Credit Card Apply: మీరు ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? అయితే మీరు ఆర్థికంగా ఓ స్థాయికి చేరుకున్నట్లే. క్రెడిట్ కార్డును సరిగ్గా వాడుకుంటే.. అది మీ క్రెడిట్ స్కోర్ ను పెంచుతుంది. కానీ క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగించకపోతే, అదే క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. అయితే ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డును తీసుకునే వాళ్లు కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుంటాయి. నిత్యావసరాలు, పుడ్, ట్రావెల్, ఆన్‌లైన్ షాపింగ్ లపై డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ-కామర్స్, ఫుడ్, పెట్రోల్.. ఇలా వేటిపై మీరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారో తెలుసుకుని.. అందుకు తగిన క్రెడిట్ కార్డు తీసుకుంటే ఖర్చుపై కూడా ఆదా చేసుకోవచ్చు.
సాధారణంగా అన్ని క్రెడిట్ కార్డులు రివార్డు పాయింట్లు ఇస్తాయి. ఎక్కువ పాయింట్లు అంటే ఎక్కువ రిడెంప్షన్ కాదు. కొన్ని కార్డులు తక్కువ పాయింట్లే ఇచ్చిన ఎక్కువ రిడెంప్షన్ వ్యాల్యూ ఇస్తాయి. బేస్ ఎక్స్ ఛేంజ్ రేటును అర్థం చేసుకుని రివార్డు పాయింట్లతో ఆదా చేసుకోవచ్చు. బిల్ చెల్లింపులు, ఫుడ్ డెలివరీ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లలో షాపింగ్ లపై రివార్డు పాయింట్లు వస్తుంటాయి. కొన్ని ప్రీమియం కార్డులు ఎయిర్‌లైన్ లేదా హోటళ్ల భాగస్వామ్యంతో డబ్బులకు బదులుగా రివార్డ్ పాయింట్ల ట్రాన్స్ ఫర్ కు అనుమతిస్తాయి. క్రెడిట్ కార్డులపై వార్షిక ఫీజు ఉంటుంది. కానీ మీ క్రెడిట్ లిమిట్ మ్యాగ్జిమమ్ కు చేరుకున్నట్లైయితే ఫీజుపై మినహాయింపు పొందవచ్చు. ఫీజు మినహాయింపు కోసం అదనపు ఖర్చు చేయడం కరెక్ట్ కాదని గమనించాలి.
కొన్ని కార్డులు.. క్రెడిట్ లిమిట్ పూర్తి చేస్తే బోనస్ పాయింట్లు లేదా వోచర్‌లను ఇస్తాయి. రివార్డు పాయింట్లు, వోచర్ల కోసం అనవసరమైన ఖర్చులకు పోకూడదని నిపుణులు అంటున్నారు. ఎయిర్ పోర్టుల్లో లాంజ్ యాక్సెస్, సినిమా టిక్కెట్లు, ఫుడ్ డిస్కౌంట్లు ఇలా అట్రాక్టివ్ గా ఉంటాయి. కానీ రివార్డ్ పాయింట్లు, ఫీజులు మినహాయింపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు.. వారిని పరిష్కరించేందుకు కస్టమర్ కేర్ మద్దతు ఉండాలి. ఇలాంటి సేవలను అందించే బ్యాంకులను ఎంచుకోండి. జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు, హిడెన్ ఛార్జీలు, అలాగే క్రెడిట్ లిమిట్ ఎంత ఉందో ముందే తెలుసుకోవడం మంచిది.
Also Read: క్రెడిట్ కార్డు బిల్లులు రిపోర్ట్ చేయాల్సిందే.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
మొదటిసారి క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. సాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకు ద్వారా అప్లై చేసుకోండి. దీని వల్ల త్వరగా క్రెడిట్ కార్డు అప్లికేషన్ ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. ఒకేసారి ఎక్కువ బ్యాంకుల కార్డులకు అప్లై చేయడం వల్ల, అవి రిజెక్ట్ అయితే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. క్రెడిట్ కార్డులు ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. ఏడాదికి 36-42% వరకు వడ్డీ ఉంటుంది. ప్రతిసారీ పూర్తి బిల్లును ఇన్ టైమ్ లో చెల్లించండి. లేకుంటే భారీగా వడ్డీ వడ్డిస్తాయి బ్యాంకులు.