E-Paper
Advertisement

Gen Zని ఫిదా చేస్తున్న.. టాప్ – 5 వైర్డ్ ఇయర్ ఫోన్స్.. మ్యూజిక్ లవర్స్‌కు పండుగే!

Gen Zని ఫిదా చేస్తున్న.. టాప్ – 5 వైర్డ్ ఇయర్ ఫోన్స్.. మ్యూజిక్ లవర్స్‌కు పండుగే!
Advertisement

Wired Earphones 2026: ప్రస్తుతం మార్కెట్లో వైర్ లెస్ ఇయర్ బడ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు వైర్డ్ ఇయర్ ఫోన్స్ పెద్ద ఎత్తువ వినియోగించిన యూత్.. కొద్ది కాలం నుంచి బ్లూటూత్ కనెక్షన్ తో వస్తున్న ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్ వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే ప్రస్తుత జెన్ జీ యూత్.. తిరిగి పాత పద్దతి వైపు మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. క్వాలిటీ మ్యూజిక్, ఛార్జింగ్ సమస్యలు లేకుండా.. అడ్వాన్స్డ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేస్తున్నట్లు టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రూ.5000 బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్, వాటి ప్రధాన ఫీచర్లు ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

యాపిల్ ఇయర్ బడ్స్

క్లాసిక్ డిజైన్, స్పష్టమైన వాయిస్ కాల్స్ కు యాపిల్ ఇయర్ బడ్స్ బాగా పాపులర్ అయ్యాయి. చెవి ఆకృతికి తగ్గట్టుగా ‘సెమీ ఓపెన్’ డిజైన్ తో ఇవి రూపొందాయి. కాబట్టి ఎక్కువ సేపు పెట్టుకున్నా ఏమాత్రం అసౌకర్యంగా అనిపించదు. బ్యాలెన్స్డ్ సౌండ్, వాల్యూమ్ సర్దుబాటు, మ్యూజిక్ – వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్, కాల్స్ ఆన్సర్ చేసే సౌలభ్యాన్ని ఇవి అందిస్తాయి.

బోట్ బేస్ హెడ్స్ 122

Advertisement

బడ్జెట్ ధరలో మంచి బేస్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్, చిక్కుపడని టాంగిల్ ఫ్రీ కేబుల్ తో ఇది రూపొందింది. దీనిలోని ‘సూపర్ ఎక్స్‌ట్రా బేస్’ టెక్నాలజీ.. మ్యూజిక్ లవర్స్ కు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇన్ లైన్ మైక్రోఫోన్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ 3.5ఎంఎం గోల్డ్ ప్లేటెడ్ జాక్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది.

శాంసంగ్ టైప్-సీ ఇయర్ ఫోన్స్

శాంసంగ్ ఫ్లాగ్ షిప్ మెుబైల్స్ కోసం ప్రధానంగా ఈ ఇయర్ ఫోన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇన్ ఇయర్ డిజైన్, ఫాబ్రిక్ కేబుల్‌తో ఇది రానుంది. ఫ్యాబ్రిక్ రావడం వల్ల వైర్ త్వరగా పాడుకాదని శాంసంగ్ వర్గాలు చెబుతున్నాయి. క్లియర్, బ్యాలెన్స్డ్ మ్యూజిక్ ను అందిస్తాయని పేర్కొన్నాయి. USB Type C కనెక్షన్ తో ఇది వస్తుండటం బెస్ట్ అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు.

జేబీఎల్ ట్యూన్ 310

Advertisement

ఇది కూడా USB C కనెక్టింగ్ సపోర్ట్ తో రూపొందింది. ‘ప్యూర్ బేస్’ సౌండ్‌ను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఫ్లాట్ కేబుల్ డిజైన్ అల్యూమినియం హౌసింగ్, 3 బటన్ రిమోట్, మైక్రోఫోన్, హై రెస్ (Hi-Res) ఆడియో సర్టిఫికేషన్, EQ సెట్టింగ్స్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది.

Also Read: మార్కెట్లోకి వచ్చేసిన OnePlus Pad 4.. రూ. 5,000 డిస్కౌంట్.. ధర, ఫీచర్ల వివరాలివే!

సెన్‌హీజర్ సీఎక్స్ 80యూ

సహజసిద్దమైన నేచురల్ సౌండ్ ను కోరుకునేవారికి ఈ ఇయర్ ఫోన్స్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. దీని డిజైన్ స్మాల్ గా ఉండటం వల్ల.. చెవిలో చక్కగా సెట్ అయిపోతుంది. అనవసరమైన బేస్ లేకుండా సంగీతాన్ని ఒరిజినల్‌గా వినాలనుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఇన్ లైన్ స్మార్ట్ రిమోట్, కాల్స్ కోసం మైక్రోఫోన్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

Also Read: హోరెత్తిన కేరళ వీధులు.. రాజకీయ వైరం మరిచి.. ఒక్కటైన ప్రత్యర్థి పార్టీలు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×