E-Paper
Advertisement

Eggs: ఎండాకాలంలో ఎగ్స్ తింటున్నారా ? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవు

Eggs: ఎండాకాలంలో ఎగ్స్ తింటున్నారా ? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవు

Eggs: సాధారణంగా కోడిగుడ్డును ప్రకృతి ప్రసాదించిన ‘సూపర్ ఫుడ్’ లేదా ‘సంపూర్ణ ఆహారం’గా భావిస్తాం. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారాలి. ముఖ్యంగా వేసవి కాలంలో.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఇలాంటి సమయంలో గుడ్లు అతిగా తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వేసవిలో ఎగ్స్ ఎక్కువగా వల్ల తలెత్తే ఇబ్బందులు మొదలైన విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో కోడిగుడ్లు – సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

కోడిగుడ్డు అంటేనే ‘ప్రోటీన్ పవర్‌హౌస్’. జిమ్‌కు వెళ్లే వారైనా.. పెరుగుతున్న పిల్లలైనా రోజూ గుడ్డు తినడానికి ఇష్టపడతారు. ఆరోగ్య పరంగా చూస్తే గుడ్డుకు సాటి మరేదీ లేదు. కానీ ఎండాకాలం రాగానే “గుడ్లు తింటే వేడి చేస్తుంది” అనే మాట మనకు తరచుగా వినిపిస్తుంది. సైన్స్ పరంగా చూసినా ఇందులో కొంత నిజం లేకపోలేదు. వేసవిలో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..

1. శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరగడం :
కోడిగుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మన శరీరం ప్రోటీన్లను జీర్ణం చేసుకోవడానికి, వాటిని విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. దీనినే సైన్స్ భాషలో ‘థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్’ అంటారు. దీని వల్ల శరీరంలో అంతర్గత వేడి ఉత్పన్నమవుతుంది. బయట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న సమయంలో.. గుడ్లు అతిగా తినడం వల్ల శరీరం మరింత వేడెక్కి నీరసం, విపరీతమైన చెమటలు పట్టడం ,అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి.

2. జీర్ణక్రియలో ఆటంకాలు:
వేసవిలో మన జీర్ణ వ్యవస్థ కాస్త నెమ్మదిగా పని చేస్తుంది. ఎండల వల్ల శరీరంలోని నీరు ఆవిరైపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇలాంటి సమయంలో గుడ్లు వంటి బరువైన ప్రోటీన్ ఆహారాన్ని అతిగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం , గ్యాస్ ,అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి పూట గుడ్లు తింటే.. అది సరిగ్గా అరగక నిద్రలేమికి కూడా దారి తీయవచ్చు.

3. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల భయం :
ఎండాకాలంలో ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయి. కోడిగుడ్లలో ‘సాల్మొనెల్లా’ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం వేసవిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయని గుడ్లు లేదా పగుళ్లు ఉన్న గుడ్లను తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల తీవ్రమైన వాంతులు, విరేచనాలు కడుపునొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వేసవిలో బయట దొరికే హాఫ్ బాయిల్డ్ లేదా పచ్చి గుడ్ల మిశ్రమాలకు దూరంగా ఉండాలి.

4. చర్మ సమస్యలు, వేడి కురుపులు:
అధిక వేడి , గుడ్ల వల్ల కలిగే ఉష్ణోగ్రత కలగలిసి చర్మంపై దద్దుర్లు, మొటిమలు రావడానికి కారణం కావచ్చు. శరీరంలో వేడి పెరిగినప్పుడు అది చర్మం ద్వారా బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా.. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు వేసవిలో రోజుకు 3-4 గుడ్లు తింటే వేడి కురుపులు వచ్చే అవకాశం మెండుగా ఉంది.

5. కిడ్నీలపై భారం:
ప్రోటీన్లు అధికంగా తీసుకున్నప్పుడు వాటిని ఫిల్టర్ చేయడం కిడ్నీలకు ఒక సవాలుగా మారుతుంది. వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు.. గుడ్లలోని ప్రోటీన్ జీర్ణం కావడానికి కిడ్నీలు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. సరైన మోతాదులో నీరు తాగకుండా గుడ్లు తింటే.. అది దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలకు దారి తీయవచ్చు.

Also Read: సమ్మర్‌లో ముఖంపై ట్యాన్ రాకుండా.. మెరిసిపోవాలా ?

మరి వేసవిలో గుడ్లు పూర్తిగా మానేయాలా?
ఖచ్చితంగా అవసరం లేదు! కానీ తినే పద్ధతి మార్చుకోవాలి.

పరిమితి పాటించండి: వేసవిలో సాధారణ వ్యక్తి రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లకు మించి తినకపోవడం మంచిది. శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారు ఒక గుడ్డుతో సరిపెట్టుకోవాలి.

పచ్చసొనను తగ్గించండి: గుడ్డులోని పచ్చసొనలో కొవ్వు, వేడి చేసే గుణం ఎక్కువ. వేసవిలో కేవలం తెల్లసొన మాత్రమే తినడం వల్ల ప్రోటీన్ అందుతుంది. అంతే కాకుండా శరీరం చల్లగా ఉంటుంది.

నీరు ఎక్కువగా తాగండి: గుడ్లు తిన్న రోజున శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి కనీసం 3-4 లీటర్ల నీరు, మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి.

సరైన వంట విధానం: వేసవిలో గుడ్లను మసాలాలతో వేయించి ‘ఎగ్ ఫ్రై’ లాగా కాకుండా.. కేవలం ఉడికించిన గుడ్లు అలాగే తీసుకోవడం ఉత్తమం.

తాజా గుడ్లనే వాడండి: ఎండల వల్ల గుడ్లు త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తాజాగా ఉన్నాయో లేదో పరీక్షించి (నీటిలో వేస్తే మునిగితే తాజావి) వాడాలి.

Related News

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

Big Stories

×