్దంతో చిన్న పగులు ఏర్పడుతుంది. నిజానికి అప్పటికప్పుడు పెద్ద  సమస్యగా అనిపించదు. చిన్న క్రాక్‌ ను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఎందుకంటే, అది కొద్దికాలంలోనే పెద్దగా మారి డ్రైవింగ్‌ కు ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది.

నెమ్మదిగా పగుళ్లు పెరిగే అవకాశం!

సాధారణంగా విండ్‌ షీల్డ్ అనేది సాధారణ గాజు కాదు. ఇది రెండు గాజు పొరల మధ్య ప్లాస్టిక్ లేయర్‌ తో తయారవుతుంది. సేఫ్టీ కోసం ఇలా డిజైన్ చేసినదే అయినా, దెబ్బ బలంగా తగిలినప్పుడు చిన్న పగుళ్లు రావడం కామనం. ముఖ్యంగా హైవే మీద వేగంగా వెళ్లేటప్పుడు రాయి తగిలితే, వెంటనే క్రాక్ ఏర్పడుతుంది. దాన్ని అలా వదిలేస్తే, అది నెమ్మదిగా విస్తరిస్తుంది.

గ్లాస్ క్రాక్ ఏర్పడితే ఏం చేయాలి?

Advertisement

కారు గ్లాస్ క్రాక్ ఏర్పడితే, పగిలిన ప్రాంతాన్ని జాగ్రత్తగా ప్రొటెకట్ చేయాలి. దుమ్ము, నీరు లోపలికి పోకుండా చిన్న ట్రాన్స్ ఫరెంట్ టేప్ అతికించడం మంచిది. ఆ తర్వాత రిపేర్ చేయడానికి సాయపడుతుంది. అలాగే, కారులో ఉన్న టెంపరేచర్ అకస్మాత్తుగా మారకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా చాలా వేడిగా ఉన్నప్పుడు వెంటనే ఎయిర్ కండిషనింగ్‌ ను గ్లాస్‌ పైకి బలంగా వెళ్లడం, ఒక్కోసారి వేడి నీటితో వాష్ చేయడం వల్ల క్రాక్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.  గ్లాస్ క్రాక్ వచ్చిన కారును డ్రైవ్ చేసే సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. గుంతలు ఎక్కువగా ఉన్న రోడ్లపై వేగంగా వెళ్లడం, సడెన్ బ్రేక్ వేయడం, డోర్లు బలంగా మూయడం చేస్తే, గ్లాస్ మీద ప్రెజర్ పెరిగే పగుళ్లు పెరుగుతాయి. కాబట్టి, కొంతకాలం సాఫ్ట్‌ గా డ్రైవ్ చేయడం మంచిది.

చిన్న పగుళ్లను రిపేర్ చేసే అవకాశం!

చిన్న పగుళ్లు ఉన్నప్పుడు  సులభంగా రిపేర్ చేయవచ్చు. సాధారణంగా కాయిన్ పరిమాణం వరకు ఉన్న క్రాక్‌లను ప్రత్యేక రెసిన్ ఉపయోగించి పూడ్చేస్తారు. ఈ పద్దతిలో ట్రాన్స్ ఫరెన్స్ పదార్థాన్ని క్రాక్‌ లోకి నింపి, UV లైట్‌ తో గట్టిపరుస్తారు. దీంతో గాజు మామూలుగా మారిపోతుంది. మార్కెట్‌ లో చిన్న రిపేర్ కిట్‌లు కూడా దొరుకుతాయి. కానీ అవి చాలా చిన్న, కొత్తగా ఏర్పడిన క్రాక్‌లకు మాత్రమే సరిపోతాయి. కొన్ని పరిస్థితుల్లో విండ్‌ షీల్డ్‌ ను పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ముఖ్యంగా క్రాక్ డ్రైవర్ చూసే ప్రదేశంలో ఉంటే, రిపేర్ చేసినా స్పష్టత తగ్గిపోతుంది. అలాగే పగులు అంచుల వరకు వెళ్లినా, చాలా పెద్దదిగా మారినా, గాజు బలం తగ్గిపోతుంది. అప్పుడు రీప్లేస్ చేయడం మంచిది. సో, చిన్న క్రాక్ అని వదిలేయకుండా వెంటనే జాగ్రత్త పడటం వల్ల పెద్ద ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: కారు పెయింట్ కొత్తదానిలా మెరవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×