E-Paper
Advertisement

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్
Advertisement

Best robotic vacuum cleaners India: ప్రతి రోజూ ఇల్లు ఊడ్చడం, తుడవడం అనేది చాలా టైమ్ తీసుకునే పని, అలాగే విపరీతమైన అలసట తెప్పించే వ్యవహారం. ఆఫీస్ వర్క్, ఇంటి పనుల బిజీ లైఫ్‌లో ఈ క్లీనింగ్ శ్రమను తగ్గించడానికి స్మార్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లు సూపర్ ఆప్షన్‌గా మారాయి. స్మార్ట్‌ ఫోన్ యాప్ లేదా వాయిస్ కమాండ్‌తో ఒకే ఒక్క క్లిక్‌తో మూల మూలలా దుమ్ము, ధూళిని క్షణాల్లో శుభ్రం చేసే అమెజాన్ టాప్ 5 స్మార్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లు, వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.Xiaomi Robot Vacuum-Mop 2 Pro:

ఇండియన్ హోమ్స్‌కి బాగా సూట్ అయ్యేలా రూపొందించిన మోడల్స్ లో షియోమి రోబోటిక్ క్లీనర్ ఒకటి.

Advertisement

ఫీచర్లు: LDS లేజర్ నావిగేషన్, 3000Pa పవర్‌ఫుల్ సక్షన్, మైక్రోఫైబర్ మాప్ విత్ హై-ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్.

హైలైట్: ఇల్లు తుడిచేటప్పుడు బట్టను గట్టిగా ఒత్తి తుడుస్తుంది, దీని వల్ల నేలపై ఉన్న గట్టి మరకలు కూడా తేలికగా వదిలిపోతాయి.

Advertisement

ధర: రూ. 25,999 – రూ. 27,999

2. ECOVACS Deebot N8 2-in-1 Robot Vacuum Cleaner:

అమెజాన్‌లో అత్యంత పాపులర్ అయిన ఆల్-ఇన్-వన్ క్లీనింగ్ రోబో ఇది.

ఫీచర్లు: TrueMapping టెక్నాలజీ, 2300Pa సక్షన్ పవర్, ఆటో-డోకింగ్, రీఛార్జ్ ఫీచర్, అలెక్సా & గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్.

హైలైట్: ఇది ఇంట్లోని కార్పెట్లను గుర్తించి సక్షన్ పవర్‌ను ఆటోమేటిక్‌గా పెంచుతుంది.  అంతే కాకుండా దీనిలొ మ్యాపింగ్ నావిగేషన్ చాలా ఒక్యురేట్‌గా ఉంటుంది.

ధర: రూ.21,999 – రూ.23,999

3. Eureka Forbes Robo Vac N Mop:

తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన బ్రాండ్ క్వాలిటీ కోరుకునే వారికి యూరేకా ఫోర్బ్స్ బెస్ట్ ఛాయిస్.

ఫీచర్లు: డ్యూయల్ క్లీనింగ్ (వ్యాక్యూమ్ + మాపింగ్), మల్టీ-మోడ్ క్లీనింగ్, యాంటీ-ఫాల్ అండ్ యాంటీ-కొలిజన్ సెన్సార్లు.

హైలైట్: ఇది సోఫాలు, మంచాల కింద ఉండే తక్కువ గ్యాప్‌లోకి కూడా సులువుగా వెళ్లి దుమ్మును లాగేస్తుంది.

ధర: రూ.14,999 – రూ.16,999

4.ILIFE V3s Pro Robot Vacuum Cleaner:

పెట్స్ (పెంపుడు జంతువులు) ఉన్న ఇళ్లకు, కేవలం డ్రై స్వీపింగ్ ఎక్కువ అవసరం ఉన్నవారికి ఇది పర్‌ఫెక్ట్.

ఫీచర్లు: పెట్ హెయిర్ కేర్ టెక్నాలజీ, లో-ప్రొఫైల్ డిజైన్, సెల్ఫ్-చార్జింగ్, స్మార్ట్ రిమోట్ కంట్రోల్.

హైలైట్: జుట్టు లేదా పెంపుడు జంతువుల వెంట్రుకలు బ్రష్‌లో చిక్కుకోకుండా నేరుగా సక్షన్ బాక్స్‌లోకి వెళ్లిపోతాయి.

ధర: రూ.12,990 – రూ.14,500

Also Read: అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

5. Dreame D9 Max Robot Vacuum and Mop:

హై-ఎండ్ పెర్ఫార్మెన్స్, భారీ సక్షన్ పవర్ కోరుకునే వారికి డ్రీమీ D9 మ్యాక్స్ సూపర్ ఆప్షన్.

ఫీచర్లు: 4000Pa సూపర్‌ఫాస్ట్ సక్షన్, LiDAR నావిగేషన్, 5200mAh పెద్ద బ్యాటరీ, యాప్ కంట్రోల్.

హైలైట్: ఒకేసారి పెద్ద ఇళ్లను కూడా బ్రేక్ లేకుండా క్లీన్ చేయగలదు. అంతే కాకుండా  ఇది కార్పెట్లపై ఉన్న సన్నని ధూళిని కూడా వదలకుండా పీల్చేస్తుంది.

సుమారు ధర: రూ.24,999 – రూ.26,999

స్మార్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఇంట్లోకి తెచ్చుకోవడం అంటే మీ సమయాన్ని, శ్రమను ఆదా చేసుకోవడమే. మీ ఇంటి విస్తీర్ణం, బడ్జెట్ , అవసరాలకు అనుగుణంగా అమెజాన్‌లో లభించే ఈ 5 మోడళ్లలో ఒకదాన్ని ఎంచుకుని, మీ ఇంటిని ఎల్లప్పుడూ మెరిసిపోయేలా ఉంచుకోండి.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×