E-Paper
Advertisement

Eggs Price: భారీగా తగ్గనున్న కోడి గుడ్ల ధరలు.. ప్రస్తుతం ఎంతంటే?

Eggs Price: భారీగా తగ్గనున్న కోడి గుడ్ల ధరలు.. ప్రస్తుతం ఎంతంటే?
Advertisement

Eggs Price: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దేశం నుంచి ఎగుమతులకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కోడి గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. గుడ్ల రేట్లు తగ్గడంతో.. వినియోగదారులకు ప్రయోజనం కలిగినప్పటికీ, దేశీయ మార్కెట్లో గుడ్ల నిల్వలు భారీగా పేరుకుపోతుండటంతో పౌల్ట్రీ రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు.

ఎగుమతులు తగ్గడంతో

పశ్చిమ ఆసియా దేశాలకు లక్షల కొద్దీ గుడ్లు నిత్యం ఎగుమతి అవుతుండేవి. అయితే, యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు భారీగా తగ్గాయి. దీనివల్ల గుడ్ల సరఫరా తగ్గి ధరలు పడిపోయాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఒక గుడ్డు ధర రూ. 7.50 నుంచి రూ. 8 వరకు ఉండగా, తాజాగా ఆ ధర సుమారు రూ. 5కి పడిపోయింది. టోకు మార్కెట్‌లో 15 రోజుల క్రితం గుడ్డు ధర రూ. 4.50 ఉండగా, ప్రస్తుతం అది రూ. 4కి తగ్గింది.

అంతరాయం, ఉష్ణోగ్రతలు

Advertisement

గుడ్ల ఎగుమతులకు అంతరాయం కలగడంతో పాటు, ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా వేసవిలో గుడ్ల వినియోగం తగ్గుతుంది. దీని ఫలితంగా డిమాండ్‌ తగ్గిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత వేసవిలో, గుడ్డు టోకు ధరలు రూ. 5 నుంచి రూ. 6 మధ్య ఉన్నాయి. రిటైలర్ ధరలు రూ. 6 నుంచి రూ. 6.50 మధ్య ఉన్నాయి. అయితే, ఈ ఏడాది ధరలు మరింతగా తగ్గడానికి అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులే కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

గల్ఫ్ దేశాలకు ఎగుమతి

భారత్ నుంచి యూఏఈ, ఒమన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకు లక్షల్లో గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్రం, వాయు రవాణా సేవలకు అంతరాయం కలగడంతో ఎగుమతులపై ప్రభావం పడింది. ప్రస్తుతం, గుడ్ల ధరలు నష్టాల్లో ఉన్నా.. కోడి మాంసం ధరలు కిలోకు రూ. 335కి ఆకాశాన్నంటాయి. 2026 ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లో 100 గుడ్లను రూ. 520కి విక్రయించగా, ఒక్కో గుడ్డు ధర రూ. 5.20గా ఉంది. అయితే, మార్చి 18 నాటికి వీటి ధర రూ. 420కి పడిపోయి, ఒక్కో గుడ్డు ధర రూ. 4.20కు చేరుకుంది.

Advertisement

Also Read: ఎండాకాలంలో ఎగ్స్ తింటున్నారా ? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవు

దేశ ఉత్పత్తిలో 10 శాతం

తెలంగాణలో ప్రతిరోజూ 3.5 కోట్ల నుంచి 3.7 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. దేశవ్యాప్త ఉత్పత్తిలో తెలంగాణది 10 శాతం వాటా. ఈ ఉత్పత్తిలో సగం రాష్ట్రంలో వినియోగించుకుంటుండగా, మిగిలినవి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తమిళనాడులోని నామక్కల్ నుంచి పశ్చిమ ఆసియాకు గుడ్లు ఎక్స్ పోర్ట్ అవుతాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఈ ఎగుమతి నిలిచిపోయింది. దీంతో నామక్కల్‌లోని స్థానిక పౌల్ట్రీ రైతులు గుడ్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో కోడి మాంసం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో స్కిన్ లెస్ కోడి మాంసం ధర సుమారు రూ. 320 నుంచి రూ. 335 వరకు ఉంది. నాటు కోడి మాంసం ధర ఇంకా భారీగా కిలో రూ. 750 చేరింది. గత నెలలో, ఒక కిలో కోడి మాంసం ధర సుమారు రూ. 175 నుంచి రూ. 200 మధ్య ఉండేది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×