BigTV English

Chandrababu Naidu Elections Campaign: ప్రచారంలో టీడీపీ దూకుడు.. ప్రజాగళం పేరుతో మరిన్ని బహిరంగ సభలు

Chandrababu Naidu Elections Campaign: ప్రచారంలో టీడీపీ దూకుడు.. ప్రజాగళం పేరుతో మరిన్ని బహిరంగ సభలు

Nara Chandrababu Naidu news today


Nara Chandrababu Naidu Planning more Elections Campaign: టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంపై మరింత ఫోకస్ పెట్టారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఆదివారం చిలకలూరి పేటలో నిర్వహించిన ప్రజాగళం సభపై చర్చించారు. ఎన్నికల ప్రణాళిలపై సమాలోచనలు చేశారు. ప్రజాగళం పేరుతో వరసుగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో పోలీసులు వ్యవహరించిన తీరును టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. సభ సరిగ్గా జరగకుండా చేయాలని కుట్రలు చేశారని ఆరోపించారు. పోలీసుల ప్రయత్నాలను టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తిప్పికొట్టారని తెలిపారు. వైసీపీ ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆరోపించారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసిన విజయం మనదేనని నేతలు ధీమా వ్యక్తంచేశారు.


వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ‘మేము సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా మరింత విస్తృతంగా జనంలోకి వెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే  భారీ బహిరంగ సభలకు  నిర్వహించాలని భావిస్తోంది.  తొలి విడతలో ప్రతి జిల్లాలో ఒక సభ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

Also Read: TDP MP Candidates First List: టీడీపీ ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు.. నేడు తొలి జాబితా విడుదల..!

టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఈ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. వైసీపీకి ధీటుగా ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ప్రజల్లో పార్టీపై ఆదరణ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.  ఈ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు.

Related News

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Big Stories

×