E-Paper
Advertisement

Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే?

Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే?
Advertisement

Gold Prices Decreased Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని బంగారం ధరలు తగ్గాయి. అయితే బంగారం ధరల్లో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు ఉండడం సాధారణం. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడం.. మళ్లీ పెరగడం కనిపిస్తూనే ఉంటుంది. ఆదివారం ధరలతో పోల్చితే సోమవారం తులంపై రూ.100వరకు తగ్గింది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారాన్ని మహిళలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధర కొంత తగ్గినా కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున గత కొన్నిరోజులుగా బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే బంగారం ధరలు మాత్రం తగ్గుతూ పెరుగుతూ కొనుగోలు దారులను టెన్షన్ పెట్టిస్తోంది.

Advertisement

దేశంలో ఆగస్టు 26న బంగారం ధరలు చూస్తే.. 10 గ్రాముల బంగారం ధర రూ.73,000కు దగ్గరగా ఉన్నాయి. అత్యధిక స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గడంతో రూ.73,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,090గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కేజీ వెండి ధర రూ.87,900 పలుకుతుంది. అయితే దేశంలోని ప్రధాన నగరాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,090 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,180 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,940 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,030 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Also Read: సరికొత్త కలర్ వేరియంట్‌లో ‘2024 హీరో గ్లామర్ 125’ లాంచ్.. ధర ఎంతంటే..?

చెన్నై, కోల్‌కతా, భువనేశ్వర్, బెంగళూరులలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,940 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,030 ఉంది. అహ్మదాబాద్, పాట్నాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,990 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,080 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రా విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,940 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,030 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతోపాటు విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×