Guru Teg Bahadur Hospital: కొన్ని సంఘటనలు వ్యవస్థలోని లోపాలను చూపిస్తాయి. ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన ఓ పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్లు ట్రీట్ మెంట్ వల్ల కాదండోయ్. సీలింగ్ ఫ్యాన్ పడి సదరు వ్యక్తి ఈలోకాన్ని విడిచిపెడ్డాడు. సంచలనం రేపిన ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 42 ఏళ్ల మొహమ్మద్ అక్బర్ అనే పేషెంట్ తీవ్ర అనారోగ్యంతో సదరు ఆసుపత్రికి వచ్చాడు. అత్యవసర వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే జూలై 18 రాత్రి రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో పైకప్పుకు అమర్చిన సీలింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా ఊడి సదరు ఫేసెంట్‌పై పడింది.
పేషెంట్‌పై పడిన ఫ్యాన్-ఫ్యాన్ పేషెంట్ శరీరాన్ని బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఘటన జరిగిన దాదాపు మూడు గంటల తర్వాత అక్బర్ ఈ లోకాన్ని విచిడిపెట్టాడు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే అక్బర్ మరణం జరిగిందని ఆరోపించారు బాధిత బంధువులు. ఈ ఘటనపై తప్పకుండా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.
అక్బర్ మరణంపై ఆసుపత్రి ఏం చెబుతోంది? ఆసుపత్రిలో చేరినప్పుడు రోగి తీవ్రమైన రక్తపోటు సమస్యలతో చేరాడని చెబుతోంది. పేషెంట్ మరణానికి కారణం ఫ్యాన్ పడటం కాదన్నది వారి వెర్షన్. అతడి వైద్య పరిస్థితులు అందుకు కారణమని అంటోంది. ప్రాథమిక పరిశీలనలో ఫ్యాన్ షాఫ్ట్ విరిగిపోవడం వల్ల ఫ్యాన్ కిందపడినట్లు తేలింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపింది.
ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఫ్యాన్ నేరుగా రోగి మంచంపై పడిందని చెబుతున్నారు. వార్డులోని చాలా ఎయిర్ కండిషనర్లు పని చేయడం లేదని అంటున్నారు. అందువల్ల సీలింగ్ ఫ్యాన్లపై ఆధారపడుతున్నామని వెల్లడించారు. ఆసుపత్రి నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గట్టిగా విమర్శలు చేశారు.
ALSO READ: కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ప్రస్తుతం పరిస్థితి- ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. మరణానికి అసలు కారణం ఫ్యాన్ పడటమా? రోగి ముందున్న ఆరోగ్య సమస్యలా? అనే అంశంపై అధికారిక దర్యాప్తు తర్వాత స్పష్టత రానుంది. ఈ ఘటన ఢిల్లీలో ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు, నిర్వహణ, రోగుల భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబసభ్యులు.