BigTV English
Advertisement

A.P: బాబు ఎఫెక్ట్..గుంటూరులో ఎకరం కోటి?

A.P: బాబు ఎఫెక్ట్..గుంటూరులో ఎకరం కోటి?

AP real boom.. one acre more than one crore rate
గుంటూరు లో కారమే కాదు భూముల రేటు కూడా ఘాటుగానే ఉంది. నిన్నటి దాకా ఓ లెక్క..నేటి నుంచి మరో లెక్క..బాబొచ్చాడని చెప్పండి అంటూ సినిమా డైలాగులు చెప్పుకుంటున్నారు అక్కడి ప్రజలు. జగన్ హయాంలో మూడు రాజధానులని చెప్పి ఏ ఒక్క రాజధాని కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దీనితో రియల్ వ్యాపారం ఒక్కసారిగా ఢమాల్ అయింది. అదే సమయంలో తెలంగాణలో రియల్ జోరు ఊపందుకుంది. ఇప్పుడు మాత్రం రియల్ వ్యాపారులు గుంటూరు భూములను కమర్షియల్ గా మార్చేశారు. నిన్నమొన్నటి దాకా పంట పొలాలుగా దర్శనమిచ్చిన ప్రాంతం నేడు రియల్ వెంచర్లతో దర్శనమిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని పంట పొలాలు కాస్తా ఇప్పడు రియల్ ఎస్టేట్ వెంచర్లతో బిజీగా మారిపోయాయి. ఇప్పటికే అక్కడ గజం ధర 50 వేలు దాకా పలుకుతోంది.


రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కళకళ

చంద్రబాబు సీఎంగా ఉన్నారు కాబట్టి రాజధాని అమరావతిగానే ఫిక్స్ అయిపోయారు జనం. గుంటూరు జిల్లాలలో రిజిస్ట్టేషన్ కార్యాలయాలు రియల్ అమ్మకాలతో రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నాయి. కొనుగోలు, విక్రయదారులతో కళకళలాడుతున్నాయి. భవిష్యత్తులో గుంటూరు ఐటీ రంగానికి అనుగుణంగా ఎదుగుతుందని..హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ మాదిరిగా ఈ ప్రాంతం డెవలప్ మెంట్ ఉంటుందని అంతా ఊహిస్తున్నారు. ఇదే అదనుగా రెవెన్యూ, పంచాయతీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా రియల్ వ్యాపారులు ఇచ్చే డబ్బులకు ఆశపడి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. పచ్చని పంట పొలాలు అమ్మకూడదని నిబంధనలు ఉన్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అధికారులు. రియల్ వెంచర్లకు అడ్డగోలు అనుమతులు ఇచ్చేస్తూ మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అని అందినకాడికి లంచాలు అందుకుంటూ అడిినవాళ్లకు అడిగినట్లుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు.


ట్రై సిటీ ప్రతిపాదనలు

మామూలుగానే గుంటూరు, విజయవాడ, తెనాలి పదేళ్ల క్రితమే కమర్షియల్ గా అన్ని హంగులతో అభివృద్ధి చెందాయి. ఈ మూడు పట్టణాలు పక్కపక్కనే ఉండటంతో జంట నగరాల మాదిరిగా ట్రై సిటీ గా డెవలప్ చేయాలనే యోచన ఉంది ఎప్పటినుంచో. చంద్రబాబు సీఎం కావడంతో కేంద్రం నుంచి నిధులు వస్తాయని అంతా భావిస్తున్నారు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బాబుకు సంపూర్ణ సహకారం అందిస్తుందని అనుకుంటున్నారు. పైగా విదేశాలలో ఉన్న తెలుగువారు కూడా రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని..మరిన్ని ఐటీ కంపెనీలకు హబ్గా రాజధాని ప్రాంతం డెవలప్ కానుందని అనుకుంటున్నారు. గుంటూరు విజయవాడను అనుసంధానం చేస్తూ అవుటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఉంది. మెట్రో లైన్ ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ కేంద్రం అందించే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సమకూర్చుకోవాలని టీడీపీ భావిస్తోంది.

కేంద్ర సాయం పైనే ఆశలన్నీ..

మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో మోదీకి ఆ మాత్రం మెజారిటీ రావడానికి కారణం దక్షిణాది ఓటర్లే. అందులో ప్రత్యేకంగా ఏపీ లో వచ్చిన మెజారిటీ స్థానాలతోనే మోదీ ప్రభుత్వం గట్టెక్కింది. అందుకే ఈ సారి బడ్జెట్ లోనూ ఏపీని భారీగా నిధులు, ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. అలా కాకపోయినా ప్రత్యేక గ్రాంట్ల తో కేంద్రం ఏపీకి తన సహకారం అందించే ఛాన్స్ ఉంది. బడ్జెట్ లో కేటాయింపులు జరిగితే అది మిగిలిన రాష్ట్రాలు సైతం డిమాండ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఏపీకీ మరిన్ని నిధులు ఇచ్చేలా ప్రత్యేక గ్రాంట్ ఇన్ ఎయిడ్ వర్తించేలా కేంద్రం అడుగులు వేస్తోందని అంతా భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో రాజధానికి దగ్గరలో ఉన్న నర్సరావు పేట, చిలకలూరి పేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలలో ఎకరం కోటి రూపాయలకు పైగా పలుకుతోందని సమాచారం.

Related News

Tdp Tweet: కోడి కత్తి.. కమల్ హాసన్.. టీడీపీ ర్యాగింగ్!

ChandraBabu NDA: బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు ప్రచారం.. మరి జూబ్లీహిల్స్ సంగతేంటి?

Ysrcp Google: జగన్ వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ గుడివాడ.. గూగుల్ ఎపిసోడ్ తో వైసీపీకి భారీ డ్యామేజ్

AP Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. 27నాటికి తుపానుగా మారే అవకాశం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Pawan Kalyan – Hydraa: హైడ్రాపై పవన్ కల్యాణ్ ప్రశంసలు, అన్ని రాష్ట్రాలకు అవసరమని వ్యాఖ్య!

AP Heavy Rains: ఏపీకి తుపాను ముప్పు.. రానున్న నాలుగు రోజులు అత్యంత భారీ వర్షాలు

Tirumala Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Trolling On Jagan: బీకామ్‌లో ఫిజిక్స్.. డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏఐ, అయ్యో జగన్!

Big Stories

×