E-Paper
Advertisement

Naa Anveshana: నోటి దూల గాడికి నేటిజన్ల షాక్.. అన్వేష్ కథ రివర్స్

Naa Anveshana: నోటి దూల గాడికి నేటిజన్ల షాక్.. అన్వేష్ కథ రివర్స్

Naa Anveshana:  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. మరి నోరు జారితే.. ఊరు తిరగబడుతుంది.. తిత్తి తీస్తుంది. యూట్యూబర్ అన్వేష్ విషయంలోనూ ఇదే జరిగింది. మహిళల వస్త్రాలంకరణపై అతను వీడియో చేయడం, అవధాని గరికపాటి, యాక్టర్ శివాజీపై నోరుపారేసుకోవడం, సీతాదేవి, ద్రౌపది గురించి మాట్లాడుతూ పురాణాలను వక్రీకరించడం, హిందువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం లాంటివన్నీ.. ఒకేసారి బ్యాక్ ఫైర్ అయ్యాయ్. అంతే.. దెబ్బకు సీన్ మారిపోయింది. నా అన్వేషణకు గట్టి దెబ్బ పడింది. అన్వేష్‌ నోటిదూలపై.. నెటిజన్ల రియాక్షన్ ఏంటి?

నోటి దూలతో నష్టపోయిన అన్వేష్…

ఇదే.. ఈ నోటి దూలే.. యూట్యూబర్‌ అన్వేష్‌ని గట్టి దెబ్బకొట్టింది. అతను మాట్లాడిన మాటలు.. చేసిన కామెంట్లు.. ఒక్కొక్కరికి ఒళ్లు మండిపోయేలా చేశాయ్. అంతే.. నా అన్వేషణ యూట్యూబ్ చానల్‌కి రిపోర్టులు కొడుతూ, అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తూ.. ఫాలోవర్లంతా అన్వేష్‌కి దడ పుట్టిస్తున్నారు. అతనిపై కోపంతో రగిలిపోతున్నారు. అన్వేష్ వేసిన కౌంటర్లు, సెటైర్లు, జోకులన్నీ.. ఇప్పుడు అతనికే బ్యాక్ ఫైర్ అయ్యాయ్. సోషల్ మీడియా యూజర్లు, అతని ఫాలోవర్లంతా.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు. నీకు ఇదేం పోయేకాలంరా బాబూ.. అంటూ మండిపడుతున్నారు.

శివాజీ వ్యాఖ్యలపై అన్వేష్ రియాక్షన్ వీడియో

ఒక్కసారి అన్వేష్‌పై ఇంత ద్వేషం పెరగడానికి ఓ కారణముంది. ఆల్రెడీ అయిపోయిన ఇష్యూపై.. ఇతను రియాక్ట్ కావడమే కొంపముంచిది. మహిళల వస్త్రధారణపై యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఇప్పటికీ.. ఈ ఇష్యూపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయ్. శివాజీ చెప్పిన మాటల్లో తప్పులేదు గానీ.. ఆయన చెప్పిన విధానం తప్పంటూ కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకొందరు మాత్రం.. తీవ్రస్థాయిలో శివాజీని విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు, రియాక్షన్ వీడియోలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎంతోమంది ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు గానీ.. ఎవరూ లిమిట్ క్రాస్ చేయలేదు. తమకున్న అభిప్రాయాన్ని చాలా పద్ధతిగా చెప్పారు. ఇదే క్రమంలో.. యూట్యూబర్ అన్వేష్.. శివాజీకి కౌంటర్ ఇస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో చేశారు. అందులో భాగంగా.. హిందూ దేవతల గురించి ప్రస్తావన తీసుకురావడంతో.. కాంట్రవర్శీ రేగింది. అన్వేష్ ఏమన్నాడో చూడండి..

అసభ్య వ్యాఖ్యలతో వివాదంలో అన్వేష్‌.. భారీగా తగ్గిన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు

ఇలా.. పురాణాలను వక్రీకరించడమే కాదు.. అమ్మాయిలంతా బట్టలిప్పుకొని తిరగండి.. ఎవరైనా అడిగితే.. నా వీడియో చూపించండి అంటూ.. అడ్డదిడ్డంగా మాట్లాడేశారు. అవధాని గరికపాటి నరసింహారావుతో పాటు శివాజీని గురించి మాట్లాడుతూ.. నోరుజారాడు. బూతులు వాడాడు. హిందువులను కించపరిచేలా.. భారతదేశాన్ని అవమానించేలా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేశాడు. ఈ వీడియో చూశాక.. అతని బలుపు మాటలు విన్నాక.. వాడెలాంటివాడో అందరికీ అర్థమైంది. అతని ఫాలోవర్లే అతన్ని ఛీకొడుతున్నారు. అతని సోషల్ మీడియా అకౌంట్లతో పాటు యూట్యూబ్ ఛానల్‌ని కూడా అన్‌ఫాలో చేస్తున్నారు. ఒక్క రోజులోనే.. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్‌ని 5 లక్షల మందికి పైగా అన్‌సబ్‌స్క్రైబ్ చేశారంటే.. ఒక్కొక్కరు అతనిపై ఎంతలా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలోనూ లక్ష మందికి పైగా అన్ ఫాలో చేశారు. శివాజీకి కౌంటర్ ఇస్తూనే.. మహిళల గురించి, హిందూ దేవతల గురించి అసభ్యకరంగా మాట్లాడటంతో.. మహిళా సంఘాలు, హిందూ సంఘాలు అన్వేష్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై అన్వేష్ చేసిన అసభ్యకర వాఖ్యలకు గానూ.. అతన్ని అరెస్ట్ చేయాలని కోరారు.

నోరు అదుపులో లేకపోవడమే అన్వేష్‌కు శాపమైంది!

అన్వేష్ కేవలం ట్రావెల్ వ్లాగ్‌లకే పరిమితమైతే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సున్నితమైన అంశాలపై.. అంతే సున్నితంగా తన అభిప్రాయం చెప్పినా నో ప్రాబ్లమ్. కానీ.. ఇండియాలో లేను కదా.. నన్ను ఎవరేం చేస్తారులే అనే ధోరణితో.. ప్రతి కాంట్రవర్శీ ఇష్యూలోకి దూరి.. నోరు పారేసుకోవడమే.. ఈ పరిస్థితికి ప్రధాన కారణం. సోషల్ మీడియా యూజర్లు కూడా అన్వేష్ తీరుని ఎప్పటి నుంచో గమనిస్తున్నారు. ఇన్నాళ్లూ.. పోనీలే అని వదిలేశారు. కానీ.. ఈసారి మాత్రం వీడికి సరైన బుద్ధి చెప్పాలనే నిర్ణయానికొచ్చారు. అన్వేష్ చేసిన అతిపెద్ద తప్పు.. పురాణాల్లోని సీతాదేవి, ద్రౌపది లాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా గౌరవించే పాత్రలను కించపరిచేలా మాట్లాడటం, పురాణాలను తనకిష్టమైన రీతిలో వక్రీకరించడంతో.. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్. అసలు.. నీకు పురాణాల గురించి ఏం తెలుసు అంటూ.. నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు.. ప్రవచనకర్త గరికపాటి, యాక్టర్ శివాజీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కూడా ఇంకొంత మైనస్ అయింది. వాళ్లిద్దరిపై అన్వేష్ చేసిన కామెంట్స్ అహంకారపూరితంగా ఉన్నాయని జనం ఫైర్ అవుతున్నారు. వారి అనుభవం, వయసు, సమాజంలో వారికి ఉన్న హోదాకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా.. అడ్డగోలుగా మాట్లాడటం.. అన్వేష్‌ని గట్టి దెబ్బకొట్టింది.

నోరు జారితే క్షమాపణ.. బలుపు జారితే పతనం

ఎంత సభ్యత కలిగిన వారైనా.. ఏదో ఒక సమయంలో నోరు జారతారు. తర్వాత తమ తప్పు తెలుసుకుంటారు. క్షమాపణ కోరతారు. కానీ.. అన్వేష్ అలాంటోడు కాదు. వీడికి.. ఒళ్లంతా దూలే. ఏం మాట్లాడతాడో.. ఏం చెబుతాడో.. అతనికే తెలియాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లని టార్గెట్ చేసి.. అప్పట్లో కాస్త పాపులర్ అయ్యాడు. అంతే.. దేశ సరిహద్దుల అవతల ఉండి కూడా.. ఈ దేశాన్నే ఉద్ధరించేశాననే భ్రమల్లో ఉన్నాడు. ఆ తర్వాతే.. ఎక్కడలేని బలుపంతా వీడిలో చేరింది. అందుకే.. ఇలా తలా-తోక తెలియకుండా అడ్డదిడ్డంగా మాట్లాడి.. ఇబ్బందుల్లో పడ్డాడు. అతన్ని అందలం ఎక్కించిన సోషల్ మీడియా యూజర్లే.. ఇప్పుడు అతని తలపొగరు దించే పనిలో ఉన్నారు. అసలు.. అన్వేష్ ఎపిసోడ్ నుంచి మిగతా నేర్చుకోవాల్సిందేమిటి?

లైకుల మత్తులో మాటలు అదుపు తప్పితే పతనం తప్పదు

సోషల్ మీడియాలో మనం రాసే రాతల వల్లో.. మాట్లాడే మాటల వల్లో.. మిగతా జనం మనల్ని ఫాలో అవుతారు. మనల్ని ఫాలో అయ్యేవాళ్లంటే మనకు రెస్పెక్ట్ ఉండాలి. వారి మనోభావాలని పరిగణనలోకి తీసుకోవాలి. 10 వేల లైకులు, లక్ష వ్యూస్ రాగానే.. ప్రతి వాడూ నేనే హీరో అనుకుంటాడు. మిగతా వాళ్లకంటే తానే స్పెషల్ అనే భ్రమల్లోకి వెళ్లిపోతారు. కానీ.. మాటలు అదుపుతప్పితే.. అడ్డంగా పడిపోతాడు. నిలువుగా కూలిపోతాడు. అందలం ఎక్కించిన జనమే.. తలపొగరు దించేస్తారు. కొన్ని గంటల్లోనే.. లక్షల మంది ఫాలోవర్లు అన్‌ఫాలో చేశారంటే.. అన్వేష్ ఎంత దిగజారి మాట్లాడాడో అర్థం చేసుకోవాలి. అందుకే.. నెటిజన్ల నుంచి ఇంత వ్యతిరేకత వస్తోంది.

అన్వేష్‌పై సోషల్ మీడియాలో తుఫాన్‌..

అన్వేష్ తీరుపై సోషల్ మీడియాలో ఓ యుద్ధమే ప్రకటించేశారు. అన్ ఫాలో ఉద్యమం నడిపిస్తున్నారు. నీ వీడియోలు చూడటం మానేస్తున్నామంటూ.. వేలాది మంది సబ్‌స్క్రైబర్లు నా అన్వేషణ ఛానెల్‌ను అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. ఒకప్పుడు హీరోగా చూసిన వారే ఇప్పుడు అతనొక జీరో అని ముద్ర వేస్తున్నారు. డబ్బు, ఫేమ్ రాగానే కళ్లు నెత్తికెక్కాయా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచం చుట్టేసినంత మాత్రాన జ్ఞానం రాదని.. సంస్కారం ముఖ్యమని కాస్త గట్టిగానే వేసుకుంటున్నారు. అన్వేష్ గతంలో చేసిన వీడియోలు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను మిక్స్ చేస్తూ.. మీమ్స్, ట్రోల్స్‌తో.. ఈ ఆటగాడిని ఓ ఆటాడుకుంటున్నారు. అతను వాడే భాష, బాడీ లాంగ్వేజ్.. అతని అహంకారానికి పరాకాష్ఠ అని విమర్శిస్తున్నారు.

నెటిజన్ల ఆగ్రహంతో దిగొచ్చిన అన్వేష్.. గరికపాటి, శివాజీకి క్షమాపణలు

నెటిజన్స్ అన్‌ఫాలో చేయడం, ఛానెల్‌కు రిపోర్టులు కొడుతుండటంతో.. అన్వేష్ దిగొచ్చాడు. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయాక.. అన్వేష్ తన తప్పు తెలుసుకున్నాడు. తను అన్న మాటలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గరికపాటికి, శివాజీకి క్షమాపణలు చెప్పాడు. సీతాదేవి, ద్రౌపదితో పాటు హిందువులపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని.. సారీ చెప్పాడు. తన క్షమాపణను స్వీకరించకపోతే.. కొత్త సంవత్సరంలో తనని టార్గెట్ చేసే వాళ్లందరికీ అష్ట దరిద్రాలు అంటుకుంటాయన్నాడు.

క్రేజ్‌ పెరిగింది, వినయం తగ్గిందా?

సోషల్ మీడియా పుణ్యమా అని.. ఓవర్‌నైట్‌లో స్టార్లు అయిపోవడం ఈజీనే. కానీ.. వచ్చిన ఇమేజ్‌ను, క్రేజ్‌ను నిలబెట్టుకోవడానికి కావాల్సింది కంటెంట్ ఒక్కటే కాదు.. క్యారెక్టర్ కూడా. అన్వేష్ చుట్టూ నడుస్తున్న కాంట్రవర్శీ చెబుతున్నది కూడా ఇదే. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా గళం విప్పి.. పాపులర్ అయిన అన్వేష్, ఇప్పుడు అదే ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాడు. లైఫ్‌లో సక్సెస్ వచ్చినప్పుడు వినయం పెరగాలి. బాధ్యతగా మెలగాలి. కానీ.. అన్వేష్‌కి మాత్రం బలుపు పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయ్.

ఫాలోవర్లా, మాటలు జాగ్రత్త.. సోషల్ మీడియా లో హీరో ఎవ్వరూ కాదు

తను ఎవరినైనా విమర్శించొచ్చు అనే ధోరణి.. అతని మాటల్లో కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు చుట్టేస్తున్నంత మాత్రాన.. సొంత గడ్డను, సొంత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? లక్షల మంది నిన్ను, నీ ఛానెల్‌ని ఫాలో అవుతున్నప్పుడు.. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. అతనేం మాట్లాడుతున్నాడో ఏమో.. అనే స్థాయిలో విమర్శలు వస్తున్నాయంటే.. లోపం ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత దూషణలు, అహంకారపూరిత వ్యాఖ్యలే.. పతనానికి దారితీస్తాయ్. అన్వేష్ విషయంలో.. ఇది మరోసారి రుజువైంది. అన్వేష్‌ని మొన్నటిదాకా నెత్తిన పెట్టుకున్న ఈ సోషల్ మీడియానే.. ఇప్పుడు అతని తలపొగరు దించే పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరూ ఆల్ టైమ్ హీరోలు కాదు. తేడాలొస్తే.. బలుపు దించి.. పాపులారిటీని పాతాళానికి పడగొట్టే కెపాసిటీ ఫాలోవర్లకే ఉంది.

అన్వేష్ ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సిందేమిటి?

అన్వేష్ ఇష్యూతో.. మిగతా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా స్టార్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత పాపులారిటీ ఉన్నా.. దిగజారి ప్రవర్తిస్తే మొత్తం తిరగబడుతుంది. అహంకారం తలకెక్కితే.. మేధస్సు మందగిస్తుంది. అప్పుడు.. తానేం మాట్లాడినా చెల్లుతుందని.. నన్నెవరూ ఏమీ చేయలేరనే భ్రమల్లో నుంచి బయటకు రావాలి. ముఖ్యంగా.. పురాణాల గురించి, ఓ దేశం గురించి, ఓ వర్గం గురించి మాట్లాడేటప్పుడు.. కనీస మర్యాద పాటించాలి. లేకపోతే.. నిన్ను సెలబ్రిటీని చేసిన ఫాలోవర్లే.. నువ్వు చిన్నచూపు చూస్తే లాగి కిందకు పడేస్తారు. అన్వేష్ ఎపిసోడ్.. సోషల్ మీడియా ప్రపంచానికి ఓ హెచ్చరిక. ఎంతటి పాపులారిటీ ఉన్నా సరే.. సంస్కారం లేని మాటలను ఎవరూ సహించరు. కేవలం వ్యూస్ కోసం, కాంట్రవర్సీల కోసం ప్రయత్నిస్తే.. ఎంతటి సామ్రాజ్యమైనా కుప్పకూలిపోతుంది. ఎక్కడో ఉత్తరాంధ్రలోని పల్లెటూరు నుంచి బయల్దేరి.. ప్రపంచం మొత్తం చుట్టేసి.. చివరికి తన నోటి దూలతో మళ్లీ పాతాళానికి పడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫాలోవర్లు అంటే.. మనుషులు కాదు.. వాళ్లు కూడా మనుషులే. వాళ్లకూ మనోభావాలంటాయ్.. వాటిని గౌరవించి తీరాల్సిందేననే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. తన తప్పు తెలుసుకొని.. బాధ్యతగా ప్రవర్తించకపోతే.. అన్వేష్ లాంటి వాళ్లు ఓ మెరుపులా మెరిసి మాయమైపోతారు.

Story by Anup , Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×