Gold Rates Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంగళవారం ఉదయాన్నే మార్కెట్ నుండి అత్యంత తీపి కబురు అందింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ ఊరిస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు, అమెరికా డాలర్ విలువ పుంజుకోవడం, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు కాస్త శాంతించడంతో దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు గణనీయంగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు (ప్రాఫిట్ బుకింగ్) మొగ్గు చూపడం కూడా ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమైంది.
నేడు పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,930 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,130 వద్ద పలుకుతుంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,100 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,450 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1800 తగ్గింది.
శుభకార్యాల వేళ భారీగా పతనమైన పసిడి..
పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ, అలాగే శుభకార్యాల కోసం లేదా దీర్ఘకాలిక పెట్టుబడి రూపంలో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న మధ్యతరగతి ప్రజలకు ఈ ధరల తగ్గుదల ఒక అద్భుతమైన అవకాశంగా నిలిచింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నేడు బులియన్ మార్కెట్ ప్రారంభం కాగానే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. మళ్లీ ఎప్పుడు ధరలు పెరుగుతాయో తెలియని ఈ అస్థిరమైన మార్కెట్ వాతావరణంలో, ప్రస్తుత పతనం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చే విషయమేనని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,130 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,450 వద్ద కొనసాగుతుంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,130 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,450 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,130 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,450 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,280 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,28,600 వద్ద ఉంది.
నేటి సిల్వర్ ధరలు..
బంగారం ధరలే కాకుండా సిల్వర్ ధరలు కూడా కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు నిశ్చలంగా వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నేటి ధరలు చూసుకుంటే.. నిన్న సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,45,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,44,900 వద్ద కొనసాగుతుంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.100 తగ్గింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో ఒకేసారి కేజీపై రూ. 5,000 తగ్గి ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ. 2,35,000 వద్ద పలుకుతోంది.
Also Read: వాట్సాప్‌లో ఇక ఫోన్ నెంబర్ ఉండదు.. యూజర్‌నేమ్‌ను వెంటనే ఇలా రిజర్వ్ చేసుకోండి!