E-Paper
Advertisement

Home Insurance: హోం ఇన్సూరెన్స్ తో ఇంటికి ధీమా.. మీ పెట్టుబడికి ప్రొటెక్షన్

Home Insurance: హోం ఇన్సూరెన్స్ తో ఇంటికి ధీమా.. మీ పెట్టుబడికి ప్రొటెక్షన్
Advertisement

Home Insurance: జీవితంలో ఇల్లు ఒక్కసారే కట్టుకోగలం.. మరి అలాంటి పెట్టుబడికి ధీమా ఉండాలి కదా! అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు దానికి అనుబంధంగా టర్మ్‌ పాలసీని తీసుకుంటారు. లోన్ తీసుకున్న వారికి ఏదైనా జరిగితే కుటుంబంపై భారం పడకుండా టర్మ్ పాలసీతో ఆ మొత్తం చెల్లించవచ్చు. కానీ ఇంటి నిర్మాణానికి, ఇంట్లోని వస్తువులకి ఏదైనా నష్టం జరిగితే.. టర్మ్ పాలసీతో కవర్ కాదు. అందుకే ఇలాంటి నష్టాలకు ప్రత్యేకంగా హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదని ఎక్స్ ఫర్ట్స్ సూచిస్తున్నారు.

హోం ఇన్సూరెన్స్ రకాలు

ఇల్లు, అందులోని వస్తువులకు ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని గృహ బీమా భర్తీ చేస్తుంది. హోమ్ ఇన్సూరెన్స్ లో రెండు రకాలున్నాయి.
కంటెంట్‌ ఇన్సూరెన్స్‌: ఇంట్లోని గృహోపకరణాలు, ఫర్నిచర్, ఆభరణాలు వంటి వాటికి ఇది ప్రొటెక్షన్ కల్పిస్తుంది.
స్ట్రక్చర్‌ ఇన్సూరెన్స్‌: ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంటికి తీవ్ర నష్టం జరిగితే పరిహారం పొందవచ్చు.

తప్పనిసరేం కాదు

Advertisement

హోం లోన్ తీసుకునేటప్పుడు ఈ పాలసీలను తీసుకోవడం తప్పనిసరేం కాదు. కానీ కొన్ని బ్యాంకులు ఈ పాలసీలు తీసుకోవాలని మెలిక పెడుతుంటాయి. ఇల్లు కట్టుకున్న ప్రాంతాన్ని బట్టి ఈ పాలసీలు తీసుకోవాలి. వరదలు, భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఇల్లు ఉంటే.. స్ట్రక్చరల్‌ హోం ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు లేనప్పుడు కంటెంట్‌ ఇన్సూరెన్స్‌ బెస్ట్ ఆప్షన్. ఏ రకం పాలసీ తీసుకున్నా.. ముందుగా క్లెయిమ్ రేషియో, ప్రీమియం, మినహాయింపులు, వివిధ ప్రయోజనాలు చెక్ చేసుకోవాలి.

ఇంటి వ్యాల్యూ లెక్కగట్టాకే

ఎంత అమౌంట్ కు పాలసీ తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు.. ఇంటి వ్యాల్యూ లెక్కగట్టాలి. కంటెంట్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని అనుకుంటుంటే.. ఇంట్లోని ఫర్నీచర్, విలువైన వస్తువుల లిస్ట్ రూపొందించి, వాటి విలువను లెక్కగట్టాలి. ఆ వస్తువు దెబ్బతిన్నా లేదా పోయినా దాని వల్ల మీకు కలిగే ఆర్థిక నష్టాన్ని అంచనా వేయాలి. తరుగు తర్వాత వస్తువు వ్యాల్యూ లేదా వస్తువును కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం.. ఈ రెండింటిలో ఏది కావాలన్నదీ డిసైడ్ చేసుకోవాలి. ఇంటి వ్యాల్యూ ప్రతి ఏడాది మారుతూ ఉంటుంది. కొత్త వస్తువులు కొంటుంటాం, పాత వస్తువుల విలువ తగ్గుతుంటుంది. కాబట్టి, ఏటా ఈ పాలసీని రివ్యూ చేసుకుని, హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

Advertisement

Also Read:  పంట నష్టం జరిగితే ఏం చేయాలి?.. 72 గంటల రూల్ తెలుసా?

తప్పుడు సమాచారం వద్దు

హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ సంస్థకు ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలి. బిల్స్ ఆధారంగా వస్తువుల గురించి పూర్తి సమాచారం అందించాలి. మీ అవసరాలను బట్టి, గృహబీమాకు పలు అనుబంధ పాలసీలనూ తీసుకోవచ్చు.

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×