E-Paper
Advertisement

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?
Advertisement

QR Code Technology:

షాపింగ్ చేశామా.. క్యూ ఆర్ కోడ్!
సినిమాకి వెళ్ళామా.. క్యూ ఆర్ కోడ్!
ఆఖరికి టీ షాప్ దగ్గర కూడా ఈ క్యూ ఆర్ కోడ్‌లే దర్శనమిస్తున్నాయి.

Advertisement

వాటిని గనుక మీరు సరిగ్గా పరిశీలిస్తే, చుక్కలు చుక్కలుగా ఉన్న ఆ కోడ్‌లో మూడు బాక్సులు కనిపిస్తాయి. అసలు మన జీవితంలో ఇంతలా పాతుకుపోయిన ఆ క్యూ ఆర్ కోడ్‌లేంటో, వాటిలో ఆ మూడు బాక్సులు ఎందుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించకపోతే ఇప్పుడు డీటైల్డ్ గా తెలుసుకుందాం రండి.

అసలు ప్రపంచమే ఆగిపోతుందా అన్నట్టుగా ప్రతీ పల్లెకూ విస్తరించిన ఈ క్యూఆర్ కోడ్‌లో మూడు మూలలకు ఉన్న ఆ మూడు బాక్సులు ఏదో డిజైన్ బాగుండడానికో, లేదా ఏమీ పాలుపోక అలా పెట్టినవో అనుకుంటే మీరు స్కాన్‌లో కాలేసినట్టే! ఎందుకంటే ఆ మూడు బాక్సులే మనం స్కాన్ చేసే క్యూ ఆర్ కోడ్‌కి అసలైన హార్ట్ బీట్.

ఎలా రీడ్ చేస్తుందంటే..

Advertisement

అవును.. మనం మాములుగా ఎక్కువ శాతం ఎదురుగా నిలబడే స్కాన్ చేస్తాం. కానీ ఆ క్యూ ఆర్ కోడ్‌కి ఎవరైనా ఎదురుగా ఉన్నా, లేక మనకి కాస్త దూరంగా ఉన్నా.. కాస్త సైడ్ నుండో, లేక ఫోన్‌ని పైకి పట్టుకునో స్కాన్ చేస్తాం. అదిగో అలా ఫోన్‌ని వంకర పెట్టినా, లేక తిప్పి రివర్స్‌లో పెట్టి స్కాన్ చేసినా ఫోన్ ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా టకీమనీ స్కాన్ అయిపోయి పేమెంట్‌కి పర్మిషన్ ఇస్తుంది.

అలా ఎలా పెట్టినా ఫోన్ కోడ్‌ని రీడ్ చేస్తుందంటే.. ఇదిగో ఈ మూడు మూలల్లో ఉన్న బాక్సుల వల్లే! వీటినే సాంకేతిక భాషలో “ఫైండర్ ప్యాటర్న్స్” (Finder Patterns) అంటారు.

మనం కెమెరాని ఆ కోడ్ మీద పెట్టగానే, కోడ్ మీదున్న మూడు బాక్సులని వెంటనే గుర్తుపట్టేస్తుంది. అవి ఏ యాంగిల్‌లో ఉన్నాయో చూసి, క్యూఆర్ కోడ్ ఏ వైపు ఎలా తిరిగి ఉందో సరిగ్గా లెక్కలేసుకుని లోపల ఉన్న మ్యాటర్‌ని చదివేస్తుంది.

ఇక్కడే మాథ్స్ లో ఉన్న ఒక లాజిక్!

అయితే ముచ్చటగా మూడే ఎందుకు, ఆ నాలుగో మూల ఏం పాపం చేసిందని అనుకుంటున్నారా? అక్కడే మీరు మళ్ళీ కోడ్‌లో కాలేశారు! ఎందుకంటే ఇక్కడే మీకు మాథ్స్ లో ఉన్న ఒక లాజిక్ తెలియాలి.

అదేంటంటే.. ఒక వస్తువు ఏ దిశలో ఉందో చెప్పడానికి మూడు పాయింట్లు ఉంటే చాలు. ఆ నాలుగో మూలను ఖాళీగా వదిలేయడం వల్లే కెమెరాకు కోడ్ ఏ వైపు పైకి ఉందో, ఏ వైపు కిందకు ఉందో ఈజీగా అర్థమైపోతుందన్నమాట.

అలా కాకుండా మీరనుకున్నట్టుగా నాలుగో మూలలో కూడా బాక్స్ పెట్టారనుకోండి.. కెమెరాకి ఏది పై భాగమో, ఏది కింది భాగమో తెలీక కన్ఫ్యూజన్ లో పడిపోతుంది (ఎందుకంటే ఎటు చూసినా సేమ్ ఉంటాయి కాబట్టి). సో, మూడు బాక్సులే పెట్టడానికి కారణం అదన్నమాట!

 ఈ టెక్నాలజీని ఎవరు కనిపెట్టారో తెలుసా?

ఇక మన జీవితంలో భాగమైపోయిన ఈ టెక్నాలజీని ఎవరు కనిపెట్టారో తెలుసా? జపాన్‌కు చెందిన మసహిరో హారా (Masahiro Hara) అనే ఇంజనీర్ దీన్ని కనిపెట్టారు. అది కూడా 1994లోనే!

డెన్సో వేవ్ (Denso Wave) అనే కంపెనీలో కార్ల స్పేర్ పార్ట్స్‌ను వేగంగా ట్రాక్ చేయడానికి పాత బార్‌కోడ్లు సరిపోకపోవడంతో, ఈ క్యూఆర్ (Quick Response) కోడ్‌ను డిజైన్ చేశాడట మసహిరో హారా.

అయితే ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? దీని మీద మరకలు పడ్డా, కోడ్ కాసింత చిరిగిపోయినా, అంతెందుకు ఒక 30 శాతం పాడైనా సరే.. ఏం ప్రాబ్లం లేదంటూ టకీమని పేమెంట్‌కి పర్మిషన్ ఇచ్చేస్తుంది! దీన్నే “ఎర్రర్ కరెక్షన్” (Error Correction) అంటారు.

అలా అని విచ్చలవిడిగా వాడేసి, మూడు మూలలా ఉన్న మూడు బాక్సులని కనిపించకుండా చేస్తే మాత్రం చచ్చినా పేమెంట్‌కి పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే మొదట్లోనే చెప్పుకున్నాం కదా.. ఈ మూడు బాక్సులే కోడ్‌కి హార్ట్ బీట్ అని!

 క్యూ ఆర్ కోడ్‌ల వెనుకున్న అసలు కథ!

కాబట్టి ఇకపై మీరు స్కాన్ చేసే ప్రతిసారీ ఆ మూడు బాక్స్‌లు కనిపిస్తే..”అబ్బో! స్కానింగ్ ఇంత స్పీడ్‌గా అవ్వడానికి అసలైన కారణం వీళ్లేనా!”అని ఒకసారి గుర్తుచేసుకోండి, ఓకే నా?

ఇదండీ క్యూ ఆర్ కోడ్‌ల వెనుకున్న అసలు కథ!

Related News

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన మాజీ సీఎంలు.. ప్ర‌తిన‌ బూని మ‌ళ్లీ సీఎంగానే అడుగుపెట్టి.. ! జ‌య‌లలిత ఎపిసోడ్ టోట‌ల్ డిఫ‌రెంట్‌..

తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ పొలిటికల్ హిస్టరీ.. కేబినెట్ నుంచి బర్తరఫ్‌ అయిన మంత్రుల పూర్తి లిస్ట్ ఇదే!

బ‌ర్త‌ర‌ఫ్ వేడి చ‌ల్లారిన త‌రువాతే.. విస్త‌ర‌ణ‌! ఆశావహులకు ఇంకా హ‌స్తిన‌ ద్వారాలు తెరిచే ఉన్నాయి..!

కొండా సురేఖపై వేటుతో షాక్ తిన్న కీలక నేతలు.. సీఎం రేవంత్ నెక్ట్స్ ప్లాన్ ఇదేనట..?

ప‌నిచేయ‌ని బీసీ కార్డు.. కరువైన సానుభూతి.. ఆదుకోని మ‌హిళా బీసీ నేత కోటా… ఆ కుటుంబంపై అంత‌టా వ్య‌తిరేక‌తే.. ఎందుకు?

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

Big Stories

Advertisement
×