BigTV English
Advertisement

Kesineni Nani Vs Kesineni Chinni: విజయవాడ ఎంపీ బరిలో కేశినేని బ్రదర్స్.. ఇక్కడ వార్ వన్ సైడ్ కాదు

Kesineni Nani Vs Kesineni Chinni: విజయవాడ ఎంపీ బరిలో కేశినేని బ్రదర్స్.. ఇక్కడ వార్ వన్ సైడ్ కాదు

kesineni


విజయవాడ ఎంపీ బరిలో కేశినేని బ్రదర్స్ వార్ రెండో సారి ఎంపీగా గెలిచాక మారిన చిన్నీకి టీడీపీలో ప్రాధ్యనతను తట్టుకోలేకపోయిన నాని పార్టీతో పనిలేకుండా గెలుస్తానంటున్న వైసీపీ అభ్యర్ధి నానికి రాజకీయ ప్రత్యర్ధిగా మారిన తమ్ముడు చిన్నీకి మద్దతుగా నిలిచిన నాని వ్యతిరేకవర్గం తిరువూరు సభ సందర్భంగా బహిర్గతమైన విభేదాలు అన్నని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న తమ్ముడు
విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు అన్న తమ్ముళ్లు.. ఒకరు ప్రస్తుత ఎంపీ కేశినేని నాని అయితే, మరొకరు నానికి స్వయానా తమ్ముడు అయిన కేసినేని చిన్ని.. కేశినేని నాని 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.. 2019 ఎన్నికల్లో మొత్తం విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో ఒక్క విజయవాడ తూర్పు తప్ప మిగిలిన ఆరు స్థానాలు కోల్పోయింది టీడీపీ… అయినా కేశినేని నాని ఎంపీగా గెలుపొందారు..


Also Read: అభివృద్ధిని పట్టించుకోని పుష్ఫశ్రీవాణి.. విజయంపై ఎందుకంత ధీమా.

అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఎంపీ నాని వాయిస్ మారిపోయింది. పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ .. అధిష్టానంపైనే ధికారస్వరం వినిపిస్తూ వచ్చారు. ఆ క్రమంలో టీడీపీలో తన తమ్ముడికి ప్రాధాన్యత పెరగడం, ఈ సారి తనకు టికెట్ లేదని స్పష్టమవ్వడంతో నాని వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీకి సిద్దమయ్యారు. తన హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు ఆదరించారని. తనకు సొంత కేడర్ ఉందని నాని అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా చెప్తున్నారు. వైసీపీ తీర్ధం పుచ్చుకున్నాక. చంద్రబాబు, లోకేశ్‌లను టార్గెట్ చేస్తూ .. పార్టీతో పనిలేకుండా సొంత ఇమేజ్‌తోనే మూడోసారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు

అయితే బయట ఎంత క్యాడర్ ఉన్నా.. ఇంట్లోనే నానికి ప్రత్యర్థిగా తమ్ముడు కేశినేని చిన్ని తయ్యారయ్యారు .. వారిద్దరి మధ్య కుటుంబ విభేదాలే ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలబెట్టాయి. టిడిపిలో కేశినేని నాని ఎంపీగా ఉండగానే అదే స్థానం నుంచి టికెట్ ఆశించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు కేశినేని చిన్ని.. టీడీపీ అది నాయకుడిపై నాని విమర్శలు చేయడం.. పార్టీ కార్యక్రమాలకి కూడా కొంత దూరంగా ఉంటున్న టైంలోనే.. టీడీపీలోని నాని వ్యతిరేక వర్గం చిన్నిని పొలిటికల్ స్క్రీన్‌పైకి తీసుకొచ్చింది

నాని ఒంటెద్దు పోకడతో విసిగిపోయిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ క్యాడర్ మొత్తం చిన్నికి మద్దతు పలకడంతో నాని జీర్ణించుకోలేక పోయినట్లు కనిపించారు .. ఈ అసంతృప్తి తారాస్థాయికి చేరి తిరువూరులో జరిగిన చంద్రబాబు సభ సందర్భంగా అక్కడి టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేసిన నాని వర్గం.. టీడీపీకి దూరమయ్యారు. ఇప్పుడు వైసీపీ టికెట్ దక్కడంతో గెలుపుపై ధీమాతో ప్రచారంలో నిమగ్నమయ్యారు

Also read:  ప్రచారంలో టీడీపీ దూకుడు.. ప్రజాగళం పేరుతో మరిన్ని బహిరంగ సభలు..

మరోపక్క చిన్ని తన వ్యూహాలతో ముందుకు పోతున్నారు.. ఎట్టి పరిస్థితుల్లో అన్నని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు.. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో టీడీపీ క్యాడర్ను తన వైపు తిప్పుకోవడంతో పాటు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, కార్యకర్తలకు బాగోగులు చూస్తూ నిత్యం వాళ్లతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తున్నారు .. అన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులే తన బలమన్న ధీమాతో కనిపిస్తున్నారు .. నాని పార్టీ మారుతూ దాదాపు 60 శాతం టీడీపీ ఖాళీ అవుతుందని ప్రకటించారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరు నాని వెంట వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు చిన్ని..

టాటా ట్రస్ట్ పేరుతో కేశినేని నాని సేవా కార్యక్రమాలు చేస్తుంటే కేశినేని ఫౌండేషన్ పేరుతో చిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. మెడికల్ క్యాంప్ లాంటి కార్యక్రమాలు పెట్టి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ముందుకు సాగుతున్నారు .. అన్నకు చెక్కు పెట్టడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని చిన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అన్నదమ్ముల యుద్దంలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి

Tags

Related News

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Big Stories

×