Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లు అంటే టెక్ ప్రేమికులకు పండగే. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి అద్భుతమైన గాడ్జెట్లు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. ఈసారి కూడా అలాంటి రెండు మోడల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అవి గోబౌల్ట్ జెడ్40, మివి డ్యూపోడ్స్ బి1. ఈ రెండింటి ధరలు చూస్తే ఆశ్చర్యమే కానీ ఫీచర్లు మాత్రం ప్రీమియం లెవల్‌లో ఉన్నాయి.
గోబౌల్ట్ జెడ్40 -కేవలం 799లకే
ముందుగా గోబౌల్ట్ జెడ్40 గురించి మాట్లాడుకుందాం. దీని అసలు ధర దాదాపు 5వేల రూపాయలు కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇది కేవలం 799 రూపాయలకు అందుబాటులో ఉంది. అంటే 84శాతం భారీ డిస్కౌంట్. ఇది బ్లూటూత్ 5.3 వెర్షన్‌తో వస్తుంది, అంటే కనెక్షన్ చాలా స్టేబుల్‌గా ఉంటుంది. సౌండ్ లాగ్ లేకుండా గేమింగ్‌కి ఇది సరిగ్గా సరిపోతుంది. పబ్జీ, బిజిఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి గేమ్స్ ఆడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఒక్కసారి చార్జ్ చేస్తే అరవై గంటల వరకు
ఇందులో ఉన్న ఈఎన్‌సి మైక్ సిస్టమ్ వల్ల మీరు చేసే కాల్స్‌లో వాయిస్ చాలా క్లియర్‌గా ఉంటుంది. చుట్టూ ఎంత శబ్దం ఉన్నా అది ఫిల్టర్ అయిపోతుంది, మీ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఇది దుమ్ము రేపుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే అరవై గంటల వరకూ సౌండ్ ఇస్తుంది. అంటే రోజూ రెండు మూడు గంటలైనా వాడినా ఒకసారి చార్జ్ చేస్తే వారం రోజులకంటే ఎక్కువ పనిచేస్తుంది.
మెటల్ ఫినిష్‌తో డిజైన్
డిజైన్ పరంగా చూస్తే కూడా ఇది చాలా ప్రీమియంగా ఉంటుంది. మెటల్ ఫినిష్‌తో ఇచ్చారు కాబట్టి చూపులోనే క్వాలిటీ కనిపిస్తుంది. గ్రీన్, నేవీ బ్లూ, బ్రౌన్, వైట్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ గేమింగ్ లవర్స్‌కే కాకుండా రోజువారీ మ్యూజిక్, కాల్స్ వాడకానికి కూడా సరిపోతాయి.
రూ.799లకే కాదు ఇంకా తక్కువగా! ఎలా?
ధర విషయానికి వస్తే, ఫ్లిప్‌కార్ట్‌లో దీని ప్రైస్ రూ.799. కానీ భీమ్ యూపిఐతో పేమెంట్ చేస్తే రూ.50 తగ్గింపు వస్తుంది. పేటీఎంతో చేస్తే రూ.10 తగ్గింపు దొరుకుతుంది. అంటే మీరు మొత్తం రూ.749కే గోబౌల్ట్ జెడ్40ని కొనుగోలు చేయవచ్చు. ఇంత తక్కువ ధరలో ఇంత బలమైన ఫీచర్లున్న ఇయర్‌బడ్స్ లభించడం నిజంగా అరుదు.
Also Read: Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్ డోర్ ఫ్రిజ్ .. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది బ్రో..
మివి డ్యూపోడ్స్ బి1 రూ. 999లకే
ఇక రెండో ప్రోడక్ట్ మివి డ్యూపోడ్స్ బి1. ఇది తాజాగా విడుదలైన మోడల్. దీని అసలు ధర రూ.2,999 కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 999కే దొరుకుతోంది. ఈ మోడల్ కూడా బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో వస్తుంది, కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. 45 గంటల ప్లే టైమ్ ఇవ్వగలదు. అంటే రోజుకు గంట రెండు గంటల వాడకం ఉన్నవారికి ఇది మూడు నాలుగు రోజుల వరకూ చార్జ్ లేకుండా సౌండ్ ఇస్తుంది.
ఎక్కడ ఉన్న క్లియర్ వాయిస్
దీనిలో ఉన్న ఏఐ ఈఎన్‌సి టెక్నాలజీ వల్ల మీ వాయిస్ కాల్‌లలో చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. బహిరంగ ప్రదేశంలో ఉన్నా లేదా రోడ్డు మీద నడుస్తున్నా శబ్దం లేకుండా మీ మాట స్పష్టంగా రిసీవర్‌కి చేరుతుంది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ వల్ల కేవలం 10 నిమిషాల చార్జింగ్‌తో గంటల కొద్దీ ప్లే టైమ్ దొరుకుతుంది. డిజైన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
దీని ధర కూడా రూ.949 నుంచి మరింత తక్కువగా
ఇది కూడా అదే విధంగా ఆఫర్‌లో ఉంది. భీమ్ యూపీఐతో చెల్లిస్తే రూ.50 తగ్గింపు, పేటీఎంతో చెల్లిస్తే రూ.10 తగ్గింపు వస్తుంది. అంటే మొత్తం ధర రూ.949కి తగ్గిపోతుంది. ఫీచర్లు చూస్తే ఈ ధరకి ఇది కూడా చాలా సరైన ఆప్షన్.
ఈ రెండింటిలో ఏది మంచిది?
ఇప్పుడు ఈ రెండు మోడల్స్‌లో ఏది మంచిదంటే అది మీ అవసరంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలంటే గోబౌల్ట్ జెడ్40 బెస్ట్. గేమింగ్, లాంగ్ మ్యూజిక్ సెషన్స్ కోసం ఇది సరిగ్గా సరిపోతుంది. కానీ మీరు కాల్స్ ఎక్కువ చేసేవారైతే లేదా క్లియర్ ఆడియో క్వాలిటీ మీద దృష్టి పెడితే మివి డ్యూపోడ్స్ బి1 కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
ఇయర్‌బడ్స్ కొనాలని అనుకుంటే ఇదే సమయం
ఇవి రెండూ ఫ్లిప్‌కార్ట్‌లో లోయెస్ట్ ప్రైస్ ఇయర్ ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ ధరలు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీరు ఇయర్‌బడ్స్ కొనాలని అనుకుంటే ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ యాప్ ఓపెన్ చేసి, మీకు నచ్చిన మోడల్, కలర్ సెలెక్ట్ చేసుకుని, భీమ్ యూపిఐతో చెల్లించి ఆఫర్ ధరలోనే కొనుగోలు చేసేయండి.