BigTV English

shocking discounts on maruthi car: ఆ కారుపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 80,000 తగ్గింపు

shocking discounts on maruthi car: ఆ కారుపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 80,000 తగ్గింపు
shocking discounts on maruthi car
shocking discounts on maruthi car

shocking discounts on maruthi car (today latest news telugu ) : ప్రస్తుతం కాలంలో బైక్ డ్రైవింగ్ అంటే జనాలు బోర్ గా ఫీల్ అవుతున్నారు. కార్ల వైపే వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎంచక్కా కారులో కూర్చుని ఏసీ ఆన్ చేసుకుని హాయిగా వెళ్లి రావొచ్చనే ఆలోచనలతో కార్ల అమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. అందులోను ఇది వేసవికాలం కాబట్టి బైకులపై ప్రయాణం అంటే సాహసమనే అంటున్నారు. విపరీతంగా పెరుగుతున్న ఎండల కారణంగా బైకులపై ప్రయాణించి.. వడదెబ్బ వంటి ప్రమాదాలు తెచ్చుకునే కంటే కారు కొనుక్కోవడం మేలని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో వాహనదారుల ఆలోచనలను కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. పండుగలు వస్తున్నాయంటే భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ కార్ల అమ్మకాలు చేపడుతున్నాయి. ఒక్కో వస్తువుపై వేల డిస్కౌంట్లు ప్రకటించడంతో కొనుగోలుదారులు కూడా ఎగబడి మరి కొనేస్తున్నారు.


పండుగలు వస్తున్నాయంటనే కంపెనీలపై కొనుగోలుదారులు కాసుల వర్షం కురిపిస్తారు. అందులోను మారుతి కంపెనీ కార్లంటే కొనుగోలు చేసేందుకు వాహనదారులు మరింత ఆసక్తి చూపిస్తుంటారు. మారుతి కంపెనీ కార్లపై ప్రకటించే డిస్కౌంట్లు, కంపెనీ వస్తువులపై ఉండే ఫీచర్లు వాహనదారులను మరో నాలుగు రోజుల్లో హోలి పండుగ రానుంది. ఈ క్రమంలో కంపెనీలు వాహనాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ వాహనాల కంపెనీ మారుతి తన క్రేజీ కారు ‘గ్రాండ్ విటారా’పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం రూ. 80,000 భారీ డిస్కౌంట్ తో ఈ కారును కొనుగోలుదారుల ముందుకు తీసుకువచ్చింది. మారుతి కంపెనీలోని మోస్ట్ క్రేజీ వెహికల్ గ్రాండ్ విటారాపై ప్రస్తుతం రూ. 80, 000 డిస్కౌంట్ ప్రకటించగా.. అందులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్ గాను, మిగతా రూ. 50,000 ఎక్ఛేంజ్ బోనస్ గాను కంపెనీ ప్రకటించింది. మరికొన్ని కార్లపై కూడా సరికొత్త డిస్కౌంట్ ను ఇస్తోంది.

మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్స్ గల పలు కార్లపై రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ పై మరో వివరణ కూడా ఇచ్చింది. ఈ భారీ ఆఫర్ కేవలం మార్చి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, మార్చి 31 తర్వాత ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేసింది. ఇందులో కూడా ప్రాంతం, డీలర్ షిప్, వేరియంట్, పవర్ ట్రెయిన్ లను బట్టి ఆఫర్లు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో కొనుగోలుదారులు తమ దగ్గరలోని డీలర్ షిప్ లను సందర్శించవల్సిందిగా పేర్కొంది. కాగా, ఫిబ్రవరి నెలలో ఎస్ యూవీపై రూ. 10,000 పెంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రూ. 80,000 ఆఫర్ ప్రకటించడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలంలో కార్లను కొనుక్కోవాలన్న కళ నెరవేరిందని ఆనందపడుతున్నారు.


Tags

Related News

TVS Bikes Price Cut: బైక్స్, స్కూటర్ల ధరలు తగ్గించిన టీవీఎస్.. కొత్త ధరల లిస్ట్ ఇదే!

OTP: ఓటీపీలకు కాలం చెల్లింది.. ఇకపై కొత్త తరహా డిజిటల్ చెల్లింపులు!

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇప్పట్లో ఆగేలా లేదుగా..!

Deceased Account Settlement: చనిపోయిన వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు.. వారసులు ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసా?

BSNL 4G Launch: జియో, ఎయిర్టెల్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్ 4జీ.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Maruti S-Presso: లగ్జరీ బైక్ ధరకే కారు.. జీఎస్టీ ఎఫెక్ట్‌తో ఇంత తగ్గిందా?

Paytm Gold Coins: పేటీఎం కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే గోల్డ్ కాయిన్ మీదే, భలే అవకాశం

Today Gold Rate: తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు, ఈసారి ఎంతంటే?

Big Stories

×