E-Paper
Advertisement

Gold Rate Dropped: ఆకాశం నుంచి దిగివచ్చిన పసిడి.. నేడు తులం బంగారంపై భారీ కోత! లేటెస్ట్ రేట్లు ఇవే..

Gold Rate Dropped: ఆకాశం నుంచి దిగివచ్చిన పసిడి.. నేడు తులం బంగారంపై భారీ కోత! లేటెస్ట్ రేట్లు ఇవే..
Advertisement

Gold Rate Dropped: వావ్.. గ‌త మూడు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. నేడు మ‌ళ్లీ కాస్తా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. అయితే ప్ర‌స్తుతం ధ‌ర‌లు పెరిగి మ‌ళ్లీ ద‌గ్గ‌డానికి కార‌ణం.. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ బలోపేతం కావడం, ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడం వల్లే ధరలు ఇలా నేలచూపులు చూస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేటి ప‌సిడి ధ‌రలు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. బుధ‌వారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,600 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,400 వద్ద ఉంది. అలాగే బుధ‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,300 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,200 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,200 త‌గ్గింది.

Advertisement

శుభాకార్య‌ల వేళ త‌గ్గుతున బంగారం ధ‌ర‌లు..
ప్ర‌స్తుతం బంగారం ధ‌ర‌లు త‌గ్గడం వ‌ల్ల శుభాకార్య‌లు ఉన్న‌వారు చాలా సంతోషంగా ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్ గట్టిగ నడుస్తుండటంతో, ఇన్ని రోజులు ధరలు చూసి భయపడ్డోళ్లంతా ఇప్పుడిప్పుడే షాపుల దిక్కు చూస్తున్నారు. అయితే, ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెల్వదు కాబట్టి, నగలు చేయించుకోవాలనుకునేటోళ్లు ఈ తగ్గుదలను మంచి టైమ్‌గా వాడుకుంటే పైసలు ఆదా అవుతాయి. ఈ ధరలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, అలాగే జీఎస్టీ, మేకింగ్ ఛార్జీల వల్ల కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, ఒకసారి మీ దగ్గర్లోని జ్యువెలరీ షాపులో కనుక్కోవడం మంచింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,58,400 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,200 వద్ద ఉంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,400 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,200 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,400 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,200 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,550 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,45,350 వద్ద ఉంది.

Also Read: కొత్త ఏసీ కొనే ముందు తెలుసుకోవాల్సిన 7 విషయాలివే

నేటి సిల్వర్ ధరలు ఇలా..
నేడు బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గిర సిల్వ‌ర్ ధ‌ర‌లు మాత్రం నిశ్చ‌లంగా ఉన్నాయి. నేటి సిల్వ‌ర్ ధ‌ర‌లు చూసుకుంటే.. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 వద్ద కొనసాగుతోంది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో ప్రస్తుత ధర రూ. 2,95,000 వద్ద పలుకుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×