E-Paper
Advertisement

గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
Advertisement

Today Gold Rates: హమ్మయ్య.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. రెండు రోజులుగా వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు, సామాన్య ప్రజలకు, ముఖ్యంగా రాబోయే శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప ఊరటను కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, డాలర్ విలువలో వస్తున్న మార్పులు, గ్లోబల్ ఇన్వెస్టర్ల ధోరణి వంటి పలు కీలక కారణాల వల్ల పసిడి రేట్లు ఈ స్థాయిలో దిగివస్తున్నాయి. ఈ తగ్గుదల కేవలం తాత్కాలికమేనా లేక మరికొంత కాలం ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అనే అంశంపై మార్కెట్ విశ్లేషకులు భిన్నమైన అంచనాలు వేస్తున్నప్పటికీ, ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగానే కనిపిస్తోంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,550 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 వద్ద పలుకుతుంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,750 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,200 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.600 తగ్గింది.

Advertisement

బంగారం కొనాలనుకుంటున్నారా?
అయితే, ధరలు తగ్గుతున్నాయన్న ఉత్సాహంలో ఒకేసారి భారీగా కొనుగోలు చేయడం కంటే, మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ దశలవారీగా నిర్ణయాలు తీసుకోవడం ఎల్లప్పుడూ లాభదాయకం. ముఖ్యంగా పెట్టుబడి కోసం బంగారాన్ని చూసేవారు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఆభరణాల కోసం చూస్తున్నట్లయితే, మీ ప్రాంతంలోని ప్రస్తుత మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సరి చూసుకుని, సరైన సమయంలో కొనుగోలు చేయడం ద్వారా మీ బడ్జెట్‌ను సమర్థవంతంగా ఆదా చేసుకోవచ్చు. మార్కెట్ ఒడిదుడుకులను అర్థం చేసుకుని, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ బంగారు కలలను సులభంగా నెరవేర్చుకోవచ్చు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,52,950 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,200 వద్ద కొనసాగుతుంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,200 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,200 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,100 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,350 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
వావ్.. నేడు మళ్లీ సిల్వర్ ధరలు తగ్గాయి. నేడు ధరలు చూసుకుంటే.. నిన్న గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,70,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 5,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో కూడా నేడు కేజీ సిల్వర్ ధర రూ. 2,59,900 వద్ద పలుకుతోంది.

Also Read: అవాక్కయ్యే దృశ్యం.. సైకిల్ తొక్కుతున్న ఘోస్ట్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×