E-Paper
Advertisement

ఎక్కువ శాలరీ కోసం నెగోషియేషన్ ఎలా?.. బెస్ట్ టిప్స్ ఇవే!

ఎక్కువ శాలరీ కోసం నెగోషియేషన్ ఎలా?..  బెస్ట్ టిప్స్ ఇవే!
Advertisement

Salary Negotiation: ఎన్నో ఇంటర్వ్యూలు.. దాటి ఎట్టకేలకు ఉద్యోగం సాధిస్తాం. ఉద్యోగం వచ్చిన ఆనందం తేలిపోతుంటాం. కానీ శాలరీ చూశాక కాస్త నిరాశ చెందుతాం. మనం ఆశించిన శాలరీ రాకపోతే.. ఇచ్చిన దాన్ని తీసుకోవాలా? ఇంకా ఎక్కువ అడగాలా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. జీతం గురించి డిస్కస్ చేయడానికి ఉద్యోగులు కాస్త సందేహిస్తుంటారు. దొరక్క దొరక్క దొరికిన ఉద్యోగం.. జీతం కోసం పట్టుపడితే.. ఉద్యోగం ఉంటుందో లేదో అనే భయంతో.. శాలరీ నెగోషియేషన్ లేకుండానే ఇచ్చిన దానితో సర్దుకుంటాయి. మీరు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడుంటారు, కాబట్టి మీకు రావలసిన మంచి జీతాన్ని వదులుకుని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం కూడా కరెక్ట్ కాదని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. శాలరీ నెగోషియేషన్ లో ఎలాంటి ఒత్తిడి అవసరంలేదని అంటున్నారు. జీతం గురించి చర్చించేటప్పుడు చాలా క్లియర్ ఉండాలి.

1. మార్కెట్ లో ప్రజెంట్ శాలరీస్

Advertisement

శాలరీ నెగోషియేషన్ లో ఫస్ట్ స్టెప్.. మీ జాబ్ కు మార్కెట్ లో ఉన్న శాలరీ స్లాబ్స్ గురించి తెలుసుకోవడం. మీ పొజిషన్ కు మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా.. శాలరీ నెగోషియేషన్ చేయండి. జాబ్ క్వాలిఫికేషన్, ఎక్స్ పీరియన్స్, మార్కెట్ డిమాండ్‌ ను బట్టి.. ఎంత జీతం అడగవచ్చో క్లారిటీ వస్తుంది. గ్లాస్‌డోర్ , ఇండీడ్, పేస్కేల్ వంటి వెబ్‌సైట్‌లలో కంపెనీల్లో శాలరీస్, వర్క్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. మీ సర్కిల్ లో తెలిసిన వాళ్లను ఎంక్వైరీ చేయడం వల్ల కూడా ఎంత జీతం నెగోషియేట్ చేయవచ్చో ఒక ఐడియా వస్తుంది.

2. అదనపు ప్రయోజనాలు

Advertisement

శాలరీ నెగోషియేషన్ లో చూడాల్సిన మరో విషయం.. ఎడిషనల్ బెనిఫిట్స్. కొన్ని కంపెనీలలో శాలరీస్ తక్కువగా ఉన్నా.. ఎడిషనల్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సెలవులు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్.. హై శాలరీకి ప్రత్యామ్నాయాలుగా చెప్పుకోవచ్చు. శాలరీ నెగోషియేషన్ లో ఎడిషనల్ బెనిఫిట్స్ గురించి అడిగి తెలుసుకోవచ్చు. పెయిడ్ హాలిడేస్, ఇన్సూరెన్స్, కంపెనీ షేర్స్ లో వాటా, రిమోట్ వర్కింగ్, ఇయర్లీ బోనస్ ఇలా ఎడిషనల్ బెనిఫిట్స్ గురించి అడిగి తెలుసుకోవాలి.

3. జీతంపై ప్రతిపాదన

మార్కెట్ వ్యాల్యూ, ఎడిషనల్ బెనిఫిట్స్ పై ఒక ఐడియా వచ్చాక.. మీ శాలరీని డిసైడ్ అయి.. ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకోండి. కంపెనీ ప్రతినిధులను కన్విన్స్ చేసేలా.. మీ గోల్స్, సాధించిన విజయాలు, స్కిల్స్, అర్హతలను హైలైట్ చేస్తూ ఒక షీట్ రెడీ చేసుకోండి. ఇంటి రెంట్, పిల్లల చదువుల ఖర్చులు.. ఇలా వ్యక్తిగత అంశాలపై కాకుండా మీ స్కిల్స్, మార్కెట్ లో మీ పొజిషన్ కు ఉన్న డిమాండ్ ఆధారంగా శాలరీని నెగోషియేట్ చేయండి.

4. శాలరీ నెగోషియేషన్ కు సరైన టైం

శాలరీ నెగోషియేషన్ లో మరో కీలక విషయం.. సరైన టైంలో సంప్రదించడం. కొత్త జాబ్ అయితే ఆఫర్ లెటర్, ప్యాకేజీ వివరాలు వచ్చిన తర్వాత మాత్రమే శాలరీ గురించి డిస్కస్ చేసేందుకు కంపెనీ ప్రతినిధులను సంప్రందించండి. సాధారణంగా కంపెనీలు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత శాలరీ గురించి నెగోషియేట్ చేసేందుకు కాస్త సమయం ఇస్తాయి. ఈ గడువు తేదీకి ముందుగానే శాలరీ గురించి ఒక అంచనాకు వచ్చి కంపెనీ ప్రతినిధులను సంప్రదించాలి. ప్రస్తుత ఉద్యోగులైతే.. మీరు ఫినిష్ చేసిన టార్గెట్స్, ఇటీవల సాధించిన విజయాలను తెలియజేసి శాలరీ హైక్ కోసం నెగోషియేషన్ చేయవచ్చు. ఆర్థిక సమస్యలతో కంపెనీలో ఇటీవల చాలా మంది ఉద్యోగులను తొలగిస్తే.. కంపెనీ స్థిరపడే వరకు శాలరీ హైక్ కోసం వేచి ఉండడం బెటర్.

5. డిస్కషన్ కు ముందు ప్రిపరేషన్

శాలరీ నెగోషియేషన్ మీటింగ్ ముందు ప్రిపరేషన్ అవసరం. మీకు మీరుగా లేదా మీ స్నేహితుడు, కుటుంబ సభ్యుడి తో మీటింగ్ లో ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేయండి. ఒకటి రెండు సార్లు ఏం మాట్లాడాలో ప్రాక్టీస్ చేయండి. మీరు మాట్లాడిన విధానంపై కుటుంబ సభ్యుల అభిప్రాయం అడిగి తెలుసుకోండి. ఇంకా ఎలా మెరుగుపర్చుకోవాలో వారి సలహాలు తీసుకోండి.

6. కాన్పిడెంట్ గా ఉండండి

శాలరీ నెగోషియేషన్ మీటింగ్ లో మీ మాట తీరు, ప్రవర్తన కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీటింగ్ సమయంలో నిటారుగా కూర్చోవడం, ఐ కాంటాక్ట్, మీ ఉద్దేశం స్పష్టంగా చెప్పడం, చేతులు దూరంగా ఉంచి, చెస్ట్ ఓపెన్ ఉంచడం.. ఇలాంటి ఫిజికల్ పొజిషన్స్ పాటించాలి. నెగోషియేషన్ సమయంలో ఎట్టిపరిస్థితుల్లో హార్ష్ గా మాట్లాడకూడదు. మీతో మాట్లాడటానికి సమయం కేటాయించినందుకు కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ మీ సంభాషణ స్టార్ట్ చేయండి. జాబ్ పై మీకున్న ఆసక్తిని తెలియజేయండి. సందర్భాన్ని బట్టి నవ్వండి. కంపెనీ ప్రతినిధులు చెప్పే ప్రతీ విషయాన్ని శ్రద్ధగా వినండి.

7. ఎక్కువతో స్టార్ చేసి తక్కువ

జీతం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు.. మీరు అడగాలనుకున్న దాని కంటే కాస్త ఎక్కువగానే అడగండి. నెగోషియేషన్ లో మీరు అనుకున్న శాలరీ ప్రతిపాదన వస్తే ఓకే చేయండి.

Also Read: జీతం వచ్చిన వెంటనే ఇలా చేస్తే డబ్బు కొరత ఉండదు

 

Tags

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×