E-Paper
Advertisement

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!
Advertisement

Heartwarming Love Story: సినిమాల్లో ప్రేమ కథలు అందరినీ ఆకట్టుకుంటాయి. అనివార్య కారణాలతో విడిపోయిన ప్రేమికులు చివరికి ఒక్కటవ్వడంతో శుభం కార్డు పడుతుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సినిమా కథను తలదన్నే రియల్ లైఫ్ స్టోరీ. ఇంకా చెప్పాలంటే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. బిహార్‌ లో జరిగిన ఈ అరుదైన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 48 సంవత్సరాల క్రితం విడిపోయిన భార్యాభర్తలు చివరకు మళ్లీ కలుసుకోవడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. ముఖ్యంగా, భార్య చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూసి భర్త ఆమెను గుర్తుపట్టడం మరో ఆసక్తికర విషయం.

పెళ్లైన ఆరు నెలలకే భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి..

బీహార్‌లోని పట్నా జిల్లాకు చెందిన లలన్ మిశ్రా, నిర్మలా దేవి 1977 మార్చిలో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత ఎక్కువకాలం వారి కాపురం కొనసాగలేదు. కుటుంబంలో వచ్చిన విభేదాలు, అత్తింటి సమస్యల కారణంగా వివాహమైన ఆరు నెలలకే నిర్మలా దేవి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమెను తిరిగి తీసుకురావడానికి లలన్ మిశ్రా చాలాసార్లు ప్రయత్నించారు. బంధువులు, పరిచయస్తుల ద్వారా కూడా వెతికారు. కానీ, ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయారు. అయినప్పటికీ భార్య తిరిగి వస్తుందనే ఆశను మాత్రం ఆయన వదులుకోలేదు. మరో పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పినా, ఆయన ఒప్పుకోకుండా జీవితాంతం ఒంటరిగానే ఉండిపోయారు.

Advertisement

Read Also: లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

ఐదు దశాబ్దాల తర్వాత భర్త దగ్గరికి..

ఇక నిర్మలా దేవిని.. ఆమె తండ్రి ఆమెను మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ కు తీసుకెళ్లారు. అక్కడ ఉద్యోగం చేయడంతో పాటు తన ఇద్దరు కుమారులను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. పిల్లలు జీవితంలో స్థిరపడిన తర్వాత ఆమెకు మళ్లీ తన స్వగ్రామం, గత జీవితం గుర్తుకొచ్చాయి. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత తన భర్తను వెతుక్కుంటూ బిహార్‌కు వచ్చింది. చాలా కాలం కావడంతో మొదట లలన్ మిశ్రా ఆమెను గుర్తుపట్టలేకపోయారు. వయసు పెరగడంతో ఇద్దరూ మారిపోయారు. అయితే, మాట్లాడుకుంటున్న సమయంలో నిర్మలా దేవి చేతిపై ఉన్న పాత పచ్చబొట్టు కనిపించింది. పెళ్లి రోజుల్లో చూసిన అదే పచ్చబొట్టు అని గుర్తించిన వెంటనే ఆమె తన భార్యేనని ఆయనకు అర్థమైంది. ఆ క్షణంలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. లలన్ మిశ్రా ఆనందంతో భార్యను గట్టిగా హత్తుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇద్దరూ మళ్లీ కలవడం అక్కడున్న వారిని కూడా కంటతడి పెట్టించింది. నిజమైన ప్రేమకు కాలం అడ్డంకి కాదని, అనుబంధం బలంగా ఉంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ బంధం నిలిచి ఉంటుందని ఈ ఘటన నిరూపించింది.

Advertisement

Read Also: స్మశానంలో ప్రేమాయణం.. ఇదేం పిచ్చిరా అయ్యా!

Related News

పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!

Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

రాత్రిపూట వెలిగే మొక్కలు వచ్చేశాయి.. ‘అవతార్‘ సినిమాలో చూసింది ఇప్పుడు నిజమైంది!

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

Big Stories

Advertisement
×