E-Paper
Advertisement

DSP Harish: హరీష్ శంకర్ పుట్టిన రోజున ఎట్టకేలకు స్పందించిన దేవీశ్రీ ప్రసాద్.. అవి తొలగినట్లేనా?

DSP Harish: హరీష్ శంకర్ పుట్టిన రోజున ఎట్టకేలకు స్పందించిన దేవీశ్రీ ప్రసాద్.. అవి తొలగినట్లేనా?
Advertisement

DSP Harish: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన విష్. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, దేవిశ్రీ ప్రసాద్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో హరీష్ శంకర్‌ను అన్‌ఫాలో చేశారని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, DSP స్పందన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read also-పొదరిల్లు.. ఏప్రిల్1: చక్రీకి షాకిచ్చిన మహా.. నారాయణకు నిద్ర లేకుండా చేసిన మహా.. కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..

“సూపర్ హ్యాపీ మ్యూజికల్ బర్త్ డే”

Advertisement

హరీష్ శంకర్ పుట్టినరోజున దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ.. “Wishing U a Super Happy Musical Birthday Sirrrrr Jiiiiiii” అంటూ ఎనర్జిటిక్ గా విషెస్ చెప్పారు. దీనికి హరీష్ శంకర్ కూడా అంతే గౌరవంగా “థ్యాక్యూ” అంటూ రిప్లై ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అన్‌ఫాలో వార్తలు వచ్చిన తర్వాత కూడా దేవిశ్రీ ఇలా విష్ చేయడం చూస్తుంటే, వారి మధ్య ప్రొఫెషనల్ గా చిన్నపాటి మనస్పర్థలు ఉన్నా, వ్యక్తిగత గౌరవం మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది.

అసలు అన్‌ఫాలో వివాదం ఏంటి?

హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంలో దేవిశ్రీ సోషల్ మీడియాలో హరీష్‌ను అన్‌ఫాలో చేయడం అభిమానుల్లో అనుమానాలకు తావిచ్చింది. సినిమా విషయంలో గానీ, మ్యూజిక్ సిట్టింగ్స్ విషయంలో గానీ వీరిద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చిందని గుసగుసలు వినిపించాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు థమన్ బీజీఎం అందించడంతో ఈ వివాదం పెరిగిందని తెలుస్తోంది.

Advertisement

Read also-ఊహించని మలుపులతో ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ… ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?

సాధారణంగా చిత్ర పరిశ్రమలో అన్‌ఫాలో చేయడం అంటే అది గొడవకు సంకేతంగా భావిస్తారు. అలాంటి సమయంలో దేవిశ్రీ ప్రసాద్ హరీష్ కు శుభాకాంక్షలు చెప్పడం వెనుక ఉన్న మర్మమేంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వకమైన విష్ మాత్రమేనా? లేక వీరి మధ్య మళ్ళీ సయోధ్య కుదిరిందా? అనేది తెలియాల్సి ఉంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ అప్‌డేట్స్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు, ఈ చిన్నపాటి ట్విట్టర్ సంభాషణ కొంత ఊరటనిచ్చింది. మొత్తానికి, హరీష్ శంకర్ బర్త్ డే సాక్షిగా దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో స్పందించి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ‘ఉస్తాద్’ తో ఎలాంటి మ్యూజికల్ మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×