E-Paper
Advertisement

ఇండియన్ నేవీలో అగ్నివీర్ కొలువులు.. మంచి భవిష్యత్తు, ఇంకెందుకు ఆలస్యం

ఇండియన్ నేవీలో అగ్నివీర్ కొలువులు.. మంచి భవిష్యత్తు, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. భారత నౌకాదళంలో చేరి దేశానికి సేవలందించాలని భావించే యువతకు ఇది మంచి అవకాశం. అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ (MR మ్యూజిషియన్) 02/2026 బ్యాచ్ నియామకానికి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

సంగీత రంగంలో ప్రావీణ్యం ఉన్న అవివాహిత పురుషులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు నాలుగు సంవత్సరాల పాటు నావికాదళంలో సేవలు అందించాల్సి ఉంటుంది.

Advertisement

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యా అర్హతతో పాటు భారతీయ లేదా విదేశీ సంగీత వాద్య పరికరాలను వాయించడంలో నైపుణ్యం తప్పనిసరి. గుర్తింపు పొందిన సంగీత సంస్థల నుంచి పొందిన సర్టిఫికెట్లు లేదా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న పత్రాలు ఉండాలి.

వయస్సు: వయోపరిమితి విషయానికి వస్తే అభ్యర్థులు 2004 జులై 1 నుంచి 2008 డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. నాలుగేళ్ల సేవా కాలంలో అభ్యర్థులు వివాహం చేసుకోకూడదనే నిబంధన ఉంది.

Advertisement

జీతం: అగ్నివీర్లకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీని ప్రభుత్వం అందిస్తోంది. మొదటి ఏడాది నెలకు రూ.30,000 జీతం లభిస్తుంది. రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 చొప్పున వేతనం అందుతుంది. దీనికి అదనంగా రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్సులు కూడా ఉంటాయి.

నాలుగేళ్ల సేవ ముగిసిన తర్వాత సేవా నిధి ప్యాకేజీ కింద ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందే వీలుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ బహుళ దశల్లో సాగుతుంది. మొదట పదో తరగతి మార్కులు,  మ్యూజిక్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం వీరికి శారీరక దారుఢ్య పరీక్ష (PFT), మ్యూజిక్ అబిలిటీ టెస్ట్, ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

మ్యూజిక్ అబిలిటీ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు. తుది ఎంపికైన వారు ఒడిషాలోని ఐఎన్‌ఎస్ (INS) చిల్కాలో ప్రీ-ఎన్రోల్మెంట్ మెడికల్ పరీక్షలకు హాజరు కావాలి.

ముఖ్యమైన తేదీలు: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2026 ఏప్రిల్ 11న ప్రారంభమై ఏప్రిల్ 26తో ముగుస్తుంది. నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేయాలి.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://indiannavy.gov.in/

ALSO READ: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×