E-Paper
Advertisement

దేశంలో అతిపెద్ద జియో ఐపీఓ.. బుధవారం నుంచి ప్రారంభం, 22 శాతానికి చేరిన జీఎంపీ

దేశంలో అతిపెద్ద జియో ఐపీఓ.. బుధవారం నుంచి ప్రారంభం, 22 శాతానికి చేరిన జీఎంపీ
Advertisement

JIO IPO Updates: దేశ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓకు రెడీ అయ్యింది జియో. దేశీయ టెలికాం రంగంలో కీలకంగా మారిన ఈ సంస్థ, బుధవారం నుంచి తొలి పబ్లిక్ ఇష్యూ మొదలుకానుంది. కేవలం మూడు రోజుల్లో ముగియనుంది. వచ్చేవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టు కానుంది. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడుదారులు తరలిపోతున్న క్రమంలో జియో ఐపీఓపై పరిశ్రమ వర్గాలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

బుధవారం నుంచి జియో ఐపీవో ప్రారంభం

పబ్లిక్‌ ఆఫరింగ్‌లో భాగంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన షేర్లను జేపీఎల్‌-JPL ఉద్యోగులకు రిజర్వ్ చేసింది. దాని విలువ రూ.2,500 కోట్ల షేర్లు. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద జియో ప్లాట్‌ఫామ్స్ విలువ రూ.10.3 లక్షల కోట్లకు పైగా ఉండవచ్చని ఓ అంచనా. మొత్తంగా 27 కోట్ల షేర్లు ఇష్యూ చేయనుంది. అందులో ఎల్‌ఐసీ, బ్లాక్‌రాక్, ఫిడిలిటీ, జీఐసీతోపాటు భారతీయ మ్యూచువల్ ఫండ్‌లు యాంకర్ ఇన్వెస్టర్లలో ఉన్నాయి.

దేశ మార్కెట్లో అతి పెద్ద ఐపీవో జియో

Advertisement

గడిచిన నాలుగురోజులుగా ప్రీ అప్లైకి ఛాన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో రోజురోజుకూ అప్లై చేసిన సంఖ్య అమాంతంగా పెరిగింది. యాంకర్ బుక్‌కు ఏకంగా 30 రెట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. దాదాపు రూ.2.5 లక్షల కోట్లు. దేశ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలుస్తుందని మార్కెట్ వర్గాల మాట. జేపీఎల్‌ షేర్లు ఈనెల 28న అంటే వచ్చే బుధవారం స్టాక్‌ ఎక్చేంజ్‌లో లిస్టింగ్ కానుంది. షేర్ల కేటాయింపు అక్టోబర్ 26న ఖరారు అయ్యే అవకాశం ఉంది.

జీఎంపీ క్రమంగా పెరుగుతూ రూ. 245 వద్ద..

సరిగ్గా పదేళ్ల కిందట అంటే 2016లో జియో పేరు మీదుగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ నాటికి జియో టెలికాం సుమారు 53.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. దేశంలోని మొబైల్ డేటా ట్రాఫిక్‌లో దాదాపు 60 శాతం జియో నెట్‌వర్క్‌దే. తొలుత తక్కువ ధరలకు మొబైల్ డేటాను అందించడం జియో ప్రారంభించింది. ఆ తర్వాత కార్యకాలపాలను బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌ప్రైజ్ సేవలు, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాలకు విస్తరించింది.

Advertisement

ALSO READ: చమురు ధరలకు రెక్కలు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 110 డాలర్లు, వచ్చేనెల ధరలు పెరిగే ఛాన్స్

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభానికి ముందు బలమైన గ్రే మార్కెట్ ప్రీమియం-GMP ని ఆకర్షించింది. ఇన్వెస్టర్‌ గెయిన్ డేటా ప్రకారం.. బుధవారం ప్రారంభం కానున్న ఈ ఇష్యూపై బలమైన ఆసక్తి సూచించింది. తొలుత జీఎంపీ రూ. 148 నుంచి మొదలైంది.  ప్రస్తుతం రూ. 250 దాటేసింది. రేపటి రోజున ఇది పెరగవచ్చు, లేకుంటే తగ్గే అవకాశం కూడా ఉండవచ్చు. 17 సెషన్లుగా గ్రే మార్కెట్ ట్రెండ్‌లను విశ్లేషిస్తే.. ప్రీమియం అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది. స్టాక్ మార్కెట్లో బలమైన ఆరంభం ఉంటుందనే అంచనాలను సూచిస్తోందని చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.

Related News

చమురు ధరలకు రెక్కలు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 110 డాలర్లు, వచ్చేనెల ధరలు పెరిగే ఛాన్స్

ఖర్చు చేసేటప్పుడు కుటుంబం, స్నేహితులకు స్పష్టమైన హద్దులు పెట్టండి.. ఆర్థిక క్రమశిక్షణకు 7 టిప్స్

భర్త సంపాదన నెలకు రూ.1.5 లక్షలు.. అయినా భార్యకు భరణం ఇవ్వకూడదని చెప్పిన కోర్టు.. ఎందుకంటే

స్టాక్‌మార్కెట్‌లో బ్లాక్ మండే.. కొంప ముంచిన ఆ రంగాల షేర్లు, 4 లక్షల కోట్ల సంపద ఆవిరి

భారీ ఖర్చు చేశాక పెళ్లి వాయిదా లేదా రద్దు అయిందా.. ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ ఉందిగా

ఆస్తులు బోలెడున్నా చేతిలో నగదు ఉండదు.. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక కష్టాలను నివారించడానికి ఇలా చేయండి

పెళ్లిలో లభించిన బహుమతులుపై ట్యాక్స్ కట్టాలా? ఆదాయపు పన్ను నిబంధనలు ఇవే..

Big Stories

Advertisement
×