Mutual Funds Investment: భవిష్యత్తు అవసరాలకు, పదవీ విరమణ తర్వాత జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. ఆర్థిక ప్రణాళిక అవసరం. అధిక మొత్తంలో రాబడి రావాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఓ మార్గం. వీటిల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఒకేసారి రూ.13 లక్షలు పెట్టుబడులు పెడితే 38 ఏళ్లకు రూ.9 కోట్ల రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి పెద్ద మొత్తంలో ఎక్కువ కాలానికి పెట్టుబడి పెట్టడం ద్వారా.. అధిక రాబడిని సొంత చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడులకు అధిక రాబడిని ఇస్తాయి. స్టాక్ మార్కెట్ ను అంచనా వేసుకుంటూ.. చాలా ఏళ్ల పాటు పెట్టుబడి మొత్తాన్ని కదపకుండా ఉంచితే భారీ సంపదను సృష్టించుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో అసలుపై మాత్రమే కాకుండా, లాభాలపై కూడా రాబడి వస్తుంది.
మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి రూ.13 లక్షలు పెట్టుబడి పెడితే.. రూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.9 కోట్ల సంపదను జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఒకేసారి రూ.13 లక్షలు 28 ఏళ్లకు పెట్టుబడి పెట్టారనుకోండి. వార్షిక రాబడి రేటు 12 శాతం అంచనా వేసుకుంటే మొత్తంగా రూ. 3,10,49,026 కార్పస్ వస్తుంది. అంటే రూ.3 కోట్ల కార్పస్‌ను సృష్టించడానికి కనీసం 28 సంవత్సరాలకు మ్యూచువల్ ఫండ్లలో రూ.13 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రూ.6 కోట్ల రాబడికి 34 సంవత్సరాలు, రూ.9 కోట్ల రాబడికి 38 సంవత్సరాలకు రూ.13 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి.
మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రూ. 9 కోట్ల కార్పస్ చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. అందుకే ఇన్వెస్టర్లు లాంగ్ టర్మ్ ప్రణాళికలు వేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
రూ.3 కోట్ల టార్గెట్
రూ. 6 కోట్ల టార్గెట్
రూ. 9 కోట్ల టార్గెట్
Disclaimer : మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటాయి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణులు సలహాలు తీసుకోండి. ఈ ఆర్టికల్ ఇంటర్నెట్ ఆధారిత సమాచారం మాత్రమే. కేవలం రీడర్ అవగాహన కోసమే పబ్లిష్ చేస్తున్నాము.
Also Read: గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడుల వరద.. ఈక్విటీలతో సమానంగా ఇన్వెస్ట్మెంట్స్