E-Paper
Advertisement

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?
Advertisement

Gold Rate: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకు కాస్త ఇబ్బంది కలిగించేదే. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న పసిడి ధరలు, మళ్లీ రెండు రోజులుగా వరుసగా పెరుగుతూ కొనుగోలుదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ఆర్థిక సమీకరణాలు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, పెరిగిన భౌగోళిక ఉద్రిక్తతల కారణంగానే దేశీయంగా పసిడి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో, ఈ ఆకస్మిక ధరల పెరుగుదల మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌లపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,290 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460 వద్ద పలుకుతుంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,500 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.170 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,460 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,500 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,500 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,500 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,610 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,31,650 వద్ద ఉంది.

సిల్వర్ ధరలు ఇలా..
హమ్మయ్య.. నేడు బంగారం ధరలు పెరిగినా.. సిల్వర్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. నేటి ధరలు చూసుకుంటే.. శనివారం కేజీ సిల్వర్ ధర రూ.2,35,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ రూ. 2,34,900 వద్ద కొనసాగుతుంది. అంటే కేజీపై రూ.100 తగ్గింది. అలాగే కలకత్త, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ పై రూ.5,000 పెరిగి ప్రస్తుత ధర రూ. 2,35,000 వద్ద కొనసాగుతోంది.

Also Read: కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×