E-Paper
Advertisement

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా
Advertisement

How to find UAN number:  ఉద్యోగం మారినప్పుడు లేదా పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేటప్పుడు.. ప్రతీ ఉద్యోగికి యుఎన్ (Universal Account Number – UAN) చాలా ముఖ్యం. ఒక వేళ మీ UAN నంబర్ మరచి పోతే.. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పీఎఫ్ మెంబర్ ఐడీ ఉన్నా లేదా అసలు ఎలాంటి వివరాలు లేకపోయినా సరే.. కేవలం మీ ఆధార్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సాయంతో ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా UAN తెలుసు కోవచ్చు. దీనికి సంబంధించిన స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్, వివరాలు ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం.

పద్ధతి 1: మెంబర్ ఐడీ (Member ID) లేకుండా UAN తెలుసుకోవడం ఎలా ?

మీ దగ్గర పీఎఫ్ మెంబర్ ఐడీ లేదా పాత స్లిప్పులు ఏవీ లేకపోయినా.. ఈ క్రింది విధానంలో మీ UAN తెలుసుకోవచ్చు.

Advertisement

యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌కి వెళ్లండి: EPFO సభ్యుల ఈ-సేవ అధికారిక వెబ్‌పేజీని ఓపెన్ చేయండి.

‘Know Your UAN’ ఎంచుకోండి: హోమ్‌పేజీ కుడి వైపున ఉండే..ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో.. ‘Know Your UAN’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

Advertisement

ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి: ఆధార్ కార్డ్‌కు లింక్ అయిన..మీ మొబైల్ నంబర్, స్క్రీన్‌పై కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ‘Request OTP’ పై క్లిక్ చేయండి.

OTP వెరిఫికేషన్: మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ‘Validate OTP’పై క్లిక్ చేయండి.

వ్యక్తిగత వివరాలు: 

మీ పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.

ఐడెంటిటీ ఆప్షన్లలో Aadhaar లేదా PAN ఎంచుకుని, వాటి నంబర్ ఎంటర్ చేయండి.

Show My UAN: క్యాప్చా ఎంటర్ చేసి ‘Show My UAN’ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ 12 అంకెల UAN నంబర్ స్క్రీన్‌పై.. కనిపిస్తుంది.

పద్ధతి 2: మెంబర్ ఐడీ (Member ID) సహాయంతో UAN తెలుసుకోవడం

1.ఒక వేళ మీ వద్ద మీ కంపెనీకి చెందిన పీఎఫ్ మెంబర్ ఐడీ ఉంటే.. ప్రాసెస్ ఇంకా వేగంగా పూర్తవుతుంది.

2. ముందుగా.. పేర్కొన్న విధంగానే EPFO మెంబర్ పోర్టల్‌లో ‘Know Your UAN’ ఆప్షన్‌కి వెళ్లండి.

3. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత.. ఐడెంటిటీ వివరాల వద్ద Member ID ని సెలెక్ట్ చేసుకోండి.

4. మీ రాష్ట్రం, సంబంధిత EPFO ఆఫీసు బ్రాంచ్ ఎంచుకుని మీ పీఎఫ్ మెంబర్ ఐడీ నంబర్ ఎంటర్ చేయండి.

5. మీ పేరు, పుట్టిన తేదీ ,క్యాప్చా ఎంటర్ చేసి ‘Show My UAN’ పై క్లిక్ చేస్తే మీ UAN నంబర్ ప్రత్యక్షమవుతుంది.

పద్ధతి 3: సాలరీ స్లిప్ ద్వారా రికవర్ చేయడం:

ఆన్‌ లైన్ పోర్టల్‌కి వెళ్లే ఓపిక లేకపోతే.. మీ వద్ద ఉన్న లేటెస్ట్ పే-స్లిప్‌ను ఒక సారి చూడండి. దాదాపు అన్ని ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఉద్యోగుల నెల వారీ జీతం స్లిప్‌పై పీఎఫ్ నంబర్‌తో.. పాటు 12 అంకెల UAN నంబర్‌ను తప్పని సరిగా ముద్రిస్తాయి.

పద్ధతి 4: మిస్డ్ కాల్ లేదా SMS ద్వారా (ఆఫ్‌లైన్ మార్గం)

మీ UAN ఇప్పటికే యాక్టివేట్ అయి, మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే..

మిస్డ్ కాల్: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా.. SMS రూపంలో మీ UAN, పీఎఫ్ వివరాలు అందుతాయి.

SMS సేవ: మీ మొబైల్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేసి.. 7738299899 నంబర్‌కి మెసేజ్ పంపినా.. వివరాలు లభిస్తాయి.

మీ UAN నంబర్ తెలిసిన వెంటనే.. దాన్ని ఒక చోట సేవ్ చేసుకోవడం లేదా స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోవడం మంచిది. మెంబర్ ఐడీ ఉన్నా లేకపోయినా.. కేవలం ఆధార్ లేదా రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ఉంటే చాలు, పైన తెలిపిన పద్ధతుల ద్వారా ఏజెన్సీలకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఉచితంగా మీ UAN నంబర్‌ను పొందవచ్చు.

Tags

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×