E-Paper
Advertisement

Bank Holidays April 2026: అమ్మబాబోయ్.. ఏప్రిల్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల హాలీడేస్ లిస్ట్ ఇదే!

Bank Holidays April 2026: అమ్మబాబోయ్.. ఏప్రిల్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల హాలీడేస్ లిస్ట్ ఇదే!
Advertisement

Bank Holidays April 2026: సాధారణంగా ప్రతినెలా బ్యాంకులు పనిచేసే తేదీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేస్తుంటుంది. నేటి నుంచి (1వ తేదీ) ఏప్రిల్ నెలలో అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ నెలకు సంబందించిన హాలీడేస్ జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. బ్యాంకుల వార్షిక ముగింపు, పండుగలు, వారంతపు సెలవులు కలిపి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేసే బ్యాంకులు.. ఈ నెలలో ఏకంగా 14 రోజులు మూసి ఉండనున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని బ్యాంకుల సెలవుల జాబితా ఇప్పుడు చూద్దాం.

  • ఏప్రిల్ 1: బ్యాంకుల వార్షిక ముగింపు సందర్భంగా సెలవును నిర్ణయించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఇది వర్తిస్తుంది.
  • ఏప్రిల్ 2: ఈస్టర్ ముందు పవిత్ర గురువారం కావడంతో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్ 3: శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు. మెజారిటీ రాష్ట్రాల్లోని బ్యాంకులు దీనిని అమలు చేయనున్నాయి.
  • ఏప్రిల్ 5: ఆదివారం కావడంతో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సెలవు.
  • ఏప్రిల్ 11: రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలీడే.
  • ఏప్రిల్ 12: ఆదివారం కావడంతో సహజంగానే బ్యాంకులకు వారంతపు సెలవు.
  • ఏప్రిల్ 14: డా. బీఆర్ అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, వైశాఖి సందర్భంగా మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సరం, హిమాచల్ డే సందర్భంగా బెంగాల్, హిమాచల్ రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే.
  • ఏప్రిల్ 16: బోగహ్ బిహూ సందర్భంగా అసోంలోని బ్యాంకులకు సెలవులు.
  • ఏప్రిల్ 19: ఆదివారం రావడంతో వారంతపు సెలవు.
  • ఏప్రిల్ 20: బసవ జయంతి సందర్భంగా కర్ణాటకలోని బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా త్రిపుర రాష్ట్రంలో బ్యాంకులకు హాలీడే.
  • ఏప్రిల్ 25: నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్ 26: ఆదివారం కావడంతో వారంతపు సెలవు.

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ హాలీడేస్

తెలుగు రాష్ట్రాల బ్యాంకుల విషయానికి వస్తే.. రెండో శనివారం, ఆదివారం కాకుండా నాలుగు రోజుల సెలవులను ఆర్బీఐ ప్రకటించింది. ఏప్రిల్ 1 (వార్షిక ముగింపు), ఏప్రిల్ 3 (గుడ్ ఫ్రైడే), ఏప్రిల్ 5 (జగ్జీవన్ రామ్ జయంతి), ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి) తేదీల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. వారంతపు సెలవులు కూడా కలుపుకుంటే (2వ, 4వ శనివారం, 4 ఆదివారాలు) మెుత్తం 9 రోజులు బ్యాంకులకు హాలీడేస్ లభించనున్నాయి. అయితే జగ్జీవన్ రామ్ జయంతి ఆదివారం రావడం గమనార్హం.

Advertisement

ముఖ్యగమనిక: రాష్ట్రాల వారీగా స్థానిక పండుగలను బట్టి సెలవుల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కాబట్టి మీ స్థానిక బ్యాంక్ శాఖను సంప్రదించి సెలవులపై స్పష్టత తెచ్చుకోవడం మంచిది.

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×