BigTV English

Low Price TVS Scooters: మీ భార్యకు స్కూటీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. వీటిపై ఓ లుక్కేయండి..!

Low Price TVS Scooters: మీ భార్యకు స్కూటీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. వీటిపై ఓ లుక్కేయండి..!

Low Price TVS Scooters: చాలా మంది ప్రేమికులు లేదా భర్తలు లేదా ఇంకెవరైనా.. తమకు ఇష్టమైన వారికి స్కూటీని గిఫ్ట్‌గా ఇద్దామని అనుకుంటారు. కానీ అందులో ఏ స్కూటీ అయితే బెటర్, తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే స్కూటీలు ఏవో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.


ప్రముఖ టీవీఎస్ మోటార్స్ దేశీయ మార్కెట్‌లో సామాన్యుల కోసం లాంచ్ చేసిన సూటర్లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సరసమైన ధరలో లాంచ్ చేయడమే కాకుండా.. ఎక్కువ మైలేజీ ఇచ్చే కంపెనీ స్కూటర్లుగా నిలిచాయి. అందువల్లనే ఈ కంపెనీ స్కూటర్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందువల్ల ఈ కంపెనీ స్కూటర్లలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని గిఫ్ట్‌గా ఇస్తే అవతలి వారు వెంటనే ఫిదా అయిపోతారు. మరి అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

TVS Scooty Pep Plus


టీవీఎస్ మోటార్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ ఒకటి. ఇది మహిళలకు చాలా ఇష్టమైన స్కూటర్‌గా పేరుగాంచింది. ఈ స్కూటీ కేవలం రూ.63,060 నుండి రూ.66,160 ఎక్స్ షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. కాగా ఈ స్కూటీ 5.43 పిఎస్ పవర్, 6.5 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 87.8 సిసి పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ స్కూటీ లీటర్ పెట్రోల్‌తో దాదాపు 50 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. LED డేటైమ్ రన్నింగ్ లైట్స్, హాలోజన్ హెడ్‌లైట్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్ స్టాండ్ అలారం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంది. అలాగే 10 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.

Also Read: వృద్ధులకు సో బెటర్.. రూ. 49000కే ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజీలో కింగ్..!

TVS Jupiter 125

టీవీఎస్ మోటార్స్ కంపెనీలో మరొక అద్భుతమైన స్కూటర్ టీవీఎస్ జూపిటర్ 125. ఇది మహిళలకు చాలా కంఫర్టబుల్. ఈ స్కూటీ వేరియంట్‌లను బట్టి రూ.89,155 నుండి రూ.99,805 ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటుంది. ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, యూఎస్‌బి ఛార్జింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 124.8సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. గరిష్టంగా ఈ స్కూటీ 8.2 పిఎస్ పవర్, 10.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌తో 57.27 కి.మీ మైలేజీ అందిస్తుంది.

TVS Scooty Zest

TVS Scooty Zest తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇది రూ.72,594 నుండి రూ.72,996 ఎక్స్ షోరూమ్ మధ్య అందుబాటులో ఉంటుంది. ఇందులో 109.7సిసి పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. అలాగే ఈ స్కూటీ 7.8 పిఎస్ పవర్, 8.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. కాగా ఈ స్కూటీ లీటర్ పెట్రోల్‌తో 48 కి.మీ మైలేజీ అందిస్తుంది.

TVS NTORQ 125

TVS NTORQ 125 స్కూటీ 124.8సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 9.38 పిఎస్ పవర్, 10.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌తో 47 కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని ధర విషయానికొస్తే.. ఇది రూ.87,271 నుండి రూ.1.08 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటుంది.

Tags

Related News

DMart: డిమార్ట్ సొంత బ్రాండ్ రేట్లు అంత తక్కువా? మిగతా బ్రాండ్ల ధరలతో ఉన్న తేడా ఏంటీ?

Flight Ticket: విమాన ప్రయాణికులకు సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే టికెట్‌లో భారీ రాయితీ

Jio Offer: జియో అదిరిపోయే ప్లాన్.. ఏకంగా మూడు నెలలు వాలిడిటీ.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం!

Tesla Car: భారత్‌ మార్కెట్‌లో టెస్లాకు ఏమైంది? అంచనాలను అందుకోవడం లేదా?

BSNL Freedom Plan: జస్ట్ వన్ రూపీ.. డైలీ 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్!

Airtel Offers: ఇంటర్నెట్ ఇంత చవకా?.. ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ వైఫై!

Big Stories

×