E-Paper
Advertisement

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా
Advertisement

Tamil Family Drama: గుడికి ఎవ్వరైనా ప్రశాంతత కోసం వెళతారు. కోరిన కోరికలు తీరితే ముడుపులు చెల్లించుకోవడానికి దైవ సన్నిధానానికి వెళతారు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక జరగరానిది జరిగి, గుండెకోత మిగిలితే… అసలే మాటలు కూడా రాని ఆ మూగతల్లి దేవుడి సాక్షిగా అన్యాయానికి గురైతే… కన్నకొడుకును పోగొట్టుకుని కడుపుకోతకు గురైన ఆమెను ఏకంగా తప్పు చేసింది అంటూ జైల్లో పడేస్తే… ఇలాంటి స్టోరీ లైన్ తో రూపొందిన తమిళ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామానే ‘సన్నిధానం పీఓ (Sannidhanam P.O). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో వీక్షించవచ్చు ? తెలుగులో చూడొచ్చా ? అన్న వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథలో యశోధ అనే మూగ మహిళ మెయిన్ లీడ్. ఆమె తన చిన్న కొడుకు శబరిని తీసుకుని మొదటిసారి శబరిమల యాత్రకు వెళ్తుంది. అయితే అక్కడ జరిగిన ఒక దురదృష్టకరమైన గందరగోళంలో పోలీసులు ఆమెను అన్యాయంగా అరెస్ట్ చేస్తారు. ఆ జనసమూహంలో ఆమె కొడుకు మిస్ అవుతాడు. తల్లి జైలుకు వెళ్లడంతో, అనాథగా మిగిలిన ఆ చిన్న బాబును ఒక అపరిచిత కుటుంబం చేరదీసి పెంచుతుంది. ఆ అబ్బాయి పెద్దయ్యాక ఒక క్యాటరర్‌గా మారతాడు. అతనే మన హీరో శబరి (యోగి బాబు).

Advertisement

చిన్నప్పుడే మిస్ అవ్వడంతో అతనికి తల్లికి సంబంధించిన జ్ఞాపకాలేమీ ఉండవు. అతనికి అసలు తన తల్లి ఎవరనే విషయం కూడా తెలియదు. మరోవైపు జైలు శిక్ష ముగించుకుని బయటకు వచ్చిన యశోద, ఒక ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. తన కొడుకు ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంటాడనే నమ్మకంతో ఇంకా వెతుకుతూనే ఉంటుంది. దశాబ్దాల తర్వాత యశోద కేసుకు సంబంధించిన ఫైల్స్ మళ్లీ రీఓపెన్ అవుతాయి.

ఒక పోలీస్ అధికారి కుమార్తె అనుకోకుండా ఈ పాత కేసుకు సంబంధించిన ఆధారాలను, ప్రస్తుత పరిస్థితులను లింక్ చేస్తుంది. శబరిమల సన్నిధానం నేపథ్యంలో ఆ మూగ తల్లి, తన కొడుకును మళ్లీ ఎలా కలుసుకుంది ? దశాబ్దాల క్రితం ఆమె అన్యాయంగా అరెస్ట్ కావడానికి వెనుక ఉన్న అసలు నిజాలు ఎలా బయటకు వచ్చాయి ? చివరికి ఆ తల్లీకొడుకులు కలుసుకున్నారా లేదా ? అన్నది సినిమాలో చూసి తెలుసువకోవలసిన కథ.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

శబరిమల భక్తి నేపథ్యంతో ముడిపడిన తమిళ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘సన్నిధానం పీవో’. తల్లి-కొడుకు సెంటిమెంట్ కథ. అముత సారథి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలైంది. జులై నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ ఆడియోతో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ రాలేదు. భాష అడ్డు కాదు అనుకుంటే తమిళంలోనే మూవీని చూడవచ్చు. శబరిమల సన్నిధానంలో దాగిన ఆ తల్లి ప్రేమ హృదయాన్ని కదిలిస్తుంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలను చూడాలనుకునే వారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ సినిమాపై ఒక లుక్కేయండి.

Read Also: ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×