E-Paper
Advertisement

Gold-Silver Prices Climb: బంగారం-వెండి ధరలకు రెక్కలు, కొనుగోలు ఇదే సరైన సమయం

Gold-Silver Prices Climb: బంగారం-వెండి ధరలకు రెక్కలు, కొనుగోలు ఇదే సరైన సమయం
Advertisement

Gold-Silver Prices Climb: బులియన్ మార్కెట్‌లో బంగారం-వెండి ధరల పరిస్థితి ఏంటి? బుధవారం మార్కెట్‌లో వాటి ధరలు ఎలా ఉండనున్నాయి? రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు అమాంతంగా పెరిగాయా? ఇవాళ దేశీయ మార్కెట్ పరిస్థితి ఏంటి? రాత్రి ధరలు కంటిన్యూ అవుతున్నాయా? బంగారం-వెండి కొనుగోలు ఇదే సరైన సమయమా? అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలకు రెక్కలు

Advertisement

ఇరాన్ యుద్ధం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధం రెండు లేదా మూడు వారాల్లో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలో గతరాత్రి బంగారం, వెండి ధరలు వరుసగా మూడో సెషన్‌లో పెరిగాయి. ఈ నేపథ్యంలో దాని ప్రభావం బంగారం-వెండి మార్కెట్లపై పడింది. దీంతో ఆ రెండు లోహాల ధరలు పెరిగాయి.

ఔన్సుకు బంగారం ధర 4,700 డాలర్లకు చేరగా, వెండి ధర 75 డాలర్లకు చేరింది. ఇదే జోరు బుధవారం కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు ప్రారంభం కాగానే ఆదిలో బంగారం ధరలు పెరిగాయి. ఏప్రిల్ ఒకటి ఉదయం 8 గంటలకు 22 క్యారెట్ల ధర రూ. 1150 మేరా పెరిగింది. 10 గ్రాముల ధర రూ. 1,37,050 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

Advertisement

బుధవారం ఆసియా మార్కెట్లో బంగారం జోరు.. వెండి ధర పతనం

అటు అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధర ఒక శాతం క్షీణించింది. ఇటీవలి రోజుల్లో బులియన్ ధరలు కోలుకున్నప్పటికీ, మార్చిలో దాదాపు 12 శాతం పతనాన్ని నమోదు చేసింది. అక్టోబర్ 2008 తర్వాత అత్యంత స్థాయిలో బంగారం ధరలు క్షీణించిన విషయం తెల్సిందే. ధరలు నిలకడగా కదిలితే ఔౌన్స్ ధర 4,800 డాలర్లకు వెళ్లే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ ట్రేడింగ్ అనుకోని పరిస్థితి కారణంగా తగ్గితే 4,400 డాలర్ల వద్ద నిలకడగా ఉండవచ్చని చెబుతున్నాయి. ధరలు నిలకడగా కదిలితే ఔౌన్స్ ధర 4,800 డాలర్లకు వెళ్లే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బులియన్స్ వెబ్‌సైట్ మేరకు.. బుధవారం దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,900 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ. 2,42,170గా ఉంది.

ALSO READ: అప్పుల ఊబి నుంచి బయటపడే సింపుల్ చిట్కాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం దాదాపు రూ. 1,50,630కు వద్ద ఉంది. కోల్‌కతాలో అదే విధంగా ఉంది. బంగారం ధర రూ. 1,50,430 గా నమోదైంది. ఈ రెండు నగరాల కంటే రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,50,370గా ఉంది.

దక్షిణాది మార్కెట్లలో ధరలను ఒక్కసారి చూద్దాం. చెన్నై 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,070 లతో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ లో రూ. 1,50,870, బెంగళూరులో రూ. 1,50,750 ల వద్ద ఉంది. ఇవాళ మార్కెట్లో ధరలు పెరగవచ్చు, లేకుంటే తగ్గవచ్చు.  బులియన్ మార్కెట్ వర్గాలు మాత్రం.. వినియోగదారులు బంగారం కొనుగోలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని అంటున్నాయి.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×