BigTV English

Tirupati: శవంతో సాహస యాత్ర! ప్రాణాలకు తెగించినా పట్టించుకోని అధికార యంత్రాంగం

Tirupati: శవంతో సాహస యాత్ర! ప్రాణాలకు తెగించినా పట్టించుకోని అధికార యంత్రాంగం

Sahasa Yatra with The Corpse: బంగాళాఖాతంలో అల్పపీడనంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఓ వైపు జోరు వాన.. ఉప్పొంగుతున్న నది.. చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయాలంటే చాలా ఇబ్బంది. నది దాటితేగానీ శవాన్ని కననం చేయలేని దుస్థితి. వంతెన లేని నదిని దాటడానికి గ్రామస్తులు, బంధువులు సాహసం చేశారు. నడుములోతు ప్రవహిస్తున్న నీటిని దాటుకొని అంత్యక్రియలు నిర్వహించారు. ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి.. అధికారులు నిర్లక్ష్యం, అలసత్వమే ఈ దుస్థితికి కారణమని అక్కడి జనాలు వాపోతున్నారు.


తిరుపతిలో భారీ వర్షాలు పడుతున్నాయి. జనాలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదు. ఇక సత్యవేడు నాగలాపురం మండలం సురుటుపల్లిలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో అంత్యక్రియలు చేయలేని పరిస్థితి నెలకొంది. శ్మశానానికి తరలించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. బాడీని శ్మశానానికి తరలించేందుకు పెద్ద సాహస యాత్రే చేశారు బంధువులు, స్నేహితులు.

అంత్యక్రియలు చేయాలంటే అరుణానది దాటాల్సిన పరస్థితి వచ్చింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి అంత్యక్రియలు చేశారు. శవాన్ని భుజాలపై మోసుకుని నడుము లోతు నీటిలో కాలవను దాటుకుని అంత్యక్రియలు నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతో వంతెన నిర్మాణం జరగలేదు.


Also Read:  ఏపీలో సామాన్యులకు మద్యం పంట.. లిక్కర్ వ్యాపారులకు షాక్

ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం మాత్రం శూన్యం. గతంలో వంతెన నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. పేపర్‌పై వర్క్‌ మొత్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ వంతెన మాత్రం పూర్తి కాలేదు.. కనీసం కూటమి సర్కారు అయిన వంతెనను పూర్తి చేయాలని.. తమ బాధను పట్టించకుని ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×