Gold Silver Rates: ఆషాఢ మాసం వచ్చెనే.. వేడుకలు మొదలాయెనే అనుకునే లోపే, బంగారం ప్రియులకు పసిడి ధరలు పెద్ద షాకే ఇస్తున్నాయి.. ఈ పండగ సీజన్‌లో కాస్త రంగుల నగలు కొనుక్కుందాం, లేదంటే ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి కదా, డిపాజిట్ చేద్దాం అని ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. తగ్గడం ఏమో గానీ, వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఈ రేట్లతో మేం బంగారం జోలికి వెళ్లగలమా? అని బంగారం ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,220 వద్ద పలుకుతుంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,500 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,200 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.760 పెరిగింది.
పసిడి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి!
అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఆర్థిక పరిణామాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణ భయాలే పసిడిని మళ్ళీ గగనానికెత్తిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆషాడం సేల్స్‌లో సరికొత్త ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ పరుగు పెద్ద విఘ్నంగా మారింది. ధర కాస్త తగ్గగానే సంతోషించడం, మరుసటి రోజే ఆ సంతోషం ఆవిరైపోయేలా ధరలు మళ్లీ పెరగడం ప్రస్తుతం ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. రాబోయే పండగల సీజన్‌లో కూడా పసిడి మెరుపులు బడ్జెట్‌ను మించిపోయేలా కనిపిస్తుండటంతో, ఇప్పుడు కొనాలా లేక మరికొన్ని రోజులు వేచి చూడాలా అనే సందిగ్ధంలో కొనుగోలుదారులు కొట్టుమిట్టాడుతున్నారు.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,220 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,200 వద్ద కొనసాగుతుంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,220 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,200 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,220 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,200 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,32,350 వద్ద ఉంది.
సిల్వర్ ధరలు ఇలా..
వామ్మో.. బంగారం ధరలే అనుకుంటే.. వాటి కన్నా ఎక్కువగా పెరుగుతున్నాయి సిల్వర్ ధరలు.. నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న వెండి ధరలు ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. నేటి ధరలు చూసుకుంటే.. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ.2,35,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద కొనసాగుతుంది. అంటే కేజీపై రూ.5,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,35,000 వద్ద కొనసాగుతోంది.
Also Read: మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య