E-Paper
Advertisement

Gold ETF Investments: గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడుల వరద.. ఈక్విటీలతో సమానంగా ఇన్వెస్ట్మెంట్స్

Gold ETF Investments: గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడుల వరద.. ఈక్విటీలతో సమానంగా ఇన్వెస్ట్మెంట్స్
Advertisement

Gold ETF Investments: గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్(ETF)లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. జనవరిలో ఈక్విటీలతో సమానంగా పెట్టుబడులు కొనసాగాయి. జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.24,039.96 కోట్లను ఆకర్షించాయి. ఈటీఎఫ్ పెట్టుబడులు డిసెంబర్ 2025లో రూ.11,646.74 కోట్ల కాగా జనవరిలో ఇవి రెట్టింపు అయ్యాయి. గత నెలలో 106% పెరిగాయి. జనవరిలో అత్యధిక నెలవారీ ఇన్‌ఫ్లో నమోదైంది. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలలో గత నెలలో రూ.24,029 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

గోల్డ్ కు డిమాండ్ పెరగడంతో

గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు పెరగడానికి బంగారానికి డిమాండ్ పెరగడమే కారణమని నిపుణులు అంటున్నారు. గోల్డ్ ను పెట్టుబడిదారులు సురక్షితంగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు.. ఫిజికల్ గోల్డ్ తో పోలిస్తే ఈటీఎఫ్ ల నిర్వహణ సులభంగా భావిస్తున్నారు. గత నెలలో మ్యూచువల్‌ ఫండ్స్ సంస్థల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో రూ.80.23 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ జనవరికి రూ.81.01 లక్షల కోట్లకు చేరింది. డిసెంబర్‌లో రూ.66,591 కోట్ల నిధులు తరలిపోగా, జనవరిలో నికరంగా రూ.1.56 లక్షల కోట్ల నిధులు వచ్చి చేరాయి.

ఇండెక్స్ ఫండ్ లను మించి

Advertisement

2025 చివరి నాటికి బంగారం ETFలలోకి పెట్టుబడులు పెరిగాయి. అక్టోబర్‌లో పెట్టుబడులు రూ.7,700 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, నవంబర్‌లో రూ.3,741.79 కోట్లకు తగ్గాయి. డిసెంబర్‌లో మళ్లీ తిరిగి పుంజుకున్నాయి. గత రెండు నెలలుగా కొనసాగుతున్న పెరుగుదలతో నికర ఆస్తి నిధులకు మించి బంగారానికి అనుకూలంగా పెట్టుబడిదారులు కేటాయిస్తున్నారు. మరోవైపు, ఇండెక్స్ ఫండ్‌లు జనవరి 2026లో రూ.23 కోట్ల పెట్టుబడులను తక్కువ నమోదు చేశాయి.

Also Read: నెలకు రూ.5,000 SIP vs రూ.60,000 ఒకేసారి పెట్టుబడి.. 10 ఏళ్లలో ఎక్కువ రాబడి ఎవరికంటే?

క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులు

Advertisement

ఈక్విటీ స్కీమ్స్‌లో ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్స్‌ లో రూ.7,672 కోట్లు, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ లో రూ.3,185 కోట్లు, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.3,182 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.2,005 కోట్లు, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.2,942 కోట్లు పెట్టుబడులు వచ్చి చేరాయి. ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ నుంచి రూ.593.69 కోట్లు ఉపసంహరించుకున్నారు.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×