E-Paper
Advertisement

3 నెలలకే గిన్నిస్ రికార్డు.. ఏకంగా ఐదు రికార్డులతో సంచలనం సృష్టించిన బిగ్ బాస్ సోనియా కూతురు!

3 నెలలకే గిన్నిస్ రికార్డు.. ఏకంగా ఐదు రికార్డులతో సంచలనం సృష్టించిన బిగ్ బాస్ సోనియా కూతురు!
Advertisement

Bigg Boss Sonia: సాధారణంగా మూడు నెలల వయసున్న పిల్లలు కనీసం బోర్లా పడటానికే ప్రయత్నిస్తుంటారు. కానీ, బిగ్ బాస్ ఫేమ్ సోనియా, యష్ వీరగోని దంపతుల గారాల పట్టి ‘శిఖ’ మాత్రం అప్పుడే గిన్నిస్ రికార్డుకెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుని చిన్న వయసులోనే పెద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిన్నారి అద్భుత ఫీట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

బుడిబుడి అడుగుల ముందే వరల్డ్ రికార్డ్:

బిగ్ బాస్ సోనియా, ఆమె భర్త యష్‌లకు పుట్టిన చిన్నారి శిఖ వీరగోని, కేవలం 3 నెలల 29 రోజుల వయసులోనే ప్రపంచ రికార్డును నెలకొల్పింది. “లాంగెస్ట్ డ్యూరేషన్ బై యాన్ ఇన్ఫాంట్ మెయింటైనింగ్ అసిస్టెడ్ అప్రైట్ బ్యాలెన్స్ ఆన్ ఏ పేరెంట్స్ పామ్” (నాన్న అరచేతిపై నిటారుగా బ్యాలెన్స్ చేస్తూ నిలబడటం) అనే విభాగంలో ఈ రికార్డు సాధించింది. తన తండ్రి అరచేతిపై ఏకంగా 2 నిమిషాల 43 సెకన్ల పాటు నిలబడి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

ఏకంగా 5 రికార్డులతో శిఖ సంచలనం:

Advertisement

కేవలం గిన్నిస్ రికార్డు మాత్రమే కాదు, ఈ చిన్నారి ఏకకాలంలో ఐదు ప్రధాన రికార్డులను తన పేరున లిఖించుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శిఖ స్థానం దక్కించుకుంది. ఇక ఇంత చిన్న వయసులో ఇన్ని రికార్డులు సాధించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావచ్చు. ఈ విజయాన్ని చూసి సోనియా దంపతులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు.

అందరినీ ఆకట్టుకుంటున్న శిఖ వీడియో:

Advertisement

శిఖ సాధించిన ఈ ఘనతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లైవ్ వీడియోలో ఆ చిన్నారి తన తండ్రి కళ్ళలోకి చూస్తూ, నవ్వుతూ బ్యాలెన్స్ చేస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ ముగ్ధులను చేస్తోంది. అయితే, ఇలాంటివి ఇంట్లో ప్రయత్నించవద్దని, ఇవి నిపుణుల సమక్షంలో మరియు పాపకు ఉన్న సహజమైన సామర్థ్యం బట్టి చేసినవని వారు హెచ్చరించారు. మొత్తానికి బిగ్ బాస్ సోనియా కూతురు ఇప్పుడు ‘ప్రౌడ్ ఇండియన్’గా గిన్నిస్ రికార్డుల్లో నిలిచిపోయింది.

 

also read: పదహారేళ్ళ వయసు.. అమ్మ ముందే కమిట్మెంట్.. టాలీవుడ్ పై వితికా శేరు అసహనం!

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×