BigTV English
Advertisement

Best Mobiles: అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Best Mobiles: అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Best Mobiles Under 10000: టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. ఫ్రెండ్లీ బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు దొరుకుతున్నాయి. లేటెస్ట్ ఫీచర్లు, హై కెమెరా క్వాలిటీ, స్ట్రాంగ్ ప్రాసెసర్, మంచి స్టోరేజీతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రూ. 10 వేల లోపు మార్కెట్లో దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


1.Realme NARZO N63- రూ. 7,199

Realme NARZO N63 తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్. 4GB RAM, 64GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP AI కెమెరాను కలిగి ఉంది. అద్భుతంగా ఫోటోలు తీయడంలో సాయపడుతుంది. మంచి లుక్ తో పాటు అల్ట్రా స్లిమ్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.


 2.Redmi 13C- రూ.7,199

స్టార్‌ షైన్ గ్రీన్‌ లో Redmi 13C ఆకట్టుకుంటుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. 4G MediaTek Helio G85 ప్రాసెసర్, 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP AI ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది.

3.POCO C65-  రూ.6,999

పాస్టెల్ బ్లూలో POCO C65 స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునేలా ఉంటుంది. 8GB RAM, 256GB స్టోరేజ్ ను కలిగి ఉంది.  గేమింగ్, స్ట్రీమింగ్ కోసం వాడుకోవచ్చు. యాప్స్, వీడియోలు, ఫైల్స్ సేవ్ చేసుకునేందుకు బోలెడంత స్పేస్ ఉంటుంది.

4.Samsung Galaxy M14- రూ.8,148

ఆర్కిటిక్ బ్లూలో ఉన్నసామ్ సంగ్ గెలాక్సా  M14 4G చక్కటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో పవర్ ఫుల్ స్నాప్‌ డ్రాగన్ 680 ప్రాసెసర్‌ ఉంటుంది. 4GB RAM, 64 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. 50MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. 5000mAh బ్యాటరీ సపోర్టును కలిగి ఉంటుంది.

5.Redmi 12- రూ. 9,999

మూన్‌ స్టోన్ సిల్వర్‌ కలర్ లోని రెడ్‌మి 12 మంచి స్టోరేజ్, చక్కటి పనితీరును కలిగి ఉంటుంది. 6GB RAM,  128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంది. బ్రౌజింగ్, గేమింగ్ కు ఎలాంటి ఇబ్బంది కలగదు. స్మార్ట్ లుక్ తో ఆకట్టుకుంటుంది. Redmi 12  పవర్ ఫుల్ హార్డ్ వేర్ ను కలిగి ఉంటుంది.

6.Lava Blaze 5g- రూ. రూ.9,299

గ్లాస్ బ్లూ కలర్ లో ఉన్న లావా బ్లేజ్ 5G లేటెస్ట్ స్మార్ట్ ఫోన్. అల్ట్రా-ఫాస్ట్ కనెక్టివిటీ కోసం 5Gని కలిగి ఉంది.  4GB RAM, 128GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది 50MP AI ట్రిపుల్ కెమెరా ఉంటుంది. బ్లోట్‌ వేర్ లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

7.Vivo Y18e- రూ. 7,999

స్పేస్ బ్లాక్‌ లోని vivo Y18e చక్కటి లుక్ తో పాటు మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB RAM,  64GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది. స్మూత్ గా గేమింగ్, బ్రౌజింగ్ చేసుకోవచ్చు.

8.itel Color Pro 5G- రూ. 9,999

ఈ స్మార్ట్ ఫోన్ స్టైలిష్ లుక్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. 50 MP AI కెమెరాను కలిగి ఉంది. 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది.

Read Also: ఆండ్రాయిడ్ వాడుతున్నారా.. ఆ ట్రిక్స్ తెలుసుకోకపోతే హ్యాక్ అవుతుంది మరి!

Related News

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Big Stories

×